Health Tips – ఇన్హేలర్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

By manavaradhi.com

Published on:

Follow Us
INHALER MISTAKES

ఇన్హేలర్ లో ముఖ్యంగా రెండు విషయాలు ఉంటాయి. ప్రొపెల్లెంట్ అనే గ్యాస్ లాంటి పదార్థంతోపాటు మనం తీసుకునే మెడిసిన్. ఈ రెండూ సరిగ్గా ఊపిరితిత్తుల్లోకి వెళితేనే.. ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలుగుతుంది. ఈ రెండు సరిగ్గా లోపలికి వెళ్లాలంటే .. ఇన్హేలర్ వాడే ముందు గట్టిగా ఊపాలి. కానీ చాలా మంది ఇన్హేలర్ ను షేక్ చేయడం మర్చిపోతారు. దీని వల్ల .. ఒక్కోసారి ప్రొపెల్లెంట్ ఎక్కువగా వెళ్లి తీసుకునే మెడిసిన్ తక్కువగా వెళ్తుంది. లేదా ప్రొపెల్లెంట్ తక్కువగా వెళ్లి తీసుకునే మెడిసిన్ ఎక్కువగా వెళ్తుంది. ఈ రెండూ మంచిది కాదు.. అందుకే ఇన్హేలర్ వాడే ముందు బాగా షేక్ చేయాలి.

ఇన్హేలర్ ప్రెస్ చేయగానే శ్వాస గట్టిగా పీల్చి.. త్వరగా వదిలేయడం మంచిది కాదంటున్నారు వైద్యులు. అలా త్వరగా గాలి బయటకు వదిలేస్తే .. తీసుకున్న మెడిసిన్ పని చేసే అవకాశం లేదని చెబుతున్నారు. ఇన్హేలర్ ప్రెస్ చేసి.. మందు ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన తర్వాత శ్వాసను కనీసం 10 సెకన్లపాటు బిగపట్టి ఉంచినప్పుడే సత్ఫలితాలు వస్తాయంటున్నారు. ఇన్హేలర్ వాడేటప్పుడు నోట్లో పైకి లేదా కిందకు వంచి పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ ఇలా వాడడం తప్పు. దీని వల్ల ఊపిరితిత్తుల్లోకి వెళ్లాల్సిన మెడిసిన్.. నోట్లోనే ఉండిపోతుంది.. అందుకే ఇన్హేలర్ ను గొంతుకు నేరుగా పెట్టుకుని వాడుకోవాలి.

కొంత మంది ఇన్హేలర్ ప్రెస్ చేయక ముందే అధికంగా గాలి పీల్చేస్తూ ఉంటారు. మరికొంత మంది చాలా ఆలస్యంగా శ్వాస తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఐతే ఇన్హేలర్ వాడినప్పుడు .. సరైన టైమింగ్ పాటించడం అవసరం. ఇన్హేలర్.. ప్రెస్ చేసిన అర సెకన్లో మందు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం మొదలవుతుంది. ఈ టైమింగ్ ను బట్టి.. శ్వాస తీసుకోవాలి. ముందుగానే ఊపిరితిత్తుల్లోకి గాలి పీల్చి ఉంచితే.. మందు లోపలికి వెళ్లేందుకు జాగా సరిపోదు. కాబట్టి దీనివల్ల మెడిసిన్ అంతా నోట్లో లేదా గొంతులో ఉండిపోతుంది.. దీన్ని నివారించుకునేందుకు మార్కెట్లో స్పేసర్ ట్యూబ్ లు లభిస్తున్నాయి. వీటిని వాడడం వల్ల .. ట్యూబ్లో ఉన్న మెడిసిన్ ను నెమ్మదిగా ఊపిరితిత్తుల్లోకి పంపించవచ్చు.

ఇన్హేలర్ వాడేటప్పుడు.. సరిగ్గా కూర్చోవాలి. లేదా నిలబడి వాడుకోవాలి.. సరైన పద్ధతి లేకుండా కూర్చున్నా.. ఇన్హేలర్ లో నుంచి మెడిసిన్ ఊపిరితిత్తుల్లోకి సరిగ్గా వెళ్లదు. అంతేకాకుండా ఇన్హేలర్ వాడేటప్పుడు గాబరా పడవద్దు. ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత మరో పఫ్ తీసుకునే ముందు కాస్త సమయం ఇవ్వాలి.. వెంటవెంటనే రెండు పఫ్ లు తీసుకుంటే .. ప్రొపెల్లెంట్,మెడిసిన్ .. ఊపిరితిత్తుల్లోకి సరిగ్గా వెళ్లే అవకాశం లేదు. కాబట్టి రెండు పఫ్ ల మధ్య కనీసం నిముషం సమయం ఉండాలి. ఇన్హేలర్ వాడకం అయిపోయిన తర్వాత దాన్ని కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. కొత్త ఇన్హేలర్లు వాడే ముందు ఒక్కసారి గాలిలోనే ఉపయోగించి చూడడం మంచిది. కొన్ని ఇన్హేలర్లలో ప్రొపెల్లెంట్, మెడిసిన్ సరిగ్గా కలిసిపోవు. అందుకే కనీసం 5 సార్లు షేక్ చేసి వాడితే .. రెండు సరిగ్గా కలిసాయో లేదో తెలుస్తుంది. కొత్తది కాకపోయినా.. 2 వారాలు వాడకుండా ఉన్న ఇన్హేలర్ విషయంలోనూ ఈ పద్ధతి పాటించాలి.

Leave a Comment