ఆధునిక సమాజంలో చాలామంది ఆహార అలవాట్లు, వ్యసనాలు, జీవనవిధానం కారణంగా అనేక ప్రాణాంతక రోగాల బారినపడుతున్నారు. మధుమేహం తర్వాత అంతటి ప్రమాదకరమైన వ్యాధి రక్తపోటు. ఈ వ్యాధి ప్రభావం ఒక్క గుండెమీదే కాకుండా అన్ని ప్రధాన అవయవాలపైన తీవ్ర పరిణామాలను చూపిస్తుంది. ఎలాంటి మందులువాడకుండానే కేవలం వ్యాయామాలతో రక్తపోటును ఎలా అదుపులో ఉంచుకోవచ్చునో ఇప్పుడు తెల్సుకుందాం.
రక్తపోటు.. ప్రతిపది మందిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. మన జీవనవిధానం, ఆహారపుటలవాట్ల కారణంగా రక్తపోటు సమస్య నానాటికి తీవ్రమవుతున్నది. కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే ఆఫీసులు ఎక్కువ కావడంతో ఈ సమస్యతో బాధపడే వారి సమస్య కూడా ఎక్కువవుతున్నది. శరీరానికి ఎలాంటి పనికల్పించకపోవడం వల్ల రక్తపోటులో మార్పులు జరుగుతాయని పరిశోధకులు చెప్తున్నారు. ఎలాంటి లక్షణాలు కనిపిం చకుండా శరీరభాగాలపై ప్రభావం చూపుతుంది. తలనొప్పి, నిద్రలేకపోవడం, చూపు మందగించడం, ఆలసట, గందరగోళం, చెవుల్లో ప్రతిధ్వనులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె కొట్టుకునే వేగం హెచ్చు తగ్గుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం వంటి కారణాల వల్ల రక్తపోటు పెరుగుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అందుకని శరీరాన్ని అదుపులో పెట్టుకొని సరైన బరువును మెయింటేన్ చేయడం ద్వారా రక్తపోటును అదుపులో ఉచంచుకోవచ్చు.
చాపకింద నీరులా మనల్ని చుట్టేస్తున్న రక్తపోటు సమస్య నుంచి బయటపడాలంటే వ్యాయామాలు ఒక్కటే మార్గం. రక్తపోటు ముఖ్యంగాఆందోళన, ఒత్తిడికి గురయ్యే వారిలో ఎక్కువగా ఉంటుంది. వీటిని కేవలం వ్యాయామాలతోనే జయించవచ్చు. మనం ఎంత బరువు పెరుగుతామో.. రక్తన్ని సరఫరా చేసే గుండెపై మరింత ఎక్కువ భారం పడుతుంది. అందుకని ముందుగా ఊబకాయాన్ని తగ్గించుకోవాలి. ఒత్తిడి, ఆందోళనను కూడా తగ్గించుకోవాలి. వేటి కారణంగా ఒత్తిడి, ఆందోళన పెరుగుతుందో గమనించి వాటిపై దృష్టిసారించాలి. మనసుకు ఆహ్లాదం కలిగించే తోటపని, సైక్లింగ్, జాగింగ్, వాకింగ్, డ్యాన్సింగ్, యోగా.. ఇలా దేనినైనా ఎంచుకొని నిత్యం కనీసం 30 నిమిషాల పాటు గడపడం అలవాటుచేసుకోవాలి. వ్యాయామం చేయడంలో ఇబ్బందిగా ఉంటే శిక్షకుల సాయం తీసుకోవడం మరిచిపోవద్దు. కండరాలు గట్టిపడేందుకు, శరీరాకృతిని తీర్చిదిద్దేందుకు ఉపకరించే అన్నిరకాల పరికరాలను జిమ్‌లో వాడాలి. వీలైతే ఉదయం సాయంత్రం వేళల్లో ఈత కొట్టేందుకు సమయం కేటాయించడం చాలా మంచిది.

ఇంటికి సమీపంలోని పార్కును ఎంచుకొని నిత్యం కనీసం 30 నిమిషాలపాటు బ్రిస్క్ వాక్ చేయడం చాలా మంచిది. వారంలో కనీసం ఐదు రోజులు వాకింగ్‌కు కేటాయించడం వల్ల మందులు వాడాల్సిన అవసరం తగ్గిపోతుంది. లేదంటే ట్రెడ్ మిల్‌పై కనీసం 10 నిమిషాలు వాక్ చేస్తే సరిపోతుంది. వ్యాయామాన్ని ఒకేసారి చేయకుండా రోజరోజుకు కొంచెం పెంచుతూ పోవాలి. పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ 10 నిమిషాలపాటు వర్క్ అవుట్స్ చేయడం అలవర్చుకోవాలి. బయటకు వెళ్లడం తీరికలేని వాళ్లు ఇంట్లోనే చిన్నపాటి జిమ్ సెటప్ చేసుకోవాలి. వ్యాయామం చేయడానికి ముందుగా చేసే వార్మ్ అప్‌తో శరీరం త్వరగా చల్లబడుతుందని గ్రహించాలి. ఫలితంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హార్ట్‌రేట్, వాకింగ్ కౌంటింగ్ గడియారాల సాయం తీసుకోవడం చాలా మంచిది.
బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణం ఏదైనా ప్రమాదకర పరిస్థితి వచ్చే వరకు గుర్తించలేకపోతున్నారు. బి.పి ఉందని తెలిసిన తరువాత దాన్ని తగ్గించుకోవడానికి నానా పాట్లు పడుతుంటారు. అయితే మందుల వరకు వెళ్లకుండా తీసుకొనే ఆహారంతో పాటు జీవనశైలిలో మార్పు చేసుకోవడం ద్వారా బి.పిని కంట్రోల్ చేసుకోవరరచ్చు.