మనకు ఇష్టం ఉన్నాలేకపోయినా ఏ పనినైనా అమితంగా చేస్తే ఆరోగ్య సమస్యలు తప్పవు. అమితంగా తినడం, అమితంగా వ్యాయామం చేయడం, అమితంగా మాట్లాడటం, అమితంగా పనులు చేయడం.. ఇలా ఏదైనా మితంగా ఉంటేనే బాగుంటుంది. ఆరోగ్యాన్నిస్తుంది. అమితంగా చేసే పనులతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.
అతి సర్వత్రా వర్జయేత్… అంటే అతిగా చేయడం అన్నిచోట్లా తగదని అర్థం. మనకు ఇష్టమైన పని అని ఎక్కువగా చేయడం మనకు మన ఆరోగ్యానికి మంచిది కాదని సెలవిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మీకు ఇష్టమైన సీరియల్ వస్తుందనో.. సినిమా వస్తుందనో రెండు గంటలకు పైగా అలాగే కూర్చుని చూస్తూ మనకిష్టమైన ఆలూ చిప్స్ తినడం మంచిది కాదని గుర్తుంచుకోవాలి. దీని వలన శరీరంలో అనవసర కొవ్వు పెరిగిపోయి ఊబకాయం వచ్చే ప్రమాదం ఉన్నది. అలాకాకుండా ఎంత మేరకు టీవీ చూడాలో.. అలా చూస్తున్నప్పుడు ఎన్ని చిప్స్ తినాలో కూడా ముందే నిర్ణయించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఏ పనిచేస్తున్నా అదేపనిగా కూర్చోవడం మంచిదికాదు. ప్రతి గంటకు ఒకసారి లేచి నిలబడటం చేయాలి. చిన్నపాటి నడక చేయడం కూడా మంచిది. ప్రతిరోజు ఏ సమయానికి పడుకుంటామో అదే సమయాన్ని అలవర్చుకోవాలి. అలాకాకుండా రెండు గంటలు తక్కువయ్యేట్లు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలా కాకుండి ఇష్టమొచ్చిన టైం కు పడుకోవడం.. అతిగా పడుకోవడం వల్ల డిప్రెషన్‌కు గురవడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, గుండె సంబంధ సమస్యలు కనిపిస్తాయి. అందుకని 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం శుభదాయకం.
అదేపనిగా కూర్చొని పనిచేయడం వల్ల మన శరీరం తక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది. అలాగే అదనపు కొవ్వును నిల్వచేస్తుంది. క్రమంతప్పకుండా పనిచేసి సరైన ఆహారం తిన్నప్పటికీ నిద్రపోయే సమయాలు సక్రమంగా లేకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు. ఎక్కువ వ్యాయామం చేయడం కూడా శరీరానికి మంచిది కాదు. ఎక్కువగా టీవీ కార్యక్రమాలుచూడటంగానీ, ఎక్కువ సమయం మొబైల్ ఫోన్‌పై వెచ్చించడం ఆరోగ్యానికి హానికరం. ఎక్కువగా చూస్తూ ఉండటం వల్ల కంటిలోని ద్రవాలు ఆవిరైపోయి డ్రై ఐ గా తయారవుతుంది. కళ్లు మసకబారిపోయే ప్రమాదం ఉంది. అందుకని ప్రతి 20 నిమిషాలకు ఒకసారి దృష్టిని మరల్చాలి. టీవీ మనం కూర్చుండేచోటుకు కనీసం 20 నుంచి 28 ఫీట్ల దూరంలో ఉండేలా చూసుకోవాలి. అదేపనిగా కనురెప్పలు కొట్టకుండా ఉండటం సమస్యాత్మకం. కంటికి 4-5 ఇంచులు కిందగా టీవీలను అమర్చుకోవడం ద్వారా కంటిపై ఎక్కువగా భారం పడదు. టీవీలు కానీ స్మార్ట్ డివైస్‌లు కానీ సరైన విధంగా స్క్రీన్ వెలుతురు ఉండనిపక్షంలో కంటిపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది.
ఇకపోతే ఎక్కువ సేపు ఒక ప్రాంతంలో కూర్చోవడం శరీరానికి మంచిదికాదు. కూర్చునే భంగిమ సరిగా ఉందో లేదో సరిచూసుకోవాలి. ప్రతి అరగంటకు ఒకసారి 5నిమిషాలు అటూ ఇటూ నడవాలి. మనం కూర్చునే కుర్చి సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. స్ట్రేయిట్‌గా కూర్చొని కుర్చీ మన నడుంకు ఆధారం ఇచ్చేదిగా మార్చుకోవాలి. అదేపనిగా మనకు ఇష్టమైన కార్యక్రమాలు చూస్తూ కూర్చున్నప్పుడు పక్కనుంచే ప్రపంచాన్ని మరిచిపోతాం. మనింటికి ఎవరకు వచ్చారో.. ఎవరు మనల్ని పిలుస్తున్నారో కూడా తెలియనంతగా లీనమైపోతాం. దీనివల్ల వచ్చిన అతిథులు మన వైఖరి కారణంగా నొచ్చుకోవడం, లేదంటే కసురుకుని వెళ్లిపోవడం చేస్తుంటారు. అతిగా చూడటం బాధ కలిగిస్తుంది. దీనివల్ల ఎక్కువ నిద్రపోకపోవచ్చు, లేదా. రెండూ మనల్ని నిరాశకు గురి చేస్తాయి. తరచుగా ఒంటరిగా ఉండటం కూడా సహాయపడదు. సూర్యరశ్మి, వ్యాయామం, ఇతరుల సహవాసం మనకు మంచి అనుభూతిని కలిగిస్తాయి.
అమితంగా అలసిపోయే విధమైన, అధికంగా వత్తిడి కలిగే కార్యక్రమాలు తక్కువగా చేయాలి. మనకు ఇష్టం ఉన్నా అతిగా ఏది చేసినా అది అనర్థదాయకమే అని గుర్తుంచుకోవాలి.