Health Tips: కొన్ని ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ..!

By manavaradhi.com

Published on:

Follow Us
Fast Food Effects

ప్రతి రోజు మన ఆహారంలో చాలా కొలువుదీరి ఉండే వస్తువుల్లో కొన్ని శరీరానికి అనుకూల, ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. మనం తినే కొద్దిపాటి ఆహారంలో కూడా అత్యంత ప్రమాదకరమైన ఆహారాలు ఉన్నాయనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. కొన్ని అనారోగ్య‌క‌ర ఆహారాలు మీ వంటింట్లో ఉన్న విష‌యం మీకు తెలుసునా? అని ప్ర‌శ్నించుకుంటే చాలా ఇండ్ల‌ల్లో అవున‌నే స‌మాధానం వ‌స్తుంద‌ని చెప్ప‌డంలో ఏమాత్రం అతిశ‌యోక్తి లేద‌ని చెప్పాలి. వాస్తవానికి మ‌నం తీసుకొనే అనేక ఆహారాలు మ‌న‌లో వ్యాధులతో పోరాడటానికి సహాయపడే రోగనిరోధక వ్యవస్థ పనితీరును పెంచుతాయి. రెస్టారెంట్లలో నిలువ చేసిన ఆహారం అత్యంత హానికర ఆహారాలలో ఒకటి. వీటిలో క్యాన్సర్ కారకాల‌ను కలిగించే పదార్థాలు ఉంటాయి. అందులోనూ శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

ఫ్రైడ్ ఆహారాలను తయారుచేయటానికి ఉపయోగించే నూనెలు అనారోగ్యకరమైన‌వందున వాటిని దూరంగా పెట్టాలి. ప్యాకేజ్ చిప్స్‌ల‌లో ఉండే మోనోసోడియం గ్లుటమేట్ ప్రాణాంతకమైన సమ్మేళనం. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. సోడాలో కృత్రిమ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలు వృద్ధి చెంద‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అన్ని రకాల కూల్ డ్రింక్స్, సోడాలు అనారోగ్యాన్ని క‌లిగిస్తాయి.

మైక్రోవేవ్ లో వేయించిన పాప్‌కార్న్‌లో న‌కిలీ ఫాక్స్ బ‌ట్ట‌రీ ఫ్లేవ‌ర్స్ ఉండి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. దీనిలో ప్రాణాంతకమైన ఉప్పు కంటెంట్, రుచిని జోడించడానికి ఉపయోగించే నూనెలు ప్రాణాంతకంగా మారి క్యాన్స‌ర్ వ్యాధి కార‌కాలుగా ప‌నిచేస్తాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ప్రపంచంలో అత్యంత అనారోగ్య ఆహారాలలో ఒకటిగా ఉన్నాయి. అధిక బరువు, ఊబకాయం వంటివి ఫ్రెంచ్ ఫ్రైస్ వల్ల వస్తాయి. వీటిలో ఉప్పు, సంతృప్త కొవ్వు భారీగా ఉంటాయి. అలాగే చెర్రీ సీడ్స్, సరిగ్గా ఉడకని బీన్స్ కూడా తినకూడదు.

Foods as You Age

వంటింట్లో ఉన్నాయి కదాని కొన్ని రకాల ఆహారాలను తింటే అనారోగ్యం ముప్పు తప్పదు. స్టార్ ఫ్రూట్ ను కిడ్నీ సమస్యలున్నవారు తినకూడదు. పుట్ట గొడుగులను కూడా వైద్యుల సలహాతోనే తీసుకోవాలి. పచ్చి నేరేడు పండ్లు, జీడిపప్పు తీసుకోవద్దు. వీటి వల్ల అలర్జీ రియాక్షన్ ఏర్పడే ప్రమాదం ఉంది. వెన్న‌కు బ‌దులుగా వాడే మార్గ‌రైన్ కార‌ణంగా ఎల్‌డీఎల్ కొవ్వులు పెరుగుతాయి. వీటికి బ‌దులుగా అలీవ్ ఆయిల్, గ్రేప్‌సీడ్ ఆయిల్‌ వాడ‌టం చాలా మంచిది.

రుచుల కోసం క‌లిపే కృత్రిమ స్వీట్నర్లు అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అందువల్ల వంటిట్లో ఉండే శత్రువులకు దూరంగా ఉంటే ఎంతో మంచిది. అలగే సాల్మోనెల్లా బ్యాక్టీరియా, ఈ కొలై బ్యాక్టీరియాలు చిన్నారులతో పాటు పెద్దలకు కూడా హానిత‌ల‌పెడ‌తాయి. శుద్ధిచేయ‌బ‌డిన తేనెను మాత్ర‌మే తీసుకోవాలి. ముడి తేనెలో హానికరమైన టాక్సిన్ గ్రేయనోటాక్సిన్ I ఉండి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతుంది. అందువల్ల వంటింటి శత్రువులను గుర్తించి సాధ్యమైనంతవరకు వాటికి దూరంగా ఉంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Leave a Comment