Health Tips: తప్పకుండా ప్రతి ఇంట్లో ఉండాల్సిన మందులు ఇవే..!

By manavaradhi.com

Published on:

Follow Us
Emergency Medicine

చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే . . ప్రతి ఒక్కరి ఇంట్లో ఓ మెడికల్ బాక్స్ ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా.. గాయాలైనా .. ప్రాథమిక చికిత్స కోసం కొన్ని మందులను అందరూ అందుబాటులో ఉంచుకుంటారు. ఐతే మెడిసీన్ బాక్స్ లో ఉండే మందులను ఎక్కువ కాలం పాటు ఉంచి మళ్ళీ వాడటం వల్ల మనకు తెలియని ప్రమాదం పొంచి ఉంది.

చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే . . ప్రతి ఒక్కరి ఇంట్లో ఓ మెడికల్ బాక్స్ ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా.. గాయాలైనా .. ప్రాథమిక చికిత్స కోసం కొన్ని మందులను అందరూ అందుబాటులో ఉంచుకుంటారు. ఐతే మెడిసీన్ బాక్స్ లో ఉండే మందులను ఎక్కువ కాలం పాటు ఉంచి మళ్ళీ వాడటం వల్ల మనకు తెలియని ప్రమాదం పొంచి ఉంది.

ప్రతి ఇంట్లో పోపుల పెట్టె ఎలాగో .. మందుల పెట్టె కూడా సాధారణమైపోయింది. చిన్న అనారోగ్య సమస్యలు వస్తే .. వెంటనే వైద్యుని వద్దకు పరుగెత్తకుండా.. ఈ మధ్య అందరూ ఇంట్లోనే ప్రాథమిక చికిత్స చేసుకుంటున్నారు. ఇందుకోసం మందుల షాపులో మందులు కొనుగోలు చేసి .. ఇంట్లో భద్రపరుచుకుంటున్నారు. అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటున్నారు. జ్వరం, దగ్గు, జలుబు , తలనొప్పి, మలబద్ధకం, విరేచనాలు, వాంతులు, కడుపులో మంట, కడుపులో ఉబ్బరంగా ఉండడం లాంటి సమస్యలకు ఇంట్లోని మందులే వాడుకుంటున్నారు. వీటితోపాటు విటమిన్ సప్లిమెంట్లు కూడా అందుబాటులో ఉంచుకుంటున్నారు. ఐతే ఇలాంటి సాధారణ మందులతోపాటు ఒక్కోసారి దీర్ఘకాలిక రోగాలకు సంబంధించిన లేదా వైద్యులు రాసిన మందులు వాడకుండా మిగిలిపోయిన డ్రగ్స్ కూడా మన మెడికల్ బాక్స్ లోనే ఉంటున్నాయి. వీటిని కూడా అవసరానికి తగినట్లు సాధారణంగానే ఉపయోగిస్తున్నారు. వైద్యుల సలహా లేకుండా ఆయా మందుల వాడకం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్ లు కలుగుతున్నాయి.

రకరకాల నొప్పి నివారణ మందులను మనింట్లో సాధారణంగా మెడికల్ బాక్స్ లో ఉంచితే పెద్దలు, పిల్లలు సహా అందరూ ఉపయోగించుకుంటారు. కొన్ని నొప్పి నివారణ మందులను పెద్దవారు వాడుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ బ్లడ్ తిన్నర్స్ వాడే వారికి ఇది చాలా ప్రమాదం . అలాంటి వారు ఈ మందు వాడడం వల్ల కడుపులోని పేగుల్లో రక్తస్రావం అవుతుంది. అలాగే ఆస్ప్పిన్ మందును జలుబు చేసిన వారు ఉపయోగించకూడదు. ఇది ఒక్కోసారి రేయ్ సిండ్రోమ్ కు దారితీసే అవకాశం ఉంది. రేయ్ సిండ్రోమ్ వల్ల మెదడులో, కాలేయంలో వాపులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మిగతా నొప్పి నివారణ మందులు ఐబ్రూఫెన్, నాప్రోక్సెన్ వంటివి కూడా రక్తాన్ని పలుచబరుస్తాయి. ఇప్పటికే రక్తాన్ని పలుచబరిచే మందులు వాడే వారికి ఇది ప్రమాదం . దీనివల్ల అంతర్గతంగా రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్ కు దారి తీయవచ్చు. నొప్పి నివారణ మందులు కూడా కిడ్నీలకు హానిచేస్తాయి.

హార్ట్ బర్న్ కు వాడే మందులను కూడా వైద్యుల సలహా లేకుండా చాలా మంది వాడేస్తుంటారు. నెక్సియం, ప్రిలోసెక్ ,ప్రీవాసిడ్ మందులు యాసిడ్ రిఫ్లెక్షన్ ను తగ్గిస్తాయి. ఐతే ఈ మందులను పదే పదే వాడడడం వల్ల ప్రేవుల్లో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే నోటితో చప్పరించే యాంటాసిడ్స్ కు కూడా ఇదే వర్తిస్తుంది. సాధారణంగా చాలా మంది అజీర్తి సమస్యల కోసం యాంటాసిడ్స్ మందులను మందుల షాపులో కొనుగోలు చేస్తారు. కానీ యాంటాసిడ్స్ పదే పదే వాడడం వల్ల కొంత మందిలో మలబద్దకం తయారవుతుంది. మరికొంత మందిలో తిమ్మిర్లు రావడం .. కొంత మందిలో డయేరియా సమస్య కూడా ఉత్పన్నం కావచ్చు. కొంత మందిలో తీవ్రమైన తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. . .

అలర్జీ కోసం చాలా మంది ఇంట్లో ఉన్న మందులనే వాడుతున్నారు. ఇవి తుమ్ములు, ముక్కు కారటం, దగ్గు, దురదకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి. ఐతే వీటిని క్రమంగా వాడే వారికి మగతగా ఉండడంతోపాటు నిద్ర, ఆకలిపై ప్రభావం చూపిస్తాయి. కొందరిలో మలబద్ధకం, వాంతులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మందులు వైద్యుల సలహా తప్పనిసరిగా పాటించాలి…నోటి శుభ్రత కోసం ఈ మద్య చాలా మంది మౌత్ వాష్ లు వాడుతున్నారు. నేరుగా సూపర్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చి వాడుతున్నారు. ఐతే వీటిని పొరపాటున మింగితే కడుపుని దెబ్బతీస్తుంది లేదా వికారం కలిగిస్తుంది. ఎక్కువగా మింగినట్లయితే వాంతి చేసుకునే అవకాశం ఉంది. 6 ఏళ్లలోపు పిల్లలు దీనిని అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే వారు పొరపాటున మింగే అవకాశం ఉంది…

మంచి ఆరోగ్యంతో ఉన్న వారికి విటమిన్ సప్లిమెంట్లు అవసరం లేదు. కానీ కొంత మంది రోజూ విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. ఇవి క్రమంగా తీసుకోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు విటమిన్లు ఆహారం నుంచి వచ్చేలా చూసుకోవాలి. తద్వారా విటమిన్ సప్లిమెంట్లను తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు. బరువు తగ్గేందుకు ఈ రోజుల్లో మార్కెట్లో చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలామంది కొనుగోలు చేస్తున్నారు. ఇవి ఇంట్లో ఉంచుకుని ఉపయోగిస్తున్నారు. మెడికల్ బాక్స్ నుంచి తీసుకునే ఇలాంటి మందులు ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. కాబట్టి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యులు సూచించిన మేరకే మందులు వాడుకోవాలి.

అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు .. వైద్యులు సూచించిన మేరకే మందులు వాడుకోవాలి. ఆ విధంగానే కొనుగోలు చేసుకోవాలి. ఎక్కువగా కొని మిగిలేలా చూసుకోవడం వల్ల .. మందుల డబ్బాలో నుంచి తర్వాత తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నొప్పి నివారణ మందులు , యాంటీబయాటిక్స్, నిద్ర మాత్రలతో జాగ్రత్తగా ఉండాలి. ఇవి అలవాటైతే మళ్లీ ..మున్ముందు చికిత్స లో శరీరానికి ఉపయోగపడవు. అలాగే మందుల బాక్సులో ఎక్కువ మెడిసిన్స్ ఉంచుకోవడం కూడా మంచిది కాదు. అందుకే మందుల డబ్బా మాటున ఉన్న ప్రమాదాన్ని గుర్తుంచుకోండి.

Leave a Comment