Swimming exercises – స్విమ్మింగ్ ఏరోబిక్స్ వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు..!

By manavaradhi.com

Published on:

Follow Us
Swimming exercises

స్విమ్మింగ్ ..ఈరోజుల్లో ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్న వ్యాపకం. మన శరీరం బలంగా, దృఢంగా ఉండేందుకు ఈ స్విమ్మింగ్ ఎంతగానో సహకరిస్తుంది. అంతేకాదు కీళ్ల సమస్యలతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ స్విమ్మింగ్ చేసే విధానంలో కొన్ని మెలకువలను పాటిస్తే మరిన్ని ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు. అందులో ఆక్వా ఏరోబిక్స్ ఇప్పుడు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అయితే మొదటగా స్విమ్మింగ్ చేసేటప్పుడు ప్రత్యేకంగా కోచ్లను ఆశ్రయించాల్సి వస్తుంది. అంతేకాదు స్విమ్మింగ్ చేసేముందు పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని స్విమ్మింగ్ శిక్షకులు పదేపదే చెబుతున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి స్విమ్మింగ్ ఫూల్ ఎక్సర్ సైజులు దోహదపడతాయి.

స్విమ్మింగ్ చేయటానికి మీ శరీరం సహకరిస్తుందా లేదా అన్నది ముఖ్యమైన అంశం. స్విమ్మింగ్ ఫూల్స్లో చేరటానికి కచ్చితంగా ఎంబీబీఎస్ డాక్టర్ చేత సర్టిఫికేషన్ కావాలి. ఫిట్స్, చర్మ రోగాలు, నోటి, దంత, చెవి సంబంధిత సమస్యలతో బాధపడేవాళ్లు స్విమ్మింగ్ చేయకూడదు. స్విమ్ చేసేటప్పుడు స్విమ్ కాస్ట్యూమ్ తప్పనిసరిగా ధరించాలి. తల తడవటం వల్ల జలుబు, దగ్గులాంటి వాటితో బాధపడేవాళ్లు హెడ్ క్యాప్ ధరించొచ్చు. హైట్, వయసు, అనుభవాలను పరిగణలోకి తీసుకుని స్విమ్మింగ్ఫూల్ను ఎంచుకోవాలి. స్విమ్మింగ్ పూల్లోకి ఎంటరయ్యే ముందు బాడీని వార్మప్ చేయాలి. చిన్నపాటి ఎక్సర్సైజులు చేస్తే మీ కాళ్లు, చేతులు ఫ్రీగా మూవ్ అవుతాయి. స్విమ్ చేయటానికి కనీసం గంట ముందు ఆహారం తీసుకోకపోవటం మంచిది. స్విమ్మింగ్ ఫూల్లో ఉండే నీళ్లకు క్లోరిన్ కలుపుతారు కాబట్టి ఆ నీళ్లు ఎక్కువగా కళ్లకు తాకితే సమస్యలు ఎదురుకావచ్చు. అందువల్ల స్విమ్మింగ్ చేసేటప్పుడు గాగూల్స్ ధరించాలి. స్విమ్ చేసేటప్పుడు లైఫ్ జాకెట్ ధరించాలి. స్విమ్ ఏరోబిక్స్ వల్ల కండరాల బలం పెరుగుతుంది. నీళ్లు అనేక దిశల్లో ప్రయాణం చేస్తుంటాయి. ఈ సమయంలో కండరాలు వర్కవుట్ అవుతాయి. 12 వారాల పాటు ఎరోబిక్ ఎక్సర్ సైజులు చేసినట్లయితే క్రమక్రమంగా బలం, శరీరంలో కదలికలు బాగా ఉంటాయి.

స్విమ్మింగ్ ఫూల్ లో చేసే ఏరోబిక్స్ సహజసిద్దంగా, గురుత్వాకర్షణ శక్తికి అనుకూలంగా చేయవచ్చు. ఈ వ్యాయామాల వల్ల శరీరంలో కదలికలు సులభతరమౌతాయి. శరీరం అన్ని వైపులా వంగుతుంది. ముదుసలి వాళ్లు సైతం నీటిలో ఎరోబిక్ ఎక్సర్ సైజులు చేయొచ్చు. సంప్రదాయ పద్దతుల్లో చేసే వ్యాయామాలతో పోలిస్తే నీటిలో చేసే వ్యాయామాలతో మంచి ప్రయోజనం ఉంది. వీటివల్ల శరీరానైకి చక్కటి మసాజ్ చేసినట్టు అవుతుంది. స్విమ్మింగ్ ఫూల్ లో కొద్ది సేపు ఎరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల కీళ్ల సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. నీటిలో ఎరోబిక్స్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి దరిచేరవు. శరీరాన్ని కష్టపెట్టకుండా సునాయాసంగా చేయవచ్చు. వీటివల్ల శరీరంలోని క్యాలరీలను తగ్గించవచ్చు. అదనపు కొవ్వు కరిగిపోతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి స్విమ్మింగ్ ఫూల్ ఎక్సర్ సైజులు మంచి ఫలితాన్నిస్తాయి. వేసవి కాలంలో ఉక్కపోత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే చక్కని ఉపశమనం లభిస్తుంది.

నీటిలో ఎరోబిక్స్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి దరిచేరవు. శరీరాన్ని ఎటువంటి కష్టపెట్టకుండా సునాయాసంగా వ్యాయామాలు గంటల తరబడి చేసుకోవచ్చు. నీటిలో వ్యాయామాలు చేయడం వల్ల క్యాలరీలను తగ్గించవచ్చు. అదనపు కొవ్వు కరిగిపోతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి స్విమ్మింగ్ ఫూల్ ఎక్సర్ సైజులు మంచి ఫలితాన్నిస్తాయి.

Leave a Comment