Melatonin – మెలటోనిన్ హార్మోన్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!

By manavaradhi.com

Published on:

Follow Us
melatonin hormone

ఒక వ్యక్తి అలసట చెందితే తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాల్సిందే. అంటే తప్పనిసరిగా నిద్ర పోవాల్సిందే . అప్పుడే మళ్లీ కొత్త శక్తి సంతరించుకుని మళ్లీ పని చేయడం ప్రారంభిస్తారు. కొంతమందిలో టెన్షన్స్ కారణంగా నిద్రలేమి సమస్య కూడా ఉంటుంది. అసలు మనిషికి నిద్ర రావడం వెనుక ఓ హార్మోన్ పని చేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. అవును నిద్ర రావాలంటే మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ పని చేస్తుంది. దీన్ని పీనల్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది . మెదడులో బఠానీ గింజ పరిమాణంలో ఉండే పీనల్ గ్రంథి … నిద్ర వచ్చే విషయాన్ని .. మేల్కునే విషయాన్ని శరీరానికి తెలిజేస్తుంది. దీంతో ఎప్పుడు పడుకోవాలి ? ఎప్పుడు మేల్కోవాలనేది అర్థమవుతుంది. సాధారణంగా మెలటోనిన్ హార్మోన్ రాత్రి పూటనే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. సాయంత్రం పూట నుంచి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరగడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో అర్థ రాత్రి దాటిన తర్వాత నుంచి సూర్యోదయం ప్రారంభమయ్యే క్రమంలో ఇది తగ్గుతూ వస్తుంది. దీంతో నిద్రపోయిన వ్యక్తికి మెలకువ వస్తుంది. అలాగే శరీరం నిర్దేశించిన సమయాన్నిబట్టి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది…

కొంత మందిలో ఎక్కువ టెన్షన్ కారణంగా గానీ లేదా పని ఒత్తిడి కారణంగా గానీ.. నిద్రలేమి సమస్య ఉత్పన్నమవుతోంది. అంటే ఓ విధంగా చెప్పాలంటే వారిలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి విషయంలో తేడాలు ఉండే అవకాశం ఉందన్నమాట. ఐతే దీనికీ పరిష్కార మార్గాలు ఉన్నాయి. మెలటోనిన్ హార్మోన్ సప్లిమెంట్లు ట్యాబ్లెట్ల రూపంలో, ద్రవ రూపంలోనూ లభిస్తున్నాయి. ఇవి చాలా వరకు సహజసిద్ధమైన రూపంలోనే లభిస్తున్నాయి. వాటిని జంతువుల పీనల్ గ్రంథుల నుంచి సేకరించి విక్రయిస్తున్నారు. ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి సమస్య ఉన్న వారు వీటిని తీసుకోవచ్చు. దీంతో నిద్రలేమి సమస్య అధిగమించవచ్చు . ఫలితంగా నిద్రలేమి సమస్య కారణంగా వచ్చే అనేక సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.

నిద్రలేమి కారణంగా వృద్ధాప్యం రాక ముందే అల్జీమర్స్ , అధిక రక్తపోటు లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇంకా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ కూడా వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు నిద్రలేమి సమస్య లేకుండా చూసుకోడం చాలా ముఖ్యం. ఇందుకోసం వైద్యుల సలహా, సూచన మేరకు మెలటోనిన్ హార్మోన్ ను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు.

ఐతే సప్లిమెంట్ల వాడకం మంచిదేనా అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తే అవకాశం ఉంది. ఈ సప్లిమెంట్ల వాడకం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్ లు కూడా ఉన్నాయి. వీటిని వాడే వారిలో పగటి నిద్ర పెద్ద సమస్యగా ఉంటుంది. అలాగే విపరీతమైన తలనొప్పి వేధిస్తుంది. కొంత మందిలో కడుపులో గందరగోళ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. తల బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే కొంత మందిలో డిప్రెషన్ మరింత పెరుగుతుంది. ఇతర మందులతో మెలటోనిన్ హార్మోన్ సప్లిమెంట్లు వాడితే ప్రమాదం మరో విధంగా ఉంటుంది. బ్లడ్ తిన్నర్ మందులు, రోగనిరోధక వ్యవస్థను నియంత్రించే మందులు , ఫ్యామిలీ ప్లానింగ్ మందులతో కలిపి మెలటోనిన్ హార్మోన్ సప్లిమెంట్లు తీసుకునేటట్లయితే వైద్యుల సలహాలు సూచనలు తప్పనిసరిగా పాటించాలి…

మెలటోనిన్ హార్మోన్ కోసం సప్లిమెంట్లపై ఆధారపడడం కంటే .. సహజసిద్ధంగా శరీరం ఉత్పత్తి చేసుకునేలా నియంత్రించుకోవడం మంచిది. అంటే అవిశ్రాంతంగా . . శరీరాన్ని శ్రమించకుండా చూసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేలా జీవన విధానాన్ని రూపొందించుకోవాలి.

Leave a Comment