Foods that fight Heartburn – గుండె మంటను తగ్గించే ఆహారాలు

By manavaradhi.com

Published on:

Follow Us
Foods that fight Heartburn

ప్రస్తుత రోజుల్లో వయస్సుతో పనిలేకుండా హఠాత్తుగా వచ్చే అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అందులో గుండెకు సంబంధించిన సమస్యలే అధికం ఉంటున్నాయి. గుండెల్లో మంట అనేక కారణాల వలన రావచ్చు. గుండె మంట వలన వచ్చే చాతీ నొప్పి మండే అనుభూతిని కలిగి ఉంటుంది. బాగా వేయించిన ఆహారాలు అనేక సమస్యలు తెస్తాయి. తరచుగా వేపుడు ఆహారాలు తింటే ఛాతీలో కిందిభాగంలో మంట వస్తుంది. అది పొట్టకు కూడా వ్యాపిస్తుంది. గుండె మంట తరచుగా వస్తూంటే సమస్యలు ఎక్కువవుతాయి. అటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వేపుడు ఆహారాలు తగ్గించి ఉడికించిన ఆహారం తినాలి. ఇది సాధారణంగా రాత్రి భోజనం తరువాత వస్తూ వుంటుంది. ఇది ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన లేదా కొన్ని మసాలాలు, అధిక క్రొవ్వు శాతం లేదా అధిక ఆమ్ల శాతం కల ప్రత్యేక ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల కూడా వస్తుంది. ఎసిడిటీ లాంటి సమస్య ఉన్నప్పుడు కంగారుపడి డాక్టరు దగ్గరకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఇంట్లోనే అందుబాటులో ఉండే ఆహారాలతోనే ఛాతిలో మంటను తగ్గించుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది. గుండె మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

గుండె మంట సమస్య ఉన్నవారు ఆహారం తీసుకున్న తర్వాత చాలా సమయం వరకు ఛాతీలో మంటగా ఉంటుంది. పుల్లటి త్రేన్పులు ఎక్కువగా వస్తుంటాయి. గొంతులో అసౌకర్యంగా ఉంటుంది. అందువల్ల వారికి పెరుగు మంచి పరిష్కారం చూపుతుంది. ఇది క్యాల్షియం రిచ్ ఫుడ్. ఇది ఛాతీలో మంటను తగ్గించి, తిన్న ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే బొప్పాయిలో ప్రోటియోలిక్ ఎంజైమ్ ఉంటుంది..ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండేందుకు ఆరెంజ్ జ్యూస్ తరచూ తీసుకోవాలి. దీంతో జీర్ణవ్యవస్థ మెరుగావుతుంది. ఛాతీలో మంట తగ్గుతుంది.

Foods that fight Heartburn

గుండె మంటను తగ్గించడానికి పండ్లు కూడా ఎంతో దోహాదపడతాయి. అరటిపండులో అధికంగా పొటాషియంతో పాటు నేచురల్ ఆంటాసిడ్స్ ఉండి గుండె మంటను నుండి ఉపశమన పొందడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణకోశం శుభ్రపరచడానికి మరియు మలబద్ధకం నివారికి బాగా సహయపడుతుంది. ఆపిల్స్ లో ఫినోలిక్ ఫైటోకెమికల్స్, కార్బోహైడ్రేట్స్ వంటివి హార్ట్ బర్న్ ను ముఖ్యంగా పొత్తి కడుపు పైభాగంలో మంటను తగ్గిస్తాయి. సిట్రస్ పండ్లలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది గుండెలో మంటను తగ్గిస్తుంది. అంతే కాదు నిమ్మకాయ, గ్యాస్ట్రిక్ సమస్యను మరియు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. సీఫుడ్స్ ముఖ్యంగా చేపల్లో టోరిన్ అధికంగా ఉండి గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని తగ్గిస్తుంది. బ్రకోలీ తింటే కడుపులో మంట, ఎసిడిటీ నుంచి త్వరితగతిని ఉపశమనం పొందవచ్చు. బాదంపప్పు గుండెలో మంటను తగ్గించడానికి చాలా బాగా

అసిడిటీ తగ్గటానికి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోజు వాటిని వాడటం వలన వేరే ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుక‌ని సహజంగా ఛాతీలో మంటని తగ్గించుకోవటంపై దృష్టిసారించ‌డం చాలా మంచిది.

Leave a Comment