Health tips :క‌డుపు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తిన‌కండి..!

By manavaradhi.com

Published on:

Follow Us
Never Eat These Foods on an Empty Stomach

మ‌నిషి మ‌నుగ‌డ‌కు గాలితోపాటు ఆహారం కూడా ముఖ్యం. ఆరోగ్యానికి ఆహారానికి మ‌ధ్య అవినాభావ సంబంధ‌ముంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారంతో ఆరోగ్యం మ‌న సొంతం అవుతుంది. ప్రకృతి ప్రసాదించిన అన్ని రకాల ఆహారాల‌ను మితంగా తింటే ఆరోగ్యంగా వుంటాం. అదే ఏ ఆహార‌మైనా మోతాదు మించి తింటే.. అది అమృతమైనా కూడా విషతుల్యమే. శరీరంలో అధిక బరువు, పొట్ట అందానికి ఆరోగ్యానికి సమస్యాత్మకంగా మారుతాయి. ఇవి ఆత్మన్యూనతకు గురిచేసి నష్టాన్ని కలిగిస్తాయి. అధిక బరువు పొట్ట వల్ల గురక నుంచి గుండె జబ్బుల వరకు.. బీపీ నుంచి షుగర్ వరకు కారణం అయ్యే ప్రమాదం ఉంది.

పొట్ట‌ను బాగా పెంచ‌డంలో కొన్ని ఆహారాలు చాలా బాగా ఉప‌క‌రిస్తాయి. వాటిలో ముఖ్య‌మైన‌వి స్వీట్లు, చాక్లెట్లు, బ‌ర్గ‌ర్లు, బాగా సాస్ వేసిన సాండ్‌విచెస్‌, ఫ్రైడ్ చికెన్‌, మిర‌ప‌కాయ బ‌జ్జీలు, చాట్ వంటి స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువ‌గా తీసుకోవ‌డం పొట్ట‌కు మంచిదికాదు. పిల్ల‌లు, మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే ఐస్‌క్రీంలో కొంత కాల్షియం ఉంటుంది కానీ, స‌గం క‌ప్పు ఐస్‌క్రీంతో దాదాపు 230 క్యాల‌రీలు అందుతాయి. క‌ర‌క‌ర‌లాడుతున్నాయ‌ని చిప్స్ లాగేస్తుంటాం. కేవ‌లం 15 చిప్స్ తిన్నామంటే చాలు 150 క్యాల‌రీల శ‌క్తి శ‌రీరానికి అందుతుంది. ఇంకా అక్క‌డితో ఆపితే పొట్ట‌కు చాలా మంచిది. బీర్ అంటే ఇష్ట‌ప‌డేవారు ఇక‌నుంచి బీర్ తాగ‌డం మానుకోవాలి. ఎందుకంటే 12 ఔన్సుల బీర్ క్యానులో 150 క్యాల‌రీల శ‌క్తి ఉండి మ‌న పొట్ట‌ను అనారోగ్యానికి గురిచేస్తుంది. మాంసంలో కూడా అధిక మొత్తంలో క్యాల‌రీల‌తోపాటు కొవ్వు కూడా ఉంటున్నందున ఎంత త‌క్కువ‌గా తీసుకొంటే అంత మంచిద‌ని వైద్య‌నిపుణులు సెల‌విస్తున్నారు. మాంసంతో చేసే పిజ్జాల్లో అధిక మొత్తంలో క్యాల‌రీలు శ‌రీరానికి అందుతాయి. ఒక‌వేళ పిజ్జా తినాల‌ని అనిపిస్తే కూర‌గాయ‌ల‌తో చేసినవి తిన‌డం శ్రేయ‌స్క‌రం. అలాగే

సోడాల‌ను కూడా త‌క్కువ‌గా తీసుకోవాలి. 20 ఔన్సుల సోడా బాటిల్ ద్వారా 250 క్యాల‌రీల శ‌క్తి అందుతుంది. గ్రిల్ల్‌డ్ చికెన్‌గానీ, ఫ్రైడ్ చికెన్‌గానీ తిన‌డం వ‌ల్ల అధిక మొత్తంలో క్యాల‌రీలు అందుతున్నందున వీటికి బ‌దులుగా ఇత‌రత్రా ఆహారాల‌ను ఎంచుకోవ‌డం మంచిది. అలాగే ఎక్కువ స‌మ‌యం గ‌డ్డక‌ట్టిన (ఫ్రోజెన్‌) ఆహారాలను దూరం పెట్ట‌డం చాలా మంచిది. బ‌ఫే డిన్న‌ర్ల‌కు వెళ్లిన‌ప్పుడు స‌లాడ్లు, పండ్ల‌తో ప‌ల్లెంను నింపుకోవ‌డం వ‌ల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే బ్రౌన్ రైస్‌, గోధుమ రొట్టెలు, ఓట్స్‌, అన్ని ర‌కాల చిరుధాన్యాల‌తో చేసిన ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న పొట్ట‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. నూనెలో వేయించిన వ‌స్తువుల‌ను త‌క్కువ‌గా తీసుకోవ‌డం కూడా పొట్ట‌కు చాలా మంచిది. వీటికి తోడు నిత్యం కొద్దిసేపు వ్యాయామం చేయ‌డం అవ‌స‌రం అని గుర్తుంచుకోవాలి.

ఇష్ట‌మని కొంచెం ఎక్కువ‌గా లాగించామంటే మ‌న పొట్ట ఆరోగ్యానికే ముప్పు అని గ్ర‌హించాలి. మ‌న‌కు ఎంత ఇష్ట‌మున్నా మ‌న పొట్ట‌ను దృష్టిలో పెట్టుకొని ఆహారాల‌ను తీసుకోవ‌డానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

Leave a Comment