Dhurandhar2 | బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ 2’ అప్డేట్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించిన ‘ధురంధర్’ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ధురంధర్:ది రివెంజ్’ (Dhurandhar 2) పేరుతో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదటి భాగం హిందీలో మాత్రమే విడుదల కాగా.. రెండో పార్ట్ హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని టీజర్‌ను విడుదల చేశారు (Dhurandhar 2 Teaser).“ది రివెంజ్” అనే థీమ్‌తో రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకులలో గూస్బంప్స్ తెప్పిస్తోంది. ‘ఇది కొత్త భారతదేశం.. సరిహద్దులు దాటి చొచ్చుకువచ్చి దెబ్బకొట్టి తీరుతుంది’’ అని రణ్వీర్ సింగ్ రివెంజ్ డైలాగుతో అదరగొట్టారు.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన చిత్రం ‘ధురంధర్’. గతేడాది చివర్లో విడుదలై సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ‘ధురంధర్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,320 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.









