శరీర ఆరోగ్యానికి, ఎముకలకు సంబంధం ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యకరమైన ఆహారంతోనే కీళ్ళు. ఎముకల నిర్మాణం ఉంటుంటి. చాలా మంది ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం తీసుకొంటే సరిపోతుందని అనుకుంటుంటారు. నిజమే, అయితే కాల్షియం ఒక్కటే సరిపోదు. ఎముకల ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఏయే ఆహారాలతో ఎముకలు దృఢంగా మారుతాయి..?
మన శరీరం 206 ఎముకలతో నిర్మితమై ఉంటుంది. బయటి నుంచి శరీరానికి ఎలాంటి హాని కలగకుండా ఎముకలు కాపాడతాయి. అందుకని వీటిని ఎల్లప్పుడూ దృఢంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శరీరంలో జరిగే అన్ని క్రియలకు మరియు శరీరానికి మద్దతు ఇచ్చే వ్యవస్థగా ఎముకలను పేర్కొనవచ్చు. ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలో అన్ని విధులు సరైన విధంగా నిర్వహించబడతాయి. ఎముకలు జీవించిన ఉన్న కణజాలాలు. ఇవి కొత్త ఎముకలు ఏర్పడటంతో నిరంతరం మారుతుంటాయి. పాత ఎముకలు పాడైతే వాటి స్థానంలో కొత్త ఎముకలు ఉద్భవిస్తాయి. ఇలా జీవితకాలం మొత్తం జరుగుతుంది.
వయస్సు పెరుగుతున్న కొలదీ, కొత్త ఎముకలు ఏర్పడే రేటుతో పోలిస్తే, పాత ఎముకలు వేగంగా నాశనం అవుతుంటాయి. మరీ ముఖ్యంగా మహిళల్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటికి ప్రత్యామ్నాయం కల్పించడం కోసం ఎముకలు ఏర్పడతాయి. ఈ ఎముకలు చాలా బలహీనంగా, పెళుసగా, తేలికగా విరిగిపోకుండా చూసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎముకలు ఆరోగ్యంగా దృడంగా ఉండటం అనేది మనం తీసుకొనే ఆహారంపై ఆధారపడి ఉంటుంది.
ఎముకలు దృడంగా, ఆరోగ్యంగా ఉండేందుకు కాల్షియం తప్పనిసరి. అధిక మొత్తంలో కాల్షియంను కలిగి ఉండే తక్కువ ఫాట్ కలిగిన రెండు గ్లాసుల పాలు, చీజ్, పెరుగు, హోల్ గ్రైన్స్ తినటం వలబ శరీరానికి కావలసిన కాల్షియంను పొందవచ్చు. కాల్షియం పాత్రతో సమానమైన పాత్ర విటమిన్ డీ పోషిస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో శరీరానికి కావలసిన స్థాయిలో విటమిన్ డీ ఉంటుంది. చేప మాంసం శరీరానికి కావలసిన పోషకాలను అందించి ఎముక ద్రవ్యరాశిని పెంచుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండుటకు సార్డైన్ సాల్మన్ చేపలను తినాలి. ఎముకలను దృడంగా ఉంచే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్సలను పొందడానికి ఆక్రోట్స్ , ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి.
ఎముకల బలానికి పొటాషియం నేరుగా ఉపయోగపడకపోయినా కణాలలో వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. శరీరంలో కాల్షియంను భయటకి పంపించే ఆసిడ్లను నిర్వీర్యపరుస్తుంది. చిలగడదుంప, తెల్లటి బంగాళదుంప, యొగ్ హార్ట్, అరటిపండుల్లో శరీరానికి తగిన స్థాయిలో పొటాషియం అందుతుంది. డీ విటమిన్ అధికంగా లభించే ముదురురంగు ఆకుకూరలు, కూరగాయలు, బ్రొకోలీ, డైరీ ఉత్పత్తులను నిత్యం తీసుకోవాలి. ఆప్రికాట్స్, స్ట్రాబెర్రీ, ఓట్స్, కమలాఫలం వంటిని రెగ్యులర్‌గా తినాలి.
రన్నింగ్, వాకింగ్, జంపింగ్, మెట్లు ఎక్కటం వంటి వాటి వలన ఎముకల బలం కూడా పెరుగుతుంది. రోజు వ్యాయామాలను అనుసరించటం వలన ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధికి గురవకుండా కాపాడుకోవచ్చు. ఉదయం నీరెండలో ఉండటం ద్వారా విటమిన్ డీ అంది ఎముకలు గట్టిగా ఉంటాయి. పుట్టగొడుగులు, చేపల నూనె, సోయా ఉత్పత్తులు ఎములక గట్టిదనానికి ఉపయోగపడతాయి. ఎముకల ద్రవ్యరాశిని తగ్గించడంలో కీలకపాత్ర పోషించే సిగరెట్ తాగడం వెంటనే మానేయాలి. అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి. సోడియం అధికంగా ఉండే ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం మానేయాలి. రెగ్యులర్ డైట్ లో క్యాల్షియం ఉన్న ఆహారాలు సరైనా మోతాదులో తీసుకోవడం ద్వారా ఎముకలు చిట్లడం, ఎముకలు అరిగిపోవడం వంటి బోన్ సమస్యలను అరికట్టవచ్చు.
ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియంతోపాటు ప్రోటీన్లు కూడా అవసరమే. ప్రోటీన్ల ఆహారం తీసుకోవడం వల్ల శరీరం క్యాల్షియాన్ని ఎక్కువగా శోషించుకుంటుంది. ఫలితంగా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అందుకని ఎముకలకు ఆరోగ్యాన్ని, దృఢత్వాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవడం చాలా అవసరం.









