అందమైన నవ్వు ఆరోగ్యానికి చిరునామా. మనం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా నోటి ఆరోగ్యం బావుండాలి. నోరు ఆరోగ్యంగా ఉండాలంటే దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మరి మన దంతాలు తెల్లగా మెరిసేలా ఉండేలా కనిపించాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..!
దంతాలు తెల్లగా మరియు మెరుస్తు ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇలా తెల్లగా ఉండే మెరిసేటి దంతాల కోసం నోటి ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. అందుకు ప్రతిరోజూ రెండు మూడు సార్లు బ్రష్ చేయడం, వైద్యుల సలహా ప్రకారం కొన్ని డెంటల్ టిప్స్ ఫాలో అవ్వడం తప్పనిసరి. ముఖంలో కళ్ళు, పెదాల తర్వాత అందమైన ప్రదేశం దంతాలు. దంతాలు తెల్లగా మిళమిళ మెరుస్తుంటే ఎవరైనా సరే ఆకర్షణీయంగా, ఆరోగ్యకరంగా, యవ్వనంగా కనబడతారు. చాలామంది నలుగురిలో ఉన్నప్పుడూ నవ్వడం మానేస్తుంటారు. దానికి ప్రధాన కారణం వారి దంతాలు పసుపు రంగులో ఉండటమే. మనం హాయిగా నవ్వడానికి, స్పష్టంగా మాట్లాడడానికి ఆరోగ్యకరమైన దంతాల వరుస కావాలి. అందువల్ల నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం కూడా బావుంటుంది.
కొంతమంది దంతాలకు గారపట్టి ఉండటం వల్ల అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారు. దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోలేకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడంతో పాటు పొగ తాగడం, మద్యం తీసుకోవడం లాంటి దురలవాట్లు దంత సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. వీటితోపాటు యాంటీబయోటిక్స్, వాతావరణ మార్పులు, ఇన్ఫెక్షన్స్ దంతాల మెరుపును తగ్గిస్తాయి. కాబట్టి దంత సౌందర్య పట్ల అప్రమత్తంగా ఉండాలి.
మిలమిల మెరిసే దంతాల కోసం రోజుకు కనీసం రెండు సార్లు క్రమ పద్దతిలో బ్రష్ చేసుకోవడం ఎంతో అవసరం. ఇలా చేయడం వల్ల దంతాలపై పేరుకున్న పాచి, నాలుకపై అతుక్కున్న బ్యాక్టీరియా తొలగిపోయి దంతాలు తెల్లగా మెరుస్తాయి. దంతాలు తెల్లగా మేరావాలంటే కాఫీ, సోడా, కొన్ని రకాల మౌత్ వాష్ లను ఎక్కువగా వాడటం మంచిది కాదు. వీటికి దూరంగా ఉండాలి. ఇదేకాక ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. సిట్రస్ పండ్లు కూడా దంతాల మీద ఎటువంటి మరకలు ఏర్పడకుండా చేస్తాయి. ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల వీటిని మితంగా తీసుకోవాలి. కలర్ డ్రింక్ తాగేప్పుడు స్ట్రాలను ఉపయోగించడం వల్ల దంతాలకు తగలకుండా నోట్లోకు పోయి మరకలు ఏర్పడవు. రెండు నెలకొకసారి టూత్ బ్రష్ ను మార్చుతుండాలి. రాత్రి నిద్రపోయే ముందు తప్పనిసరిగా బ్రష్ చేసుకోవడం మరవద్దు. నాన్ వెజ్ తిన్న తర్వాత నీటితో బాగా పుక్కిలించాలి.
దంతాలు తెల్లగా మెరవాలంటే రోజుకి రెండుసార్లు ఫ్లాసింగ్ చేయాలి. ఇలా చేయటం వల్ల దంతాల మధ్య ఇరుక్కునే ఆహార పదార్థాలు తొలగి గార ఏర్పడకుండా ఉంటుంది. పళ్లు తెల్లగా ఉంటాయి. పొగాకు నమలడం, సిగరేట్ స్మోకింగ్ అలవాటును మానేయాలి. మిలమిల మెరిసే దంత సౌందర్యం కోసం, సమీపంలో ఉన్న దంత వైద్యున్ని సంప్రదిస్తే మంచిది. కాబట్టి మీ దంతాలు ఎప్పుడూ తెల్లగా మిళమిళలాడేలా చూసుకోండి.
మన దంతాలు ఆరోగ్యంగా కోరుకోవడం సహజం. అందుకోసం దంత సంరక్షణ పట్ల శ్రద్ధ చూపాలి. కానీ కొంతమంది పళ్లు మరీ తెల్లగా ఉండాలనే అత్యాశతో లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు. టీత్ వైటనింగ్ పేరుతో పళ్లు అరగదీస్తుంటారు. అలా చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో వారి సూచనల మేరకు దంతాల పట్ల కేర్ తీసుకోండి. మీ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.








