Running : రన్నింగ్ వల్ల మోకీళ్ళు దెబ్బతింటాయా?

By manavaradhi.com

Published on:

Follow Us
running health facts

శ‌రీరం సౌష్ట‌వంగా, దృఢంగా ఉంటూ ఉత్తేజ‌వంతంగా ప‌నిచేసేందుకు వ్యాయామం చాలా అవ‌స‌రం. ప‌రిగెత్తడం ద్వారా శ్వాస‌ప్ర‌క్రియ‌ను ఉత్తేజ‌ప‌రుస్తూ మంచి ఫ‌లితాల‌ను సాధించవ‌చ్చు. అయితే స‌రైన ర‌క్ష‌ణ‌, శిక్ష‌ణ లేకుండా ర‌న్నింగ్ చేయ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలికంగా ఎముక‌ల స‌మ‌స్య‌ల‌తో పాటు మోకీళ్ల నొప్పులు బాధిస్తాయి. ర‌న్నింగ్ చేయ‌డం ద్వారా మోకాళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే ఏంచేయాలి..?

మోకాళ్ల నొప్పులంటే ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వచ్చే సమస్య. ఇప్పుడలా కాదు.. ఇరవైలోనూ అరవైలా యువకులు సైతం ఈ బాధను అనుభవిస్తున్నారు. మారిన జీవనశైలే దీనికి ప్రధాన కారణం. దారి వెంట అలా నడుస్తున్నప్పుడో, మెట్లు ఎక్కుతున్నప్పుడో అరుదుగా ఎప్పుడైనా కీళ్లల్లో కాస్త నొప్పి అనిపిస్తే ఎవరైనా అది మామూలే అనుకుంటారు. కానీ తరుచూ అలా నొప్పి అనిపిస్తున్నప్పుడు గానీ, ఏదో సమస్య ఉన్నట్లు ఎవరూ గుర్తించరు.

మోకాళ్లు, కీళ్లు నడవడానికి కూడా సహకరించడం లేదంటే దాని వెనుక కారణం ఆస్టియో ఆర్థరైటిస్ అనే కీళ్ల వ్యాధి ఉన్న‌ద‌ని గుర్తించాలి. కీళ్ల మీద భారం వేసి ఎక్కువసేపు పనిచేసినపుడు లేదా ఏ పని లేకుండా తరబడి అలా కూర్చుని ఉండిపోతే కీళ్లలో వాపు ఏర్పడి నొప్పి కలుగుతుంది. మోకాలు కీళ్లలో నీరు చేరి, వాపు రావడం, కీళ్ల మధ్యలో ఉండే సైనోవియల్ ద్రవం తగ్గిపోవడం, కార్టిలేజ్ అరిగిపోవడం లేదా కుంచించుకుపోవడం వంటి ఏ కారణంగానైనా కీళ్ల నొప్పులు రావొచ్చు.

మోకాళ్ల నొప్పి బారినపడితే సరిగా నిలబడలేరు, నడవలేరు. అటూఇటూ తిరిగినా తీవ్రమైన నొప్పి వేధిస్తుంటుంది. వయసుతో పాటు కీళ్లు, ఎముకలు అరిగిపోవటం వంటి సమస్యలు దీనికి దోహదం చేస్తాయి. మోకాళ్ల నొప్పి తలెత్తటానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఆ భాగానికి రక్తసరఫరా తగ్గటం. పరుగెత్తడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు అనేకం వున్నాయి. మోకాళ్లు ఆరోగ్యంగా వుండటానికి, వెన్నెముక బలంగా వుండటం, వెన్ను నొప్పి రాకపోవడం వంటివన్నీ పరిగెత్తడం వల్ల కలిగే ప్రయోజనాలే. ఎంతో కొంత సమయం కేటాయించి రోజూ పరుగెత్తడం వల్ల చాలా లాభాలే వున్నాయని ఓ తాజా అధ్యయనం వెల్ల‌డించింది. నిత్యం కొంత రన్నింగ్ లేదా జాగింగ్ లాంటి వ్యాయమాలు చేసే మహిళల్లో ఎముకలు 4% అదనంగా శక్తి కలిగి వుంటాయని తేలింది.

రన్నింగ్ ఒక సులువైన మరియు ఉత్తమ ఫిట్నెస్ వ్యాయామం. పరిగెత్తడం వల్ల తుంటి ఎముక, మోకాళ్లలో అర్థరైటీస్‌ రాదు. కీళ్ల మీద మాత్రం భారం పడుతుంది. ర‌న్నింగ్ చేయ‌డం వ‌ల్ల‌ మృదులాస్థి నిల్వలు పెరుగు తాయి. తద్వారా ఎముక మరింత సమర్థంగా పనిచేస్తుంది. శ‌రీరాన్ని దృఢంగా ఉంచుకోవ‌డానికి ప్ర‌ధాన సాధ‌న‌మైన ర‌న్నింగ్ చేసేట‌ప్పుడు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లేన‌ట్ల‌యితే మోకాళ్ల‌పై భారం ప‌డి నొప్పులు తీవ్ర‌మ‌య్యే అవ‌కాశాలుంటాయి. ర‌న్నింగ్ చేసే విధానాన్ని నిపుణుల నుంచి తెల్సుకున్న త‌ర్వాత‌నే ప్రాక్టీస్ చేయాలి. ర‌న్నింగ్ ద్వారా శ‌రీరం కోల్పోయే క్యాల‌రీల‌ను భ‌ర్తీచేసేందుకు అధిక ప్రోటీనులు, కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి బ్యాలెన్స్ న్యూట్రీషియన్ డైట్ తీసుకోవాలి. రన్నింగ్ చేసేప్పుడు మోకాళ్లు ప్ర‌మాదాల‌కు గురై దెబ్బ‌తిన‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి.

పరుగెత్తడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు అనేకం వున్నాయి. అయితే స‌రైన శిక్ష‌ణ‌గానీ, ర‌క్ష‌ణ ప‌ద్ధ‌తులుగానీ అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల కాళ్ల‌తోపాటు మోకాళ్ల‌పై తీవ్ర‌ప్ర‌భావం చూపుతాయి. అందుకని కొద్దిసేపు ర‌న్నింగ్ చేసినా మోకాళ్ల‌పై బ‌రువు ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి.

Leave a Comment