Health Benefits Of Spinach – పాలకూర తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు!

By manavaradhi.com

Published on:

Follow Us
Health benefits and nutritional value of spinach

శరీరానికి సమతుల ఆహారం అందినప్పుడే .. సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది. సమతుల ఆహారం కోసం తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా మంచి విటమిన్లు , ప్రొటీన్లు, ఖనిజ లవణాలు లభించే పచ్చని ఆకు కూరలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆకు కూరల్లోకెల్లా రారాజు పాలకూర. ఇందులో అన్ని రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. పాలకూరలో ఏ ఏ పోషకాలు ఉన్నాయి.

ఆకు కూరలు.. శరీరానికి అన్ని రకాల పోషకాలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే కచ్చితంగా రోజూ పచ్చని ఆకుకూరలు తీసుకోవాల్సిందే. వాటి వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజలవణాలతోపాటు అన్ని రకాల ఫ్లేవనాయిడ్లు అందుతాయి. ఐతే అలాంటి పోషకాలు మెండుగా ఉన్న ఆహారాల్లో పాలకూర కూడా ఒకటి. దీన్ని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి. పాలకూరలో విటమిన్ K, విటమిన్ C, A, Eతోపాటు B కాంప్లెక్స్ , మెగ్నిషియం, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, సోడియం, క్లోరిన్, పాస్ఫరస్, ఐరన్, ప్రోటీన్లు, బీటాకెరోటిన్, లాంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. పాలకూరలో విటమిన్ A, E, K పుష్కలంగా ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడతాయి. ముఖ్యంగా శాస్వ సంబంధిత సమస్యలు, యూరినరీ, పేగు సంబంధిత ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకుంటాయి.

పాలకూరలో మన శరీరానికి కావాల్సిన ఇనుము ధాతువు పుష్కలంగా లభిస్తుంది. దీన్నినిత్యం తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా చేసుకోవచ్చు. పాలకూరలో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించడంతోపాటు రక్తాన్ని శుద్ధి చేసే గుణం కలిగి ఉంటుంది. పైగా దీని ద్వారా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పాలకూరలో తక్కువ కార్బోహైడ్రేట్స్ మరియు చాలా తక్కువగా బ్లడ్ గ్లూకోజ్ లు కలిగి ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే ఏమాత్రం సంకోచించకుడా దీన్ని రోజువారీ ఆహారంలో తీసుకోవచ్చు. అలాగే దీనిలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. పాలకూర నుంచి లభించే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ సులభంగా అవుతుంది. పేగులు శుభ్రంగా ఉంటాయి. అందుకే మలబద్ధకాన్ని నివారించడంలో పాలకూర కీలకపాత్ర పోషిస్తుంది. మరోవైపు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి.

పాలకూరలో మొత్తం 13 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి కేన్సర్ ఏజెంట్లుగా పని చేస్తాయంటున్నారు పరిశోధకులు. పాలకూర ఎక్కువగా తీసుకునే మహిళల్లో అండాశయ కేన్సర్ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. అంతే కాదు పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరుపును దూరం చేస్తాయంటున్నారు… పాలకూరలో ఉండే మెగ్నీషియం రక్తపీడనం నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే ఫోలేట్ హృద్రోగ సమస్యలు రాకుండా నివారిస్తుంది. శరీరంలో చెడు కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

ఇదండీ.. పాలకూరలో ఉన్న అన్ని రకాల పోషకాలు. చూశారుగా పచ్చని పాలకూర అందించే ఆరోగ్య ప్రయోజనాలు. ఇక మీరూ మీ డైట్ లో పాలకూరను భాగం చేసుకోండి మంచి ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోండి.

Leave a Comment