అడివి శేష్ (Adivi Sesh) హీరోగా రానున్న రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’ (Dacoit). షానీల్ డియో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు (Dacoit Trailer). అడివి శేష్, మృణాల్ నటన ఆకట్టుకునేలా ఉంది. హరి, జూలియట్ పాత్రల్లో వారిద్దరూ ఒదిగిపోయారు. సంభాషణలు ఆసక్తికరంగా సాగాయి. ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అడివి శేష్ తన కెరీర్‌లో ఎంచుకునే ప్రతి కథా ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తుంది, ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న ‘డెకాయిట్’ సినిమా కూడా అదే స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే, శేష్ తన ‘వంద శాతం సక్సెస్ రేట్’ను ఈ సినిమాతో మరో మెట్టు పైకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో డెబ్యూ డైరెక్టర్ షనీల్ దేవ్ తెరకెక్కించిన ఈ సినిమా, ప్రేమ అలానే క్రైమ్ మధ్య నలిగిపోయే మనుషుల ఎమోషనల్ రైడ్ అనిపిస్తోంది. ఈ సినిమా కేవలం ఒక యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇది హరి, జూలియట్ అనే ఇద్దరు ప్రేమికుల కథ.









