ప్రముఖ సినీ నటుడు సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం వీరభద్రుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. మే 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాదులో సినిమా యూనిట్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న దర్శకుడు ఆర్జే బాలాజీ ఎన్నో విషయాలు పంచుకున్నారు.
ఈ వేడుకలో దర్శకుడు ఆర్ జే బాలాజీ మాట్లాడుతూ.. ‘నాకు పర్సనల్‌గా తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. నేను ఆయన వీరాభిమానిని. చరణ్ నటించిన ప్రతి సినిమాను నేను ఫాలో అవుతుంటాను. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్న ‘పెద్ది’ సినిమా కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని తెలిపారు. చరణ్ పట్ల ఆయన చూపిన ఈ అభిమానం చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.









