Agniveer Vayu 2026 – అగ్నివీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన !

By manavaradhi.com

Published on:

Follow Us
Agniveer Vayu 2026

ఎయిర్‌ఫోర్స్‌ ఏటా రెండుసార్లు అగ్నివీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరిస్తోంది. ప్రస్తుత నోటిఫికేషన్‌ 2027(2) ఇన్‌టేక్‌కు చెందినది కాగా, సైన్స్, నాన్‌ సైన్స్‌ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. సైన్స్‌ విభాగంలో దరఖాస్తు చేసుకున్నవారు నాన్‌ సైన్స్‌ ఖాళీలకూ పోటీ పడే అవకాశాలున్నాయి. ఇందుకోసం ప్రత్యేక పరీక్ష నిర్వహించి ఎంపికైనవారికి నాలుగేళ్లు అవకాశం ఉంటుంది. అందరికీ సర్టిఫికెట్, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడంతోపాటు 25 శాతం మందికి శాశ్వత ఉద్యోగానికి అవకాశమిస్తారు.

ఫేజ్‌-1 :

ఆన్‌లైన్‌లో పరీక్ష ఉంటుంది.
ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి.
ప్రశ్నాపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
సైన్స్‌ సబ్జెక్టులకు పరీక్ష వ్యవధి ఒక గంట సమయం, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
నాన్‌ సైన్స్‌ పరీక్ష వ్యవధి 45 నిమిషాలు.
ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి.
సైన్స్, నాన్‌ సైన్స్‌ దరఖాస్తు చేసుకున్నవారికి పరీక్ష 85 నిమిషాలు.
ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి.
అన్ని పరీక్షల్లోనూ ప్రతి జవాబుకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు.
అన్ని ప్రశ్నాపత్రాల్లోనూ ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్‌ ప్రశ్నలు సీబీఎస్‌ఈ 10+2 సిలబస్‌ నుంచే వస్తాయి.
ఎంచుకున్న పరీక్ష ప్రకారం ఇంగ్లిష్‌ 20, ఫిజిక్స్‌ 25, మ్యాథ్స్‌ 25, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 30 ప్రశ్నలు ఉంటాయి.

ఫేజ్‌-2

ఫేజ్‌-1లో ఎంపికైన వారికి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది.
ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో భాగంగా 1.6 కి.మీ. రన్నింగ్ (పురుషులు 7, మహిళలు 8 నిమిషాల్లో) ఉంటుంది.
పురుషులు నిమిషం వ్యవధిలో 10 పుషప్స్, 10 సిట్‌అప్స్, 20 స్క్వాట్స్‌ పూర్తిచేయాలి.
మహిళలు 1.3నిమిషాల్లో 10 సిటప్స్, 1 నిమిషంలో 15 స్క్వాట్స్‌ చేయగలగాలి.
అర్హత సాధించినవారికి అడాప్టబిలిటీ టెస్టు 1, 2 ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. 

ఫేజ్‌-3

అడాప్టబిలిటీ టెస్టులో అర్హులకు వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణకు ఎంపికచేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం ప్రతి నెలా రూ.30వేల వేతనం, రెండో సంవత్సరంలో రూ.33వేలు, మూడో ఏడాది రూ.36,500 అందుతుంది. నాలుగో సంవత్సరంలో రూ.40వేల వేతనం లభిస్తుంది.
నెలవారీ వేతనంలో 30 శాతం కార్పస్‌ ఫండ్‌కి జమ చేస్తూ . అంతే మొత్తాన్ని ప్రభుత్వమూ కలుపుతుంది. రెండూ కలిపి రూ.10.04 లక్షలవుతాయి. దీనికి వడ్డీ జమచేసి నాలుగేళ్లు పూర్తయిన తర్వాత అందిస్తారు. అలాగే అగ్నివీర్‌వాయు స్కిల్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు.

అర్హత : సైన్స్‌ విభాగానికి ఇంటర్మీడియట్​లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులు చదివి 50 శాతం మార్కులు ఉండాలి.
మూడేళ్ల డిప్లొమా కోర్సు 50 శాతం మార్కులతో పూర్తిచేయాలి.
రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులో 50 శాతం మార్కులు పొందాలి.
నాన్‌ సైన్స్‌ పోస్టులకు ఇంటర్‌లో 50 శాతం మార్కులు పొందినవారు అర్హులు.
రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులో 50 శాతం మార్కులు
ఎత్తు : 152 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు, వదిలినప్పుడు 5 సెం.మీ. తేడా తప్పనిసరి.
వయసు: జులై 1, 2005 - జనవరి 1, 2010 మధ్య జన్మించినవారై ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జులై 26 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష ఫీజు: రూ.550 + జీఎస్టీ.
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: సెప్టెంబరు 22, 23.
వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in/AV/

Leave a Comment