Health Tips : నిత్యం యవ్వనంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోండి చాలు !

By manavaradhi.com

Published on:

Follow Us

మన వయసు రోజురోజుకి పెరుగుతుంటే వృధాప్యం మీద పడుతూఉంటుంది. వయసుతో పాటు భౌతికంగా వచ్చే మార్పులను నియంత్రించడం కష్టమేమో గానీ, కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుకోవడం వల్ల వృధాప్య ఛాయలు దరికిరాకుండా కాపాడుకోవచ్చు . ఇందుకు మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మరింత పెంచుకోవచ్చు. చిన్న పాటి జాగ్రత్తల ద్వారా వయసు పెరగకుండా చూసుకోవచ్చు. మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాలి. రోజూ వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. శారీర వ్యాయామం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా చాలా అవసరం. రోజుకు కనీసం 30 నిముషాల వ్యాయామం మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎప్పుడూ పనే కాదు… విశ్రాంతి కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం అని గుర్తించడం చాలా అవసరం. ముఖ్యంగా కంప్యూటర్ లాంటి వాటి మీద పని చేసే వారికి ఇది అత్యంత ఆవశ్యకం.

మంచి అలవాట్లు మనం హాయిగా జీవించటానికి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ఎంతగానో తోడ్పడతాయన్నది తెలిసిందే. ఆరోగ్యంగా జీవించాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు. అందుకోసం మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే డీ విట‌మిన్ పొందేందుకు ఉదయం కొంత సమయం శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. ఈ అలవాటు వల్ల బరువు తగ్గుతుంది. శరీరంలో ఉండే హానికర విషతుల్య పదార్థాలను బయటకు పంపేస్తుంది. డిహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. కంటి నిండా నిద్ర‌పోయేలా చూసుకోవాలి. మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవ‌స‌రం. కాబట్టి ప్రతిరోజు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేవాలి. వ్యాయామం చేయడం వల్ల నిరంతరం శక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా ఉదయం చేసే వ్యాయామం వల్ల యాక్టివ్ గా మరియు హెల్తీగా ఉంటారు. రోజూ కాసే ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత ముఖ్యం. యోగా, ధ్యానం చేయడం వ‌ల్ల ప్ర‌శాంతంగా ఉండి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు ఎదురౌతాయి. అందుకే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవాలి. ఎలాంటి ఆహారాన్ని, ఎంత మేర తీసుకుంటన్నామని గుర్తు పెట్టుకుని మంచి డైట్ తీసుకోవాలి. దీని కోసం పండ్లు, కూరగాయాలు, ఆకు కూరలు, చేపలు అధికంగా తీసుకోవాలి. పొగ తాగడం లాంటి అలవాట్లకు చెక్ పెట్టాలి. పొగ తాగడం, అధికంగా మద్యం సేవించడం లాంటివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే ఇలాంటి అలవాట్లను వదిలించుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. డిప్రెషన్ లో ఉండడం కూడా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసి, తద్వారా శారీరక ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. అందుకే మంచి మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నించాలి. చెడు అలవాట్లు మానుకుని, మంచి ఆహారాన్ని తీసుకుంటూ, రోజూ వ్యాయామం చేస్తూ, ఒత్తిడికి దూరంగా విశ్రాంతి తీసుకోవడం వలన వృధాప్యాన్ని దరిచేరకుండా కాపాడుకోవచ్చు.

Leave a Comment