ఒక్కొక్కరిలో ఒక్కోరకం శరీరాకృతి ఉంటుంది. ఏవిధంగా అయితే శరీర ఆకారంలో తెడాలు ఉంటాయో… ఆరోగ్యం విషయంలో కూడా అలాగే ఉంటాయి. మన శరీరాకృతి మన ఆరోగ్యం గురించి కూడా చెబుతుందని… వైద్యులు అంటున్నారు….ఆకారం కారణంగా ఎలాంటి జబ్బులు గుర్తించవచ్చు.
ఒక్కొక్కరు ఒక్కో శరీరాకృతి కలిగి ఉంటారు. జన్యు సంక్రమణం వల్ల శరీర ఆకారం ఉంటుంది. దీనితో పాటు తీసుకునే ఆహారం, జీవన విధానాన్ని బట్టి కూడా శరీర ఆకృతి నిర్ణీతమవుతుంది. ఐతే ఎలాంటి శరీరాకృతి ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో తేడాలు ఉండకపోవచ్చు. కానీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలను గుర్తించడంలో శరీరాకృతి కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె సమస్యలు, రక్తపోటు, కొలస్ట్రాల్ , మధుమేహం లాంటి వాటిని గుర్తించవచ్చంటున్నారు.
శారీరక ఆకృతిని మూడు రకాలుగా విభజించవచ్చు. వాటిని ఎండో మార్ఫ్, ఎక్టోమార్ఫ్, మెసోమార్ఫ్ గా వ్యవహరిస్తారు. ఎక్టోమార్ఫ్… ఈ ఆకారం కలిగిన వారు చాలా సన్నగా ఉంటారు. చూడడానికి వీరు పీలగానే ఉంటారు. పీలగా ఉన్నప్పటికీ వీరిలో వయసు పెరుగుతున్నకొద్దీ కొవ్వు పేరుకు పోయే అవకాశం ఉంది. ఇలాంటి వారిలో ఆహారం త్వరగా ప్రాసెస్ అవుతుంది. దీనివల్ల కండరాలు దృఢమయ్యే అవకాశం చాలా తక్కువ . దీంతో ఎముకలు, కండరాలు బలంగా లేకుండా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొవ్వు పేరుకుపోవడం వల్ల కూడా సమస్యలు ఎదుర్కొంటారు.
శరీరాకృతి మన ఆరోగ్యం గురించి ఏం చెబుతుంది..?
శరీరాకృతి లో మనం మెుదటిగా చెప్పుకునేది…ఎండోమార్ఫ్ ఆకృతి గురించి. ఇలాంటి వారి శరీరం కాస్త ఫ్యాట్ గానే ఉంటుంది. చిన్న భుజాలు , పెద్ద ఎముకల నిర్మాణం ఉంటుంది. ఈ ఆకారం కలిగి ఉన్నవారు సులభంగా బరువు పెరుగుతారు . కానీ బరువు తగ్గించుకోవడం వారికి చాలా కష్టం అవుతుంది. ఈ ఆకృతి కలిగి ఉన్న వారిలో ఆహారం కెలరీలుగా ఖర్చు కాకుండా హై కార్బ్ గా ఉండిపోయి అది ఫ్యాట్ గా నిల్వ ఉంటుంది. దీంతో వీరిలోనూ ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా స్థూలకాయం వల్ల వచ్చే అన్ని రకాల సమస్యలను వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మెసోమార్ఫ్ ఆకృతి కలిగిన వారిలో వెడల్పైన భుజాలు, సన్నని నడుం ఉంటాయి. వీరిలో బాడీ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. వీరు చూడడానికి బలంగా ఉంటారు. కండరాలు దృఢంగా తయారు చేసుకోవడంలో చురుగ్గా ఉంచుకోవడం వీరికి సాధ్యమవుతుంది. కొంతమంది పియర్ షేప్ కలిగి ఉంటారు. వీరికి నడుం నుంచి పై భాగం అంతా ఎక్టోమార్ఫ్ ఆకృతిలోనూ,నడుం నుంచి కింద భాగం అంతా ఎండోమార్ఫ్ ఆకృతి కిందకు వస్తుంది.
పియర్ పండు ఆకృతిలో ఉన్న వారిలో నడుం భాగంలో, తొడల భాగంలో ఎక్కువగా ఫ్యాట్ పేరుకుపోయి ఉంటుంది. ఇది పురుషులు , స్త్రీలలో సాధారణంగా ఉంటుంది. ఐతే పురుషుల్లో నడుం భాగంలో ఉండే కొవ్వు … అనారోగ్య సమస్యలను తీసుకొచ్చి పెడుతోందని నిపుణులు భావిస్తున్నారు.
కొంత మందిలో యాపిల్ ఆకారంలో శరీరాకృతి ఉంటుంది. వీరి పొట్టలో ఎక్కవగా కొవ్వు పేరుకుపోయిందని ఈ ఆకారాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వీరిలో నడుం నుంచి కింది భాగం సన్నగానే ఉంటుంది. కానీ నడుం నుంచి పైకి వచ్చే సరికి పొట్ట భాగంలో కొవ్వు పేరుకుని పోయి ఉంటుంది. పియర్ షేపులో ఉన్న వారి కంటే .. వీరిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే గుండె సమస్యలు, క్యాన్సర్, టైప్ -2 డయాబెటిస్ , హై కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు చుట్టుముడతాయని అర్థం శరీరాకృతిలో BMI కీలక పాత్ర పోషిస్తుంది. మనిషి శారీరక ఆరోగ్యాన్ని దీని ద్వారా వైద్యులు గుర్తిస్తారు. నడుం లేదా పొట్ట భాగంలో ఎంత కొవ్వు పేరుకుపోయి ఉందో తెలుసుకుని అనారోగ్యాలను నిర్ధారిస్తారు.
మహిళల్లో 35 అంగుళాలు , పురుషుల్లో ఐతే 40 అంగుళాల కంటే ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ ఉంటే గుండె సమస్యలు , టైప్ -2 మధుమేహం , రక్తపోటు , కొలస్ట్రాల్ లాంటి సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి తమ శరీరకృతిని బట్టి ఎవరికివారు అలర్ట్ గా ఉంటూ తరచూ వైద్యుల సలహాతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
మన ఆరోగ్యం గురించే ఏం చెబుతుంది? మన వయసుతో పాటు మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. కానీ మనం మన శరీరం యొక్క ఆకృతిని పట్టించుకోకుండా, దానిని సరైన విధంగా ఉంచుకోకుంటే మాత్రం, ఎన్నో ఇబ్బందులకు ఇది కారణమవుతాయి. చక్కటి శరీరాకృతి కోసం నిత్యం వ్యాయామాలు చేయడంతోపాటు మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి.