Lung Cancer:లంగ్ క్యాన్సర్ ను గుర్తించే ప్రమాద సంకేతాలు ఏంటి..?

By manavaradhi.com

Updated on:

Follow Us

రోజురోజుకూ కాలుష్యం పెరిగిపొతుంది. దానికి తోడు పొగ తాగే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దీని కారణంగా పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మన దేశంలో 90 శాతం కేసుల్లో క్యాన్సర్ వ్యాప్తికి పొగాకు వాడకమే ప్రధాన కారణం. ప్రజల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ పట్ల అవగాహన లోపం కూడా ఈ వ్యాధి పెరుగుదలకు మరో కారణం. సాధారణ వ్యక్తితో పోలిస్తే, పొగ తాగేవారిలో ఈ వ్యాధి రావడానికి రెండున్నర రెట్లు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు వాతావరణం కాలుష్యం ఈ వ్యాధిని వ్యాప్తి చేస్తోంది. ప్రజల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ పట్ల అవగాహన లోపం కూడా ఈ వ్యాధి పెరుగుదలకు మరో కారణం. పైగా ఈ వ్యాధి లక్షణాలను బట్టి, దీన్ని ట్యూబర్కులోసిస్ గా పొరబడి, చికిత్స విషయంలోనూ ఆలస్యం జరుగుతోంది. ఈ విషయం పట్ల చిన్న అవగాహన ఉండి, ప్రారంభంలోనే గుర్తించగలిగితే, ఈ సమస్య నుంచి కాపాడడం ప్రస్తుతం అభివృద్ధి చెందిన వైద్య పరిజ్ఞానానికి కష్టమైన విషయం కాదు అన్నది వైద్యుల మాట.

లంగ్ క్యాన్సర్ ను ఎలాంటి లక్షణాల ద్వారా గుర్తించవచ్చు ?
ఊపిరితిత్తుల క్యాన్సర్ ను ముందస్తు లక్షణాలను బట్టి తెలుసుకోవాలి. ఇందులో ప్రధానమైనది ఆపుకోకుండా వచ్చే దగ్గు. కఫంలో రక్తం పడడం. ఛాతీలో నొప్పి. తలనొప్పి, వాంతులు ముఖ్యమైనవి. నెలరోజులకు పైగా దగ్గు వస్తున్నా, క్రమంగా బరువు తగ్గుతున్నా, మాటలో మార్పు కనిపించినా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ప్రస్తుతం రోగికి నొప్పిలేని రేడియో థెరఫి చికిత్స చేస్తున్నారు. దీంతోపాటు ర్యాపిడ్ ఆర్క్ వంటి ఆత్యాధునిక వైద్య ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న రోగులకు కీమో థెరఫి లేదా రేడియో థెరఫితో చికిత్స చేస్తున్నారు. క్యాన్సర్ నివారణకు టార్గెటెడ్ థెరఫి విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇప్పుడు కత్తిగాటు లేని ట్రిపుల్ ఎప్ బీమ్స్ కిరణాలతో చేసే చికిత్స మరింత ఆధునికమైనది. దీని వల్ల ఇతర కణజాలాల మీద కూడా ప్రభావం అంతగా ఉండదని నిరూపితమమైంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారీ పడకుండా కాపాడుకోవచ్చు. దీనికి ముందుగా పొగతాగే అలవాటును మానుకోవాలి. అదే విధంగా పొగతాగే వారి పక్కన ఉండడం కూడా మంచిది కాదు. వాహనపు పొగల వంటి వాహన కాలుష్యం నుంచి, పరిసరాల్లో వ్యాపించే కాలుష్యం నుంచి దూరంగా ఉండాలి. పరిశుభ్రమైన వాతావరణంలో జీవించాలి. అదే విధంగా నిమోనియా లాంటి సమస్యలు ఉన్నవారు దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. ప్రస్తుతం కొన్ని రకాల రసాయనాలు సైతం ఊపిరితిత్తుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. సెంట్లు, శుభ్రత సామాగ్రి కొనేటప్పుడు వాటి మీద ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణమయ్యే కారకాలు ఉన్నాయేమో చూసి జాగ్రత్త పడాలి. సరైన ఆహారం తీసుకుంటూ, ఇంట్లో ఆరోగ్యకరమైన గాలి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం, బయట గాలి కాలుష్యం నుంచి రక్షణ పొందడం చేయగలిగితే ఈ సమస్యను సమగ్రంగా నివారించవచ్చు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఏటా లక్షలాది మందిని చంపేస్తోంది. ఎక్కువగా స్మోకింగ్ దీనికి కారణమవుతోంది. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండాలి. వాయి కాలుష్యం ఉండే ప్రదేశాలకు దూరంగా నివసించాలి. పనిచేసే చోట కూడా ఎలాంటి కాలుష్య వాయువుల ప్రభావం లేకుండా చూసుకోవాలి.

Leave a Comment