Pulmonary Angiogram : పల్మనరీ యాంజియోగ్రామ్ ఎందుకు ఎలా చేస్తారు..?

By manavaradhi.com

Published on:

Follow Us
Pulmonary Angiogram

ఈరోజుల్లో ఎన్నో రకాల శ్వాసకోశ సమస్యలు మనిషిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఊపిరితిత్తి యొక్క ఒక ఆంజియోగ్రామ్ అనేది ఒక X- రే పరీక్ష. ఈ పరీక్ష ద్వారా ఊపిరితిత్తులకు వెళ్ళే రక్త నాళాల యొక్క రక్త ప్రవాహం చిత్రాలు స్క్రీనింగ్ కు ఉపయోగిస్తారు. ఆంజియోగ్రామ్ చేసే సమయంలో కాథెటర్ అనే ఒక సన్నని గొట్టాన్ని మోచేతి పై భాగాన ఉంచుతారు. కాథెటర్ అనేది ఆ ప్రాంత అధ్యయనానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యాధులను నిర్ధారించేందుకు పల్మనరీ యంజియోగ్రామ్ అనే టెస్టులు అందుబాటులో ఉన్నాయి.

పల్మొనరీ యాంజియోగ్రామ్ అంటే పల్మొనరీ సర్క్యులేషన్ లో రక్తనాళాలకు చేసే పరీక్ష . ఇది శ్వాసకోశలకు సంబంధించినది. ఈ శ్వాసకోశాలకు ఛాతీ ఎక్స్ రే, CT స్కాన్ , ఎం‌ఆర్‌ఐ, లంగ్ ఫంక్షన్స్, డిఫ్యూజన్ డిఫెక్ట్స్, డిఫ్యూజన్ టెస్ట్స్ లాంటి ఎన్నో పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు అరుదుగా చేసే పరీక్షల్లో పల్మొనరీ యాంజియోగ్రామ్ ముఖ్యమైనది. ఈ టెస్ట్ అవసరమయ్యే రోగులు కూడా అరుదుగానే ఉంటారు. రక్త నాళాల్లో ఒకవేళ ఏవైనా అడ్డంకులు ఉంటే అవి ఎంత తీవ్రంగా ఉన్నాయో అని తెలుసుకోవడానికి ఈ పరీక్ష అవసరమవుతుంది. గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో ఉండే బ్లాక్స్ మాదిరిగానే పల్మొనరీ యాంజియోగ్రామ్ లో కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తనాళాల్లో అడ్డంకులను ఈ పరీక్ష ద్వారా గుర్తిస్తారు.

కొన్ని వ్యాధులు సాధారణంగా సి.టి స్కాన్, ఎం‌ఆర్‌ఐ ద్వారా అంతుచిక్కవు. కానీ ఆయాసంతో ఇబ్బంది పడుతున్నవాళ్లు, ఆక్సీజెన్ పరిమాణం తక్కువ అవుతున్నవాళ్ళల్లో పల్మొనరీ ఎంబాలిజమ్ అనే వ్యాధి ఉందో లేదో గుర్తించాలి. రక్తనాళాల్లో అడ్డంకులుగా వచ్చే వ్యాధుల్లో ఈ పల్మొనరీ ఎంబాలిజమ్ అనేది ఒకటి. దీని ప్రభావం కాళ్ళల్లో కానీ , పెల్విక్ ప్రాంతాల్లో కానీ కనిపిస్తుంది. రక్తనాళల్లో రక్తం గడ్డలు కట్టుకుపోయి అవి అక్కడే ఉండకుండా గుండె వరకు, గుండె నుంచి శ్వాస నాళాలకు , ఊపిరితిత్తుల్లో ఉండే రక్తనాళాల్లోకి వెళ్ళి అక్కడ అడ్డంకులు చేస్తున్నప్పుడు దీనిని పల్మొనరీ త్రాంబో ఎంబాలిజం అంటారు. ఈ అండ్డంకులు రావడం వల్ల శ్వాస ప్రక్రియ సరిగ్గా జరగదు. ఆక్సీజెన్ సరఫరా సరిగ్గా ఉండదు. బ్లడ్ ప్రెషర్ కూడా పడిపోతుంది. కాబట్టి దీనిని ఒక ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు.

ఊపిరితిత్తులకు వచ్చే మరో ముఖ్య సమస్య ఫ్యాట్ ఎంబాలిజం. రోడ్ ట్రాఫిక్ ఆక్సిడెంట్స్ లో లాంగ్ బోన్స్ ఫ్రాక్చర్స్ అయినపుడు .. ఈ లాంగ్ బోన్స్ లో ఉండే ఫ్యాట్ మూలుగలో రక్తప్రవాహం ద్వారా గుండెకు వెళ్ళి శ్వాస కోశాల్లో ఉండే రక్తనాళాల్లో అడ్డంకులు చేస్తుంది. ఈ ఫ్యాట్ ఎంబాలిజం కొంతమందిలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఊపిరితిత్తుల్లో అడ్డంకులు అనేవి గాలి ద్వారా కూడా వస్తాయి. దీనిని ఏర్ ఎంబాలిజమ్ అంటారు. దీనిని అత్యవసర పరిస్థితుల్లో చేస్తుంటారు. ఈ సెంట్రల్ లైన్ వేస్తున్నపుడు లేదా వెంటిలేషన్ ఇస్తున్నప్పుడు కొంతమందిలో బ్యారో ట్రామా, న్యూమో థోరాక్స్ , న్యూమో మిడస్తం లాంటి సమస్యలు వస్తుంటాయి. కొంతమందిలో సిజేరియన్ చేస్తున్నప్పుడు కూడా గాలి శ్వాస కోశాల్లో ఉండే రక్తనాళాలకు వెళ్ళి అడ్డంకులుగా ఏర్పడి ఏర్ అంబాలిజం ను ఏర్పరుస్తుంది. మరికొంతమందిలో ట్యూమర్ కణాలు శరీరంలో ఎక్కడో క్యాన్సర్ కణాలుగా ఉండి .. ఆ కణాలు ట్యూమర్స్ మాదిరిగా మారి ఊపిరితిత్త్లుల్లో ఉండే రక్తనాళాలని అడ్డుకోవడాన్ని ట్యూమర్ ఎంబాలిజం అంటారు. ఇలాంటి అరుదైన ఎన్నో సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతోంది పల్మొనరీ యాంజియోగ్రామ్ పరీక్ష .

1 thought on “Pulmonary Angiogram : పల్మనరీ యాంజియోగ్రామ్ ఎందుకు ఎలా చేస్తారు..?”

Leave a Comment