రోగనిరోధక శక్తి… మనకు ఏ వ్యాధులూ రాకుండా కాపాడే శరీరంలోని ఓ రక్షణ వ్యవస్థ. వ్యాధులు వచ్చినా.. దాన్ని సమర్థంగా పోరాడి పారదోలే యంత్రాంగం కూడా ఇదే! కొంతమందిలో పలు కారణాల వల్ల ఈ రోగ నిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల తరచూ అనారోగ్యాల బారిన పడుతుంటారు.. ఇలాంటప్పుడు రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపైనే అందరూ దృష్టిసారిస్తున్నారు. అయితే కొన్ని అలవాట్లు వల్ల మనకు తెలియకుండానే రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది.
మన చుట్టూ నిరంతరం బోలెడన్ని హానికారక సూక్ష్మక్రిములు తిరుగుతుంటాయి. ఎప్పుడైనా వాటి బారినపడే ప్రమాదముంది. దీంతో రకరకాల ఇన్‌ఫెక్షన్లు, జబ్బులు దాడిచేస్తాయి. అయితే మనలో రోగనిరోధక శక్తి బలంగా ఉందనుకోండి. అవేమీ చేయలేవు. వ్యాయామం, మంచి జీవనశైలి మాత్రమే కాదు… కొన్నిరకాల అలవాట్లను సొంతం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతాం.వ్యాయామం… ఇది చాలా ముఖ్యమైంది. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో అర్థగంటసేపు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యకర ఆహారం… తీసుకోవడం వల్ల శరీరానికి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. గుడ్లు, చేపలు మరియు పాలు మరియు తృణధాన్యాలు వంటి బలవర్థకమైన ఆహారాలలో పొందవచ్చు. విటమిన్ డి పొందడానికి సూర్యరశ్మి మరొక ముఖ్య వనరు. వేసవిలో, మీ చేతులు, ముఖం మరియు చేతులపై కేవలం 5-15 నిమిషాల కిరణాలు వారానికి 2-3 సార్లు సరిపోతాయి. శీతాకాలంలో, మీకు కొంచెం ఎక్కువ అవసరం కావచ్చు.కొన్ని రకాల మందుల వల్ల కూడా రోగనిరోధక శక్తి తగ్గుతూవస్తుంది. వాటిలో అలెర్జీలు, ఆర్థరైటిస్, లూపస్, ఐబిఎస్ మరియు అవయవ మార్పిడి చికిత్సకు మందులు ఉన్నాయి. ఏదైనా ప్రిస్క్రిప్షన్ మందులను సర్దుబాటు చేసే ముందు మీ వైద్యుడితో మాట్లాడండి.
తీపి అంటే ఎవరికి చేదు చెప్పండి. రోజులో ఏదో రకంగా మనం తీపి పదార్థాలు తింటూ ఉంటాం. కానీ దాన్ని ఇష్టపడే వారు మరింత అధికంగా చక్కెర తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని అందరికీ తెలుసు. ఇలా అధిక మోతాదులో చక్కెర వినియోగం వల్ల రోగనిరోధక కణాల పని సామర్థ్యం కూడా తగ్గిపోతుందని పరిశోధకులు ఇటీవల చేసిన అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి చక్కెర తీసుకునే సమయంలో మోతాదు మించకుండా చూడండి.
కాఫీ, టీ తాగడం వల్ల కలిగే లాభనష్టాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కొన్నిసార్లు అవి తాగడం మంచిదేనంటారు.. కాఫీ, టీలో ఉండే కెఫిన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. సాధారణంగా నిద్రరాకుండా ఉండటం కోసం కాఫీ, టీలు తాగుతుంటారు. ఇలా అధికంగా తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. ఫలితంగా కడుపులో మంటగా ఉండటం, రోగనిరోధకశక్తి తగ్గడం వంటివి జరుగుతాయి.
ఎంత బాగా వండినా.. ఎన్ని మసాలాలు వేసినా వంటలో ఉప్పు లేకపోతే రుచే ఉండదు. ఆహార పదార్థాల్లో దానికి అంత ప్రాధాన్యం ఉంది. అలా అని అధిక మొత్తంలో ఉప్పును తింటే రక్తపోటు పెరుగుతుందని అందరికి తెలిసిందే. కానీ, దీని వల్ల రోగనిరోధకశక్తి బలహీనపడుతుందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. శరీరంలోని అధిక సోడియంను మూత్రపిండాలు వడపోసే సమయంలో డొమినే ఎఫెక్ట్ సంభవిస్తుందని, దీని వల్ల శరీరం బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుందని పరిశోధకులు తెలిపారు.
యువత, పిల్లలు ఎక్కువగా జంక్‌ఫుడ్ తింటుంటారు. వారాంతం వస్తే చాలు, ఇంటి వంట పక్కన పెట్టి.. పిజ్జా, బర్గర్లు కావాలంటూ మారం చేస్తారు. తల్లిదండ్రులు కాదనలేక కొనిస్తుంటారు. కానీ, ఈ జంక్‌ఫుడ్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీటి వల్ల శరీరంలో కొవ్వు పెరిగి, రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. దీంతో సులువుగా వ్యాధులు శరీరంలోకి వచ్చి చేరుతాయి. కాబట్టి ఈ జంక్‌ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండండి.
ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురికావడం మానసిక అనారోగ్యానికి దారితీయొచ్చు. ఒత్తిడి వల్ల రక్తపోటు పెరుగుతుంది. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జీర్ణక్రియపై కూడా ప్రభావం పడుతుంది. ఫలితంగా శరీరంలో హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది.నిత్యం మద్యం సేవించేవారిలో కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశంతోపాటు రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. మద్యం ఎక్కువగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని.. తద్వారా మొదట న్యూమోనియా రావడం, అనంతరం శ్వాస తీసుకోవడంలోనూ సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.సిగరెట్లు, పొగాకు నమలడం వల్ల వచ్చిన నికోటిన్ శరీరంలోని సూక్ష్మక్రిములతో పోరాడే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోతూవస్తుంది.
మన చుట్టూ నిరంతరం బోలెడన్ని హానికారక సూక్ష్మక్రిములు తిరుగుతుంటాయి. ఎప్పుడైనా వాటి బారినపడే ప్రమాదముంది. దీంతో రకరకాల ఇన్‌ఫెక్షన్లు, జబ్బులు దాడిచేస్తాయి. అయితే మనలో రోగనిరోధక శక్తి బలంగా ఉందనుకోండి. అవేమీ చేయలేవు. వ్యాయామం, మంచి జీవనశైలి ద్వారా మనలోని రోగనిరోధక శక్తిని పెంపోందించుకోవచ్చు.