బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 – తాండవం’ డిసెంబర్ 5న విడుదల కానుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అఖండ-2′. సంయక్త మీనన్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. షూటింగ్ తో పాటు డబ్బింగ్ పనులను ముగించుకున్న ఈ సినిమా డిసెంబరు 5నవరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ భారీ ధర పలికాయి..
ఉత్తరాంధ్ర – రూ. 13.50Cr గాయత్రీ దేవి ఫిల్మ్స్ సతీష్ కొనుగోలు చేశారు.
గుంటూరు : రూ. 9.50 Cr రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకున్నారు
ఈస్ట్ గోదావరి : రూ. 8.25 Cr విజయలక్ష్మి సినిమాస్
కృష్ణ : రూ. 7 Cr నాని వెంకట్
వెస్ట్ గోదావరి : రూ. 6.5 Cr
నెల్లూరు : రూ. 4.4 Cr కావలి భరత్
సీడెడ్ : రూ. 24 కోట్లు.. శోభన్
నైజాం ఏరియా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతికి వచ్చే అవకాశం ఉంది. నిర్మాతలు రూ. 30 కోట్లు కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఖండ 2 – తాండవం’ ఫస్ట్ గ్లింప్స్‌తోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రత్యేకంగా విడుదల చేసిన ప్రోమోలు, టీజర్, పాటలు అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి.









