Diet : ఎటువంటి ఆహారాలు మన ఆరోగ్యానికి మంచిది ?

By manavaradhi.com

Published on:

Follow Us
Diet for a Lifetime

ఆరోగ్యకరమైన ఆహారం వల్ల దీర్ఘకాల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. శరీరం మొత్తం కూడా బలంగా మారుతుంది. మెదడు, గుండె, ఎముకలు, మెదడువంటి వాటి పనితీరు మెరుగవుతుంది. అంతేకాకుండా ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. మనం నిత్యం మంచి ఆహరాన్ని తీసుకోవడం వల్ల మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు . చక్కని ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలి.

ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం అందరికి తెలుసు. నిత్యం పని ఒత్తిళ్ల మధ్య ఉంటూ బిజీ బిజీగా గడుపుతూ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. కొత్త జీవన విధానాలతో మన ఆహారపు అలవాట్లు మొత్తం మారిపోయాయి. ఇక ఆరోగ్యకరమైన ఆహారం గురించి అయితే అసలు మర్చిపోయాం. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలను మనం పొందగలుతాం. సరైన పోషకాహారం తీసుకోవడాన్నే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అంటారు. లీన్ ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వులను సమానంగా తీసుకుంటే చాలు. వీటన్నింటినీ తగిన మోతాదులో తీసుకోవాలి. దీంతో శరీరం బలంగా తయారవుతుంది. వ్యాధులు దూరం అవుతాయి.

కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, శరీరానికి అవసరమైన పోషకాలను అందించే మంచి ఆహారాలు. పిజ్జాలు, పాస్తా, బర్గర్లు, ఫ్రైస్ మొదలైనవి వంటి ఫాస్ట్ ఫుడ్స్ కు వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది. వీటిలో ఎక్కువగా అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్, శీతల పానీయాలకు కూడా దూరంగా ఉండాలి. నీరు, పిండి పదార్ధాలు, కూరగాయలు, పండ్లు, ఫైబర్స్, పాలు, పాల ఉత్పత్తులు, ప్రోటీన్లు ఉండే ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

ఆరోగ్యకరమైన గుండె కోసం సోడియం, కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారం గుండెకు చాలా మంచిది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యాల్షియం అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల దంతాలు బలంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా ఈ ఫుడ్స్ ఉపయోగపడతాయి. విటమిన్ డీ మన శరీరంలో క్యాల్షియాన్ని సమన్వయం చేస్తుంది. కాబట్టి విటమిన్ డీ తగినంత తీసుకోవడం కూడా అవసరం. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, మంచి ఆహారాలు, పండ్ల రసాలు, తృణధాన్యాలు మొదలైన వాటిలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.

మెదడు సక్రమంగా పని చేయాలంటే సరైన పోషకాహారం అవసరం. బరువు నియంత్రణ ఎక్కువ ఫ్యాట్స్ ఉండే ఆహారం తీసుకోకపోవడం మంచిది. అలాగే ఒకేసారి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకుండా రెండు మూడు సార్లు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కూడా చాలా మంచిది. అలాగే మంచి పోషక పదార్థాలుండే అల్పాహారం తీసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు ఎనర్జీని ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మైండ్, బాడీ సక్రమంగా పని చేయగలుగుతాయి. మీరు ఒకవేళ ఒత్తిడికి గురవుతున్నట్లయితే ఒమేగా -3 ఫ్యాట్ యాసిడ్స్ ఉండే ఆహారపదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ఈ యాసిడ్స్ కార్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన నుంచి శరీరాన్ని కాపాడుతాయి. నట్స్, బచ్చలికూరలలో విటమిన్ సి, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి బారీన పడకుండా ఉంటారు. పండ్లు, కూరగాయలు వంటి వాటిలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిని తరచుగా తినడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో ఉండే ఆమ్లజనకాలు చర్మ కణాలను రక్షిస్తాయి. దీంతో మీరు యవ్వనంగా కనిపిస్తారు.

చేపల్లో లభించే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలాగే చర్మం ముడుతలుపడకుండా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఆహారాలు సెరోటోనిన్ ను పెంచడానికి సాయం చేస్తాయి. సెరోటోనిన్ మెదడుకు సంబంధించిన ఒక రసాయనం. ఇది మన మానసికి స్థాయిని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలనునియంత్రించడానికి సహాయం చేస్తాయి. అందువల్ల ఇలాంటి పదార్థాలుండే ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది.

మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వులు శరీరానికి చాలా అవసరమైనవి. తినే ఆహారం ద్వారా సక్రమంగా అందాల్సినవి కూడా! వాటితో పాటు విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచుపదార్థం వంటివి తగిన మోతాదులోనైనా తప్పనిసరిగా అందాలి. అప్పుడే శారీరక, మానసికంగా ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఒకసారి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభిస్తే మీకు అన్ని ప్రయోజనాలే కలుగుతాయి.

Leave a Comment