ప్రస్తుతం మనకు చేప నూనెతో తయారు చేసిన క్యాప్సూల్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ క్యాప్సూల్స్ లేదా చేప నూనె ఈ రెండింటిలో దేన్ని తీసుకున్నా మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. చేప నూనె ద్వారా ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ ఎక్కువ శాతం మనకు లభిస్తాయి. ఇది అనేకరకాల అనారోగ్య లక్షణాలను, అనారోగ్యాలను కూడా దూరం చెయ్యగలదు. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ఎంతగానో సహాకరిస్తాయి.
చేప నూనె అంటే ఏమిటి అని కొందరికి సహజంగా వచ్చే అనుమానం. చేప నూనె అనేది ఎక్కువ జిడ్డు కలిగిన చేపల కణజాలం నుండి సేకరిస్తారు. ముఖ్యంగా సాల్మన్, వైట్ ఫిష్, హెర్రింగ్, సర్డినెస్ మరియు అన్కోవిస్ అనే చేపల నుండి ఈ చేప నూనెని తీస్తారు. చేప నూనెలో 30 శాతం ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ ఉంటుంది. మిగిలిన 70 శాతం ఖనిజాలతో,పోషకాలతో నిండి ఉంటుంది. కాబట్టి చేపని ఆరోగ్య ప్రదాయినిగా వ్యవహరిస్తుంటారు. చేప నూనె అనేక సమర్ధవంతమైన ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంటుంది. చేపల కాలేయం నుంచి కూడా నూనె తీస్తారు. ముఖ్యంగా షార్క్, స్కేట్ మొదలైన చేపల కాలేయం నుంచి తీసే నూనెల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి.
చేప నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవి ?
ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం వారానికి ఒకటి, రెండు చేపలు తినాలి. అప్పుడే శరీరానికి కావల్సిన ఒమేగా ఫాటీ ఆసిడ్స్ లభిస్తాయి. చేపలు తినడానికి ఇష్టపడని వారు కనీసం చేపనూనెనైనా ఉపయోగించాలి. గుండె ఆరోగ్యానికి చేప నూనె ఎంతో మంచిది. గుండెపోటు ప్రపంచంలోని మరణాల ప్రధాన కారణాల్లో ఒకటి. చేప నూనెని తీస్కునే వారు ఎక్కువగా హృద్రోగం బారిన పడకుండా ఉన్నారని ఎన్నో నివేదికలు తేల్చాయి. చేప నూనె శరీరంలో కొవ్వు స్థాయిలను ట్రైగ్లిసరైడ్స్ ను తగ్గించడం మూలంగా అధిక రక్తపోటుని, గుండెపోటును అడ్డుకోగలుగుతుంది. అలాగే చేప నూనే అధిక బరువుని తగ్గిస్తుంది. ఊబకాయం ఇతర వ్యాధుల తీవ్రతని పెంచే ప్రమాదకరమైనది. గుండె జబ్బులకు ప్రధాన కారణం ఈ ఊబకాయం. చేప నూనె ఊబకాయం స్థాయిని పెరగకుండా నిలువరిస్తుంది. తద్వారా అనేక రుగ్మతలకు కళ్ళెం వేస్తుంది. మీరు ఉబకాయానికి గురవుతున్నారు అని అనుమానం వస్తే చేపనూనెని తీసుకోవడం మంచిది
చేప నూనె గుండె ఆరోగ్యానికి మంచిదేనా ?
చేప నూనె గుండెజబ్బులను నివారించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అని కనుగొన్నారు. జీవక్రియలో ఇబ్బందులు ఉన్న జబ్బులు మరియు గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్న వ్యక్తులు క్రమం తప్పకుండా చేప నూనె తీసుకోవటం వలన చాలా లాభం పొందుతారు. చేప నూనెతో తయారు చేసిన క్యాప్సూల్స్ కూడా మనకు లభిస్తున్నాయి. అయితే ఈ క్యాప్సూల్స్ లేదా చేప నూనె ఈ రెండింటిలో దేన్ని తీసుకున్నా మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. చేపలు తినని వారు మార్కెట్లో అందుబాటులో ఉండే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని పలు పరిశోధనల్లో కూడా తేలాయి.
గుండెను పదిలం చేసుకోవాలంటే వారానికి ఒక్కసారైనా చేపలు తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అది కూడా నూనె ఎక్కువగా ఉన్న చేపలను ఆరగించాలి. దీని వల్ల గుండెపోటు వచ్చే ముప్పు ఆరు నుంచి 12శాతం వరకు తగ్గుతుందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. చేపలు తినడం ఇష్టం లేనివారు క్రమం తప్పకుండా చేప నూనె తీసుకోవటం వలన చాలా లాభం పొందవచ్చు.