యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తీవ్రమైన వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతాయి. మన శరీరానికి ఇంతలా ఉపయోగపడే …యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్.
మన శరీరంలో జరిగే జీవక్రియలు సరైన క్రమంలో జరగాలన్నా,మన శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ను తొలగించాలంటే మనం తీసుకునే ఆహార పదార్థాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండాలి. యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని కణాల నష్టాన్ని ఆలస్యం చేయడానికి లేదా నిరోధించడానికి ఉపయోగపడతాయి. అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉండటం వల్ల మన శరీరంపై ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడి .. శరీరంలో ఏర్పడిన ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపిస్తాయి.
సాధారణంగా వంటకాల్లో అందరు టమోటాను వాడుతారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలనుకుంటే టమోటాని కచ్చితంగా డైట్లో చేర్చండి. వెల్లుల్లి యాంటిబయోటిక్ లక్షణాలు కలిగినదని మనందరికీ తెలిసిన విషయమే. అంతే కాదు ఇందులో యాంటీఆక్సిడెంట్స్, ఎ, బి, మరియు సి, సెలీనియం, ఐరన్, జింక్ మొదలగునవి ఫుష్కలంగా ఉండి. హై బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిస్తుంది.
సాధారణంగా చాక్లెట్ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పెద్దలు పిల్లలను వాదిస్తుంటారు.అయితే చాక్లెట్లలో డార్క్ చాక్లెట్ తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మంచి నాణ్యత గల చాక్లెట్ లో అధికశాతం పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఉంటాయి.తరచూ ఈ డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన అన్ని యాంటీఆక్సిడెంట్లు అంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
కోడి మరియు ఇతర జంతు కాలేయంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది, ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది ఎముకల ఆరోగ్యం మరియు దృష్టికి సహాయపడుతుంది. అనారోగ్యం నుండి శరీర రక్షణను పెంచుతుంది.
పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకు కూరలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవి కళ్లకు మేలు చేస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. మిగితా గ్రీన్ వెజిటేబుల్స్ లాగో బ్రొకోలిలో కూడా అధిక యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇందులో ఫైటో న్యూట్రియంట్స్ శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా అనేక వ్యాధులతో పోరాడే ఫోలీన్యూట్రియంట్స్ కలిగి ఉంటుంది. గ్రీన్ టీలో ఉన్న ఫోలిఫినాల్స్ నుండి యాంటిఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్ ఫ్యాట్ మెటబాలిజానికి సహాయపడుతుంది.
మనకు తెలిసినంత వరకూ యాంటిఆక్సిడెంట్స్ ఆహారాలు చాలానే ఉన్నాయి. రెడ్ బెల్ పెప్పర్ లో అధికంగా కెరోటినాయిడ్స్ మరియు విటమిన్ సి,యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రెడ్ మరియు ఎలో బెల్ పెప్పర్స్ ఆరోగ్యానికి మంచిది ఇందులో న్యూట్రిషియన్స్ పుష్కలం లభిస్తాయి. బెర్రీస్ లో సిట్రస్ ఆమ్లం మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా యాంటీఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉండి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే వాటిలో ఆర్టిచోకెస్ ఒకటని చెప్పవచ్చు. ఈ ఆర్టిచోకెస్ శరీరంలో ఏర్పడిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి వారి గట్ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఇవి దోహదపడతాయి. పలు అధ్యయనాల ప్రకారం ఆర్టిచోకెస్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్‌పై యాంటీఆక్సిడెంట్ ప్రభావాన్ని చూపుతాయని, తరుచూ వీటిని తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
భారతీయులు బంగాళదుంపని చాలా ఇష్టపడుతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ అధిక స్థాయిలో ఉంటాయి. ఇది విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్లకి మంచి మూలం. ఇది వాపును తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి ఇతర ప్రయోజనాలను కలిగి ఉంటుంది.