Foods For Healthy Hair: ఒత్తైన పొడవైన జుట్టు కోసం ఈ ఆహారాలను తప్పక తీనండి..!

By manavaradhi.com

Published on:

Follow Us

సాధారణంగా అందం విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే జుట్టు విషయంలో మాత్రం సాధారణ జాగ్రత్తలతో పాటు, మరికొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ ఒత్తైన పొడవైన జుట్టు కావాలని కోరుకుంటారు. నిజం చెప్పాలంటే మనిషి అందం అంతా కేశాల మీదే ఆధారపడి ఉంటుంది. కేశాలు లేకపోతే, ఎంత అందంగా ఉన్నా, ఎంత అలంకరణ చేసుకున్నా ప్రయోజనం ఉండదు. ప్రస్తుత కాలంలో అందంతో పాటు, కేశ సంరక్షణ మీద కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జుట్టు రాలడానికి అనేక కారణాలున్నాయి. ప్రతి రోజూ ఒత్తిడితో కూడిన ఉరుకుల పరుగుల జీవితం మరియు అనారోగ్యపు జీవనశైలి కూడా జుట్టు రాలడానికి కారణం అవుతున్నాయి. చర్మం, కేశాల సంరక్షణ మన ఆరోగ్యం మీదే ఆధారపడింది. అంతే కాదు, వంశపారంపర్య లక్షణాలు, మరియు వయస్సు కూడా జుట్టు పెరుగుదల మీద ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా అంతర్గతంగా మనం తీసుకొనే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పౌష్టికాహార లోపం వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలుతుంది.

ముఖ్యంగా జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే, అందుకు మనం తీసుకొనే ఆహారం నుండి తగిన మోతాదులో విటమిన్స్, మినిరల్స్ మరియు ప్రోటీన్స్ సరిపడా అందినప్పుడే జుట్టు పెరుగుదల నార్మల్ గా ఉంటుంది. విటమిన్స్ మరియు మినిరల్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మరియు బలంగా పెరుగుతుంది. మరియు జుట్టు రాలడం మరియు జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలను నివారిస్తుంది.

ముఖ్యంగా జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే, అందుకు మనం తీసుకొనే ఆహారం నుండి తగిన మోతాదులో విటమిన్స్, మినిరల్స్ మరియు ప్రోటీన్స్ సరిపడా అందినప్పుడే జుట్టు పెరుగుదల నార్మల్ గా ఉంటుంది. విటమిన్స్ మరియు మినిరల్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మరియు బలంగా పెరుగుతుంది. మరియు జుట్టు రాలడం మరియు జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలను నివారిస్తుంది.

  • మనకు దృడమైన జుట్టు కావాలని కోరుకున్నప్పుడు మనం తప్పని సరిగా మనం తీసుకొనే ఆహారం మీద దృష్టి పెట్టాలి. మనం ప్రతి రోజూ తినే పోషకాలు మన జుట్టు మరియు హెయిర్ పోలిసెల్స్ మీద కీలక పాత్రను పోషిస్తాయి.
  • గుడ్డు తింటే శరీరానికి ప్రొటీన్లు దండిగా లభిస్తాయి. జింక్‌, సెలీనియమ్‌, సల్ఫర్‌, ఐరన్‌ వంటి ఖనిజాలు కూడా గుడ్డులో పుష్కలం. వెంట్రుకలు చిట్లిపోకుండా ఆక్సిజన్‌ను అందించేందుకు ఇనుము తోడ్పడుతుంది.
  • సిట్రస్ జాతికి చెందిన ఆరెంజ్ లో విటమిన్ సి అధికంగా ఉండి, శరీరానికి కావాలసినంత ఫైబర్ కంటెంట్ ను అంధించడంతో కురులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కేశలాను దృఢంగా పెరిగేలా చేసే రూట్ కెనాల్ కు కావలసినంత బీటా కెరోటిన్ అంధిస్తుంది.
  • ఆరోగ్యకరమైన జుట్టుకు అరటి పండ్లు చక్కగా ఉపయోగపడతాయి. ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు నేచురల్ గా ఎలాసిటిని అందిస్తుంది. ఏ పండ్లలో లేని విధంగా మామిడిలో విటమిన్స్ మరియు మినిరల్స్ అత్యధికంగా ఉన్నాయి. ఇందులో ఉండే హై విటమిన్ కంటెంట్ మందపాటి జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతాయ.
  • మ్యాంగో జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది జుట్టు పెరుగుదలకు శరీరంలో బాగా సహాయపడుతుంది.
  • బెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మంచి పోషకాహారం ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు, చర్మ మరియు జుట్టు సంరక్షణకు బాగా సహాయపడుతాయి.
  • విటమిన్ సి బలమైన కురుల పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. మరియు జుట్టు రాలడాన్ని అరికడుతుంది. బాదాం చూడటానికి, తినడానికి చిన్న స్నాక్ అయినా ఇందుల్లో వున్న ‘విటమిన్ ఇ’ తల మాడుకు, కేశాలకు కావలసిన పోషకాలు అందించే గుణాలు మెండుగా ఉన్నాయి.
  • వాల్ నట్స్ లో కూడా విటమిన్ ఇ అధికంగా ఉండి, తల మాడుకు రక్త ప్రసరణను బాగా అందజేస్తుంది. అంతే కాదు వాల్ నట్స్ లో జింక్ అధిక శాతం కలిగి ఉంటుంది. జింక్ శరీరానికి అంధించడం వల్ల కేశాలకు మంచి మెరుపు వస్తుంది.
  • ఎండు ద్రాక్షలో ఐరన్ ఎక్కువగా ఉండి, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి శరీరానికికే కాకుండా కేశాలకు అందజేస్తుంది.

శిరోజాలు బాగా పెర‌గాల‌న్నా, ఒత్తుగా, దృఢంగా ఉండాల‌న్నా అందుకు పోష‌కాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కీరదోసకాయ సరైన హెయిర్ గ్రోత్ కు సహాయపడుతుంది మరియు జుట్టు యొక్క నాణ్యతను పెంచతుంది. ఇందులోని ఎంజైమ్స్ జుట్టు నష్టాన్ని నివారిస్తుంది . హీమోగ్లోబిన్ మరియు ఫోలీసెల్స్ ను పెంచుతుంది. బీట్ రూట్ లో లికోపిన్ పుష్కలంగా ఉంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. బీట్ రూట్ తో పాటు ముల్లంగి వంటి దుంపలు కూరలు కూడా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి.

జుట్టుకు రెండవ ఉత్తమ వెజిటేబుల్ క్యారెట్స్ . క్యారెట్స్ లో విటమిన్ బి7 లేదా బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు ఒక హెల్తీ టానిక్ గా పనిచేస్తుంది. బయోటిని జుట్టు తిరిగి పెరగడానికి బాగా సహాయపడుతుంది. అదే సమయంలో ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. టమోటోలో యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మరియు టమోటో ఒక ఎఫెక్టివ్ సెల్ రిపేరింగ్ ఏజెంట్. ఇవి తలలో మలినాలను మరియు టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది.

ఫ్రెంచ్ బీన్స్ లో విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఇ జుట్టును ప్రకాశవంతంగా మార్చడానికి, జుట్టు నాణ్యత పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే జుట్టు తెల్లబడుటను నివారిస్తుంది. ఆకుకూరలు, కరివేపాకు వంటి వాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీంతో పాటు అత్యవసర పోషకాలైన బీటా కెరోటిన్స్, ఫ్లొల్లెట్ మరియు విటమిన్ సి అధికంగా ఉండి కురుల ఫోలీసెల్స్ ను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతాయి. నిగనిగలాడే ఒత్తయిన జుట్టు పెరగాలంటే.. తలకు ఎన్ని నూనెలు రాసుకున్నా లాభం స్వల్పం. కాబట్టి జుట్టు పెరుగుదలకు పుష్టికరమైన ఆహారం తినాలి.

Leave a Comment