Milk Products: అధిక కొవ్వు ఉన్న డెయిరీ ఉత్పత్తులు మంచివేనా?

By manavaradhi.com

Published on:

Follow Us
Dairy products

పాలు, పాల పదార్థాల్లో మ‌న శ‌రీర ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అనేకం లభిస్తాయి. పాక్షికంగా వెన్నతీసిన పాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కావాల్సిన పోషకాలు అందించడమే కాకుండా శరీరంలో కొవ్వు పెరగకుండా దోహదపడతాయి. సమతులాహారంలో పాలు, పాల పదార్థాలను వినియోగించటం చాలా అవసరం. 200 మిల్లీలీటర్ల పాలు, 150 గ్రాముల పెరుగు లేదా 300 గ్రాముల చీజ్‌ రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కావాల్సిన క్యాల్షియం లభిస్తుంది.

ప్ర‌స్తుతం మార్కెట్లో ప్రొబయోటిక్‌ డెయిరీ ఉత్పత్తులు దొరుకుతున్నాయి. శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియీ వీటిలో ఉంటాయి. జీర్ణవ్యవస్థలో సమతుల‌మైన బ్యాక్టీరియా సంఖ్యను పెంపొందిచటానికి దోహదపడుతాయి. అజీర్తిని నివారిస్తాయి. హృద్రోగాలను అదుపు చేయడంలో తోడ్పడ తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుతాయి. హానికారక బ్యాక్టీరియాను నివారిస్తాయి.

పాలు, పెరుగు, పనీర్‌, చీజ్‌ లో ల‌భించే క్యాల్షియం దంతాలు, ఎముకల పటిష్టతను మెరుగుపరుస్తాయి. వీటిలొరి ఫాస్పరస్‌ శారీరక శక్తిని అందిస్తుంది. మెగ్నీషియం కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రోటీన్స్‌ శరీర పెరుగుదల, మరమ్మతులకు దోహదపడతాయి. ఫ్యాట్‌, కార్బొహైడ్రేట్లు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. విటమిన్‌ బీ12 ఆరోగ్యకరమైన కణ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. వీటిలొ ఉండే జింక్‌ రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రెబోప్లేవిన్‌ కాంతివంత, ఆరోగ్యవంత చర్మానికి దోహదపడుతుంది. ఫోలెట్‌ ఆరోగ్యకర, శక్తిమంత కణ ఉత్పత్తికి దోహదపడుతుంది.

నిత్యం పాలు, పాల ఉత్ప‌త్తులు, లేదా చీజ్ తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని ఇటీవ‌లి ఓ ప‌రిశోధ‌న‌లో తేలింది. అయితే నిత్యం మూడు లేదా అంత‌క‌న్నా ఎక్కువ‌సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని కూడా పేర్కొంది.

పాలు, పాల ఉత్ప‌త్తులు ఆరోగ్యానికి మంచివేన‌ని కొన్ని పరిశోధనలు తెలిపాయి. పాల ఉత్ప‌త్తులో ల‌భించే కొవ్వు నిజానికి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిద‌ని చెబుతున్నారు. స‌హ‌జ‌సిద్ధంగా వ‌చ్చే పాలు, పాల ప‌దార్థాలు మంచివేన‌ని.. వాటి నుంచి ఉత్ప‌త్తి చేసే ప‌దార్థాలే ఆరోగ్య స‌మ‌స్య‌లు తెచ్చిపెడ‌తాయ‌ని అంటున్నారు. డెయిరీ ఉత్ప‌త్తుల్లో సోడియం ఉన్నాస‌రే వాటిలో పొటాషియం, కాల్షియం ఉన్నందున గుండెతో పాటు ఇత‌ర అవ‌య‌వాల‌కు మంచి చేస్తాయంటున్నారు. ప్ర‌త్యేకించి చిన్నారుల్లో ఎముక‌ల ఎదుగుద‌ల‌కు పాలు చాలా మంచివ‌ని చెబుతున్నారు.

నేటి తరం ఎక్కువగా బాధపడే ఆరోగ్య సమస్యల్లో గుండె సమస్య ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. నిత్యం తీసుకునే ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులే దీనికి కారణం. అయితే నిత్యం పాలు, పాల ఉత్ప‌త్తుల‌ను త‌గిన‌ మోతాదులో తీసుకోవ‌డం ద్వారా శ‌రీరానికి కావాల్సిన పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయి. సో నిత్యం పాలు తాగండి ఆరోగ్యంగా ఉండండి.

Leave a Comment