Spinach Benefits: పాలకూర తింటే కలిగే అద్భత ప్రయోజనాలు ఇవే..!

By manavaradhi.com

Published on:

Follow Us
Health benefits and nutritional value of spinach

ఆకుకూరల్లో చాలామందికి నచ్చే వంటకాల్లో ముందు వరుసలో ఉండేది పాలకూర. ఇందులో అనేక పోషకాలు దాగున్నాయి. ఇందులో అనేక యాంటి ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడానికి కూడా ఇది ఎంతగానో సహకరిస్తుంది. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

మనిషి శరీరానికి ప్రయోజనాలు కలిగించే ఆకుకూరల్లో పాల కూర ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఆకుకూరల్లోనే పాలకూర ఎంతో మేలైనదీ. పాల కూర తినటం వల్ల అనేక రోగాలు మనదరి చేరకుండా చూసుకోవచ్చు. పాల కూరలో యాంటీ ఆక్సీ డెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి.పాలకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణసమస్యలు దూరంఅవుతాయి. శరీరానికి అవసరమైన విటమిన్ కె లభిస్తుంది. మలబద్ధకం నుండి విముక్తి పొందవచ్చు.

పాలకూరలో ఉండే విటమిన్ ఎ మన కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలు, ఇతర కంటి సమస్యలను రాకుండా చూస్తుంది. నిత్యం పాలకూర ఆహారంలో భాగం చేసుకుంటే నేత్ర సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అంతేకాక వీటిలో ఉన్న విటమిన్-A కళ్ళ మంటలను కూడా నిరోధిస్తుంది. పాలకూరను, మెదడుకు అవసరమైన చక్కని ఆహారం. ఇది ఫోలిక్ ఆమ్లం, విటమిన్ A,C వంటి ఖనిజాలతో పాటు, అనేక ఇతర యాంటీ-ఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది మీ జ్ఞానశక్తిని మెరుగుపరుస్తుంది.

పాలకూరను ఆకుకూరల్లో రాజుగా అభివర్ణిస్తారు. ఇందులో విటమిన్‌ Aలు మరియు మెగ్నీషియం, ఫోలిక్‌ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారిస్తాయి. పాలకూరను తరచూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను అదుపు చేసుకోవచ్చు. పాలకూరను ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ పాలకూరను తినడం వల్ల, మీ రోజువారీ పోషక అవసరాలను తీర్చటానికి సహాయపడుతుంది.

పాలకూర ఆకులలో ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ ఎ, క్యాల్షియం, ఐరన్ మొదలైన వాటితో పూర్తిగా నిండి ఉంటాయి. మధుమేహం, మూత్రపిండాలలో రాళ్ళు, క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షించటానికి ఇది సహాయపడుతుంది. ఇందులో రోగ నిరోధక సమ్మేళనాలను, యాంటీఆక్సిడెంట్లను ఎక్కువగా కలిగి ఉంటుంది. కాబట్టి ఇది శరీరంలో వచ్చే వాపులను నివారించి, దానిని చికిత్స చేయడంలో సహాయపడుతుంది. పాలకూరలో విటమిన్ K పుష్కలంగా లభించడం వల్ల ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇది బోలు ఎముకల వ్యాధికి చికిత్స చేసి, దానిని నిరోధించగలదు. కాబట్టి, ప్రతిరోజు పాలకూరను తినడం వల్ల బోలు ఎముకల వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడుతుంది.

శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూర రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మ సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరను కందిపప్పుు కలిపి పప్పు చేసుకోవచ్చు. చపాతీలు చేసుకునే పిండిలోనూ, పకోడీల పిండిలోనూ, పన్నీర్‌తో కలిపి వండే కూరల్లోనూ వాడుకోవచ్చు.పాలకూరలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వలన మీ కడుపు పూర్తిగా నిండిన అనుభూతిని ఎక్కువ కాలం పాటు ఉంచుతుంది. పాలకూరలో ఉండే విటమిన్ కె రక్తాన్ని త్వరగా గడ్డ కట్టేందుకు దోహదపడుతుంది. మన శరీరంలో తగినంత విటమిన్ కె లేకపోతే గాయాలు అయినప్పుడు పెద్ద ఎత్తున రక్తస్రావం అవుతుంది. దాన్ని ఆపాలంటే మన శరీరంలో విటమిన్ కె ఉండాలి.పాలకూర వంటి ఆకుకూరలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. త్వరగా బరువు తగ్గాలని కోరుకునే వారికి ఇది చాలా మంచిది.ఇది అధిక ఫైబర్ కలిగి ఉంది.

పాలకూరలో ఉండే మెగ్నీషియం రక్తపీడనం నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే ఫోలేట్ హృద్రోగ సమస్యలు రాకుండా నివారిస్తుంది. శరీరంలో చెడు కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇతర ఆకుకూరల్లాగా పాలకూరను కూరలాగా, వేపుడు చేసుకుని కూడా తినవచ్చు. ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలలో పాలకూరను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చిన్నారుల నుంచి మొదలుకొని పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన ఈ పాలకూరను మీరూ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి. మీ ఆరోగ్యానికి బంగారు బాటలు వేసుకోండి.

Leave a Comment