స్ట్రాబెర్రీ అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాదు ఇందులో పోషకాలు కూడా మెండుగానే ఉన్నాయి. రూబీ రంగులో ఉండే స్ట్రాబెర్రీ ఎంతో రుచికరంగా ఉంటుంది. కొందరు దీంతో వంట చేసుకుంటారు. రోజుకు ఎనిమిది స్ట్రాబెర్రీలు తింటే పోషకాలు పుష్కలంగా అందినట్టేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీని క్రమం తప్పకుండా తింటే మెదడు చురుకుగా పనిచేస్తుంది.
స్ట్రా బెర్రీ ఫ్రూట్ నోరూరిస్తూ మంచి ఫ్లేవర్ తో ఉండటమే కాదు, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ జ్యూసీ ఫ్రూట్ లో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. గర్భిణీలు కూడా వీటిని తినడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారని పరిశోధనల ద్వారా నిరూపింపబడినది. ఇవి ఇతర అనారోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది. స్ట్రాబెర్రీలో ఫోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. స్ట్రాబెర్రీలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల తల్లికి మాత్రమే కాదు, బిడ్డ కళ్ళ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి కళ్ళలో కార్నియా, రెటీనాను స్ట్రాంగ్ గా మార్చుతుంది. స్ట్రాబెర్రీ క్యాన్సర్ ను జయించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది. దీన్ని సలాడ్ మాదిరిగా కూడా తినొచ్చు.
స్ట్రాబెర్రీ శరీరంలోని చెడు కొవ్వు పదార్థాలను, మంచి కొవ్వు పదార్థాల మాదిరిగా బదిలీ చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే మోనోసాచురేటేడ్ ఫ్యాట్ లు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. జీర్ణాశయ సంబంధిత సమస్యలు పెరగకుండా చేసి స్థిరంగా ఉండేలా చూస్తాయి. ఇవి రక్తంలోని చక్కర స్థాయిలను, క్యాల్షియం, పాస్పరస్, ఐరన్, నియాసిన్ లను కలిగి ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. స్ట్రాబెర్రీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి ఆర్థరైటిస్ వాటి వలన కలిగే సమస్యలను తగ్గించుటలో సహాయపడతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ వలన కలిగే తీవ్రమైన చికాకు, చెంచల స్వభావం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
స్ట్రాబెర్రీలోఉండే యాంటీ ఆక్సిడెంట్ లు, మీ చర్మాన్ని బిగుతుగా యవ్వనంగా ఉంచుతాయి. స్ట్రాబెర్రీని దంచి, తేనె కలిపి, సహజయాంటీ ఏజింగ్ మాస్క్ ను తయారు చేయవచ్చు. అంతేకాకుండా, దీని వాడకం ద్వారా మొటిమల నుండి ఉపశమనం కూడా పొందవచ్చు. హెల్తీ స్ట్రాబెర్రీ స్మూతీ, మిల్క్ షేక్స్ రూపంలో తీసుకోవడం వల్ల సెరెల్స్ తో కలిపి బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందుతారు.
స్ట్రాబెర్రీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి ఆర్థరైటిస్ వాటి వలన కలిగే సమస్యలను తగ్గించుటలో సహాయపడతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ వలన కలిగే తీవ్రమైన చికాకు, చెంచల స్వభావం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే అన్ని కాలాల్లో కొద్ది కొద్ది మోతాదులో స్ట్రాబెర్రీ తినడం డయాబెటీస్ రోగులకు మంచిదంటున్నారు వైద్యులు.








