Tea and Health :టీ తాగడం ఆరోగ్యానికి మంచిదా.. కాదా ?

By manavaradhi.com

Published on:

Follow Us

సాధారణంగా ఇంటికి అతిథులు వస్తే.. ముందుగా టీతోనే వారిని స్వాగతిస్తాం. అలాగే మనకు బోర్‌ కొట్టినప్పుడు కూడా ఓ కప్పు టీ త్రాగేస్తాం. బద్ధకంగా ఉన్నప్పుడైనా… కాస్త తలనొప్పిగా ఉన్నప్పుడైనా ముందుగా మనకు గుర్తుకువచ్చేది టీనే. టీ మనశరీరానికి సహజమైన ఉత్సహాన్నిచ్చే అద్బుతమైన పానీయం.

మనదేశంలో దాదాపు సగం మందికి పైగా ప్రతినిత్యం టీ సేవిస్తున్నారు. సహజంగా టీ నరాల ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. మనం తాగిన వెంటనే మనకి ఓ శక్తివంతమైన భావనను కలిగిస్తుంది. అయితే అధికంగా టీ తాగడం వల్ల అనేక దుష్పరిణామాలు ఉంటాయని, హెర్బల్ టీ, గ్రీన్ టీ తగినంత మోతాదులో తీసుకోవడం ద్వారా అనారోగ్యాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. పలు పరిశోధనలు సైతం ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. హెర్బల్ టీ, గ్రీన్ టీలలో అధికంగా ఉండే పలురకాల ఔషధ గుణాలు, మన శరీరాన్ని ఉత్తేజపరచి, మనల్ని మరింత ఉత్సాహంగా ఉంచేందుకు సాయం చేస్తాయి.

  • టీ పొడిని తేయాకు చెట్ల నుంచి తయారు చేస్తారు. టీ సహజమైన పానీయం. దీనిలో రసాయనిక పదార్ధాలుగానీ, కృత్రిమ సువాసనల ద్రవ్యాలుగానీ, ఇతర రంగులుగానీ చేరి ఉండవు. ఇది ఆరోగ్యదాయకమైన, శక్తిదాయకమైన పానీయం. దీనిలో బీ గ్రూప్ విటమిన్లు, రిబోఫ్లేవిన్ , నియాసిన్ లు ఎక్కువగా ఉంటాయి. అతి తక్కువగా లభించే కెఫీన్ మానవ శరీరానికి ఆరోగ్యకరమైనది. అయితే అపాయకారి మాత్రం కాదు.
  • టీలో రకరకాల నాణ్యతలున్నాయి. గ్రీన్‌టీ, బ్లాక్‌టీలలో ఫ్లవనాయిడ్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు ఉంటాయి. టీ పదే పదే తాగాలనిపించే సున్నిత వ్యసనాన్ని కలిగించే కెఫిన్ ఈర‌కం తేనీళ్లలో తక్కువగా ఉంటుంది.
  • క్యాన్సర్‌ నిరోధానికి, ఊబకాయాన్ని నివారించడానికి గ్రీన్‌టీ, బ్లాక్‌టీలు మంచివని వైద్యులు సూచిస్తారు. టీ సేవ‌నం క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. టీ లో పాలిఫినాల్స్ ఉన్నందున స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది, సర్వైకల్ కాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా దూరమవుతుంది. జీర్ణనాళంలోని ప‌లు భాగాలకు వచ్చే క్యాన్స‌ర్లకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. మీరు విసిగి మరియు అలిసిపోయినప్పుడు ఒక కప్పు మూలికా టీని తాగవచ్చు. వీటిలో ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
  • కొన్ని మూలికలలో మన శరీరానికి మంచిచేసే అనేక ఔషదగుణాలు ఉంటాయి. టీ వల్ల మరెన్నో ప్రయోజనాలున్నాయి. డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. గ్లూకోజ్ ను విడుదల చేయడం వలన శక్తిని ఇస్తుంది. రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. చెడు కొలెస్త్రాల్ పరిమితిని తగ్గిస్తుంది.
  • సాధారణంగా టీ, కాఫీలు అనారోగ్యమని చెబుతుంటారు. కానీ హెర్బల్ టీ, గ్రీన్ టీలు మాత్రం మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మూసుకుపోయిన రక్తనాళాలను వ్యాకోచం చెందేలా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • అలసటగా ఉన్నప్పుడు మనలో చాలామంది టీ తాగాలనుకుంటాం. అయితే సాధారణ టీకి బదులుగా హెర్బల్ టీ తాగితే రిలాక్సేషన్ తో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. హెర్బల్ టీ, గ్రీన్ టీలలో రకరకాల వనమూలికలు ఉంటాయి. ఇది రుచికరమే కాక అనేక రకాల ఔషదాలు ఇందులో మెండుగా ఉంటాయి.
  • అల్లం టీ వికారం తగ్గించడంలో మరియు ఆకలి పెంచడంలో ఉపయోగపడుతుంది. అలాగే మార్నింగ్ సిక్ నెస్ తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలకు అల్లం టీ పవర్ ఫుల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.
  • పుదినా టీ, హెర్బల్ టీలలో పుదినా టీ చాలా రుచిగా ఉంటుంది. హెర్బల్ టీ నొప్పి, వాపు, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జలుబు, శ్వాసనాళాల వాపు వంటి సమసస్యలకు మెడిసిన్ లా పనిచేస్తుంది.
  • తేనెతో చేసిన హెర్బల్ టీ గొంతే ఇన్ఫెక్షన్లకు మంచి పరిష్కారాన్ని ఇస్తుంది. అలాగే ఇందు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇలా నిత్యం మనం టీ లను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవచ్చు.
  • కొన్ని యూనివర్సిటీల పరిశోధనల ప్రకారం టీ తాగడం వల్ల శరీరానికి మంచి బెనిఫిట్స్‌ ఉన్నాయని తేల్చారు. టీ తాగడం వల్ల బరువు తగ్గించడంలో బాగా సహాయపడు తుందని తేల్చరు. అందుకు గ్రీన్‌ టీ బాగా పనిచేస్తుంది. అంతే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారు.

Leave a Comment