పైనాపిల్, అనాస… పేరేదైనా ఈ పండు మనకు విరివిగా లభ్యమవుతోంది. అనాస పండులో అనేక రకాలైన పోషక విలువలుదాగున్నాయి. ఆరోగ్య రక్షణకి అవసరమైన విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండు అనాస పండు. పైనాపిల్‌ను తరచూ తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..
మనకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలు ఎన్నో ఉన్నాయి. అందులో పైనాపిల్ ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. వీటిలో లభించే పోషకాల ద్వార ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. పొటాషియం, సోడియం నిల్వలు పైనాపిల్‌లో అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా చూస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడంతో కంటి సమస్యలు దూరమవుతాయి.
ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పైనాపిల్‌లోని ఔషధ గుణాలు పోరాడతాయి. జీర్ణక్రియను మెరుగు పరచడంతోపాటు చర్మానికి కాంతినిచ్చే ఎంజైమ్‌లు ఇందులో ఉన్నాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డం కట్టకుండా చూస్తుంది. పళ్లు, చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మూత్రపిండాలకు చెందిన వ్యాధులతో బాధపడే వారికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది.
పైనాపిల్ వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏంటి ?
బరువు తగ్గాలనుకునే వారు అనాసను తీసుకుంటే మంచిది. కొన్ని ముక్కలు తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీనిలోని పోషకాలు శరీరంలో హాని చేసే కొవ్వుతో పోరాడతాయి. అలానే తరచూ అనాసను తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు సులువుగా బయటకు పోతాయి. ఈ ఫలంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లూ దూరమవుతాయి. కొందరికి శరీరంలో నీరు చేరుతుంటుంది. అలాంటి వాళ్లు తప్పనిసరిగా అనాసను తింటే ఎంతో మంచిది. అనాసలో పీచు పదార్థం లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి దాని పనితీరును మెరుగు పరుస్తుంది. జీర్ణాశయంలోని వ్యర్థాలను తొలగించడంలోనూ దీనిలోని పోషకాలు కీలకంగా పనిచేస్తాయి. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ రాత్రిపూట నాలుగు అనాస ముక్కలు తింటే ఆ సమస్య దూరమవుతుంది. రక్తలేమి ఉన్నవారికి అనాస మంచి ఆహారం. దీనిలోని పోషకాలు ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడతాయి. రక్తప్రసరణ కూడా సక్రమంగా ఉంటుంది. అన్ని అవయవాలకూ ప్రాణవాయువు సరిగ్గా సరఫరా అవుతుంది. జీవనశైలిలో మార్పులూ, ఆహారపుటలవాట్ల వల్ల కొందరికి జీవక్రియ రేటులో అసమానతలు ఏర్పడతాయి. అలాంటి వారు అనాసను తినడం వల్ల జీవక్రియ రేటు వృద్ధి అవుతుంది. అనారోగ్య సమస్యలూ తొలగిపోతాయి.
పైనాపిల్ లో మంటా నొప్పులను తగ్గించే గుణాలుంటాయి. మోకాళ్లూ, కండరాల సమస్యలున్నవారు ఇవి తినడం చాలా మంచిది. చాలామంది పైనాపిల్‌ను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ అరటిపండ్లలానే దీనికి ఫ్రిజ్ పడదు. బయట ఉంచడమే మంచిది. తొక్కుతీసిన పైనాపిల్‌ను వెంటనే గాలి చొరని డబ్బా లేదా ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే నాలుగైదురోజుల పాటు నిల్వ ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి.ఇందులోని ఎంజైమ్ రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ కారణంగా దెబ్బతిన్న కణజాలాన్ని త్వరతిగతిన బాగుచేస్తుంది. మధుమేహం కారణంగా ఏర్పడే పుండ్లనీ ఇతరత్రా గాయాల్నీ కూడా త్వరగా తగ్గిస్తుంది.
అనాసలో సమృద్ధిగా పొటాషియం ఉండడం వల్ల కొన్ని మూత్రపిండాల వ్యాధులలో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితాలను ఇస్తుంది.ఇది కడుపులోని పురుగుల్నీ చంపేస్తుంది. ఇందులోని రసాయనాలు మూత్రపిండాల్ని ప్రేరేపించి శరీరంలో మలినాలు తొలగిపోయేలా చేస్తాయి.గొంతునొప్పి, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల్నీ పైనాపిల్ తగ్గిస్తుంది. పైనాపిల్‌లోని సి-విటమిన్ బ్యాక్టీరియాతో పోరాడి చిగుళ్ల సమస్యను నివారిస్తుంది. ఇందులోని కొన్ని కణాలకి కేన్సర్‌లతోనూ పోరాడగల శక్తి ఉంది.