సాధారణంగా పిండి పదార్థాలే మనకు కావలసిన ‘ఫ్యూయల్’ను ఇస్తాయి. శరీరం సాధారణ రీతిలో పనిచెయ్యడానికి పిండిపదార్థాలు చాలా అవసరం. పౌష్టికాహారం తీసుకోవడంపై ఇప్పుడు అందరూ శ్రద్ధ వహిస్తున్నారు. కానీ ఏం తినాలో, ఎలా తినాలో, ఎంత తినాలో తెలియక గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆయు:ప్రమాణం కోసం తగినంత మోతాదులో పిండిపదార్థాలను ఆహారంగా తీసుకోవడం అవసరం. అసలు మనశరీరానికి పిండి పదార్థాలు ఎంతవరకు అవసరం అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మన శరీరానికి పిండిపదార్థాలు అంతగా మంచివి కావని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇది సరైన అవగాహన కాదు. పిండి పదార్థాలూ మన శరీరానికి అవసరమైనవే. పిండిపదార్థాలు మన శరీరానికి కావల్సిన శక్తిని నిరంతరం అందిస్తుంటాయి. మన డైట్‌లో కార్బోహైడ్రేట్‌లు అత్యంత కీలకమైనవి. మనకు రోజూ లభించే కెలోరీల్లో సుమారు 50 శాతం కెలోరీలు కార్బొహైడ్రేట్‌లు వలన లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిజానికి కార్బోహైడ్రేట్‌లు విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి ఖనిజాలు, పీచు పదార్థం, పోషకాలు, విటమన్లు అందిస్తాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచి ఆకలిని తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్‌లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, సహజ పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది, కెలోరీలు తక్కువగా ఉంటాయి. కొన్ని ఆరోగ్యకర కార్బోహైడ్రేట్ అందించే ఆహారాలు ఆపిల్, అరటి పండు, కాయగూరలు, గోధుమ రంగు బియ్యం, విత్తనాలు, నట్స్, ఓట్స్, కాయధాన్యాలు, తృణధాన్యాలు, బీన్స్ .. వీటినే మనం సంక్లిష్ట పిండిపదార్థాలు అని కూడా పిలుస్తుంటాం.
కార్బోహైడ్రేట్ మన శరీరానికి ఎంతవరకు అవసరం …..?
బరువు నియంత్రణలో ఉండాలంటే రోజూ తగినన్ని కార్బోహైడ్రేట్లు చాలా అవసరం. బరువు పెరుగుతున్నామని కార్బోహైడ్రేట్లు తీసుకోకుండా ఉండటం సరియైునది కాదు. బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తినిస్తాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువ అయితే అవి కొవ్వు రూపంలోకి మారుతాయి. దాంతో బరువు పెరుగుతారు. అందుకే జీవక్రియలు అధికంగా ఉండే పగటిపూట రైస్ తీసుకోవాలి. రాత్రి సమయంలో అన్నానికి బదులు వేరే పదార్థాలు తినాలి. బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా రోజులో ఒకపూట అన్నాన్ని పరిమితంగానే తీసుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ పిండి పదార్థాలు గల ఆహార పదార్థాలతో కూడిన ఆహార ప్రణాళికలు ఎక్కువ శాతం వరకు శరీర బరువు తగ్గించుకోటానికి సహాయపడుతుంది. కానీ, పూర్తిగా కార్బోహైడ్రేట్లు లేని ఆహార పదార్థాల వలన వివిధ రకాల అనారోగ్యాలు కలుగుతాయి. మంచి సమతుల్య ఆహార పదార్థాలతో తక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోవటం క్షేమం అని నిపుణులు తెలుపుతున్నారు.
తక్కువ పిండిపదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఏంటి…?
మనం చాలా తక్కువ కార్బోహైడ్రేట్లు గల ఆహార పదార్థాలను తినటం వలన బలహీనంగా, మలబద్దకం, చిరాకు మరియు అలసటగా అనిపించవచ్చు. తక్కువ కార్బోహైడ్రేట్ ఆహార ప్రణాళికలను అనుసరించటం వలన శరీరంలో కీటోన్ స్థాయిలు అధికమౌతాయి. శరీరంలో కీటోన్ స్థాయిలు అధికం అవటం వలన జీవక్రియ ప్రభావానికి గురవుతుంది. ఫలితంగా, కండర కణాల ప్రమాదం, శరీరంలో మినరల్ ల నష్టం జరుగుతుంది. ఫలితంగా మెదడు పనితీరు తగ్గిపోతుంది. అధిక కార్బోహైడ్రేట్లు కలిగిన అరటిపండు మరియు బంగాళదుంప వంటి ఆహారాలతో కూడిన ప్రణాళికలు ఆరోగ్యానికి క్షేమం కాదనే చెప్పాలి. వీటికి బదులుగా, పాలు, కూరగాయలు మరియు పండ్లు సమతుల్యమైన పోషకాలను కలిగి ఉండి, శరీర బరువును తగ్గిస్తాయి. పండ్లు, హోల్ గైన్స్ మరియు కూరగాయలు తక్కువ తీసుకోవడం వలన శరీరంలో విటమిన్, మినరల్ మరియు ఫైబర్ ఏర్పడుతుంది. ఒకవేళ మీరు తక్కువ కార్బోహైడ్రేట్లు గల ఆహార ప్రణాళికలను పాటించే ముందు వైద్యుడిని కలిసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.