Samalu: ప్రతిరోజూ సామలతో చేసిన వంటకాలు తినడం అలవాటు చేసుకోండి

By manavaradhi.com

Published on:

Follow Us
Samalu

సిరిధాన్యాలు అంటే అవేవో వింత పదార్థాలు కావు. మన పూర్వీకులు మనకు అందించిన అద్భుత ఆహార ధాన్యాలు. ముఖ్యంగా అరికెలు, సామలు, వరిగెలు, కొర్రలు, రాగులను కలిపి ఐదు రకాలను సిరిధాన్యాలు అంటారు. ఇవి వేరే దేశంలో ఎక్కడా కనిపించవు. ఒక్క భారతదేశంలోనే కనిపిస్తాయి. సిరిధాన్యాల్లో ఒకటి అయిన సామలు మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. బియ్యాన్ని ఎలా అయితే వండుకుంటామో.. దీనిని కూడా అలాగే వండుకోవాలి. వీటిని తిన్నాక.. జీర్ణం అవడానికి కనీసం ఆరు గంటల సమయం పడుతుంది. కాబట్టి మధ్యమధ్యలో చిరుతిళ్ళు, కాఫీ, టీ వంటివి తీసుకోవడానికి కుదరదు. ఫలితంగా చెడు కొవ్వు తగ్గుతుంది.

ఇప్పుడిప్పుడే జనాల్లో వస్తున్న అవగాహన వల్ల వీటికి ఆదరణ లభిస్తోంది. వీటిలో పీచుపదార్థం చాలా అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం. వీటివల్ల గ్లూకోస్ చాలా తక్కువ మోతాదులో రక్తంలోకి నెమ్మదిగా చేరుతుంది. పీచు పదార్థం ఎక్కువ కాబట్టి ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఈ ధాన్యాల్లో ఇనుము, కాల్షియం, మాంసకృత్తులు, కావాల్సిన కొలెస్ట్రాల్, విటమిన్ బి, పొటాషియం, జింక్, మెగ్నీషియం.. మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఈధాన్యాలను అద్భుత ధాన్యాలు, అమృతతుల్యాలు అంటారు.

సామలు ఆహారంగా తీసుకుంటే రక్తంలోని గ్లూకోస్ శాతం తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఫలితంగా దంతాలు, ఎముకలు గట్టిపడుతాయి. ఇవి అధిక పీచుని కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంగా తీసుకున్నప్పుడు కిడ్నీలో, పిత్తాశయంలో రాళ్లు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి.

సామల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొవ్వు తగ్గుతుంది. అసిడిటీ ఉన్నవారికి ఇవి చాలా మేలు చేస్తాయి. గ్యాస్ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఊబకాయం, కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులు తప్పనిసరిగా సామలను తీసుకోవాలి. వీటిని తీసుకునేటప్పుడు బాగా నమిలి తినాలి. ఫలితంగా రెండు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినాలి అనిపించదు. కడుపు నిండినట్లుగా ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు. అతిగా తినే దురలవాటు తగ్గుతుంది.

సామలను తరచూ తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తప్రసరణ కూడా సజావుగా జరుగుతుంది. దీనివల్ల హార్మోనుల అసమతుల్యత తగ్గి రుతు సమస్య, సంతాన సమస్య వంటి చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. శరీరంలోని చెడు కొవ్వు కూడా బాగా తగ్గుతుంది. రక్తపోటు ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల అదుపులోకి వస్తుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. కాలేయం, పిత్తాశయం పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.

పైత్యం ఎక్కువ అవ్వడం వలన భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండడం, లేదంటే త్రేన్పులు రావడం, కడుపు ఉబ్బరం లాంటివి ఏమైనా ఉంటే ఇది తరిమికొడుతుంది. కనుక ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్లు దీనిని తీసుకోవడం వలన ఈ సమస్యలు దూరమవుతాయి. అజీర్తి, అతిసారం వంటి సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది.

సామలు తీసుకోవడం వల్ల ఆడవారి రుతు సమస్యలకు కూడా మంచిది సామలు లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కనుక దీనిని తీసుకోవడం వల్ల మలబద్ధకం అరికడుతుంది. మైగ్రేన్ సమస్యలు ఉన్న వాళ్లు కూడా దీనిని తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులకు, ఊబకాయం సమస్యలకు మంచి పరిష్కారం చూపిస్తుంది. అలానే గుండె సమస్యలకు కూడా ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఆడవారి లో పీసీఓడీ ఉంటే దానిని కూడా దీనితో తగ్గించుకోవచ్చు. సామలు తీసుకోవడం వల్ల మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది.

పిల్లలకు, పెద్దలకు సామలుతో కూడిన ఆహారాన్ని అందించడం వలన శరీర పెరుగుదల సరిగ్గా ఉంటుంది. వీటిని తినడం ద్వారా మన శరీరంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థతులనైన తట్టుకొని, ఉత్పత్తి సాధించే శక్తి ఈధాన్యాలకు ఉంది.

Leave a Comment