మనం ఆరోగ్యంగా ఉండాలంటే కాలేయం సక్రమంగా పనిచేయాలి. శరీరంలో పెద్ద గ్రంథి మాత్రమే కాదు, బరువైన అవయవం కూడా కాలేయమే. ముఖ్యంగా ఫ్యాటి లివర్ సమస్య ఉన్నవారు తీసుకోనే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తృణధాన్యాలల్లో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో బి కాంప్లెక్స్ అధికం. కాలేయ పనితీరు సామార్థాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది.
ఆలివ్ ఆయిల్ లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. లివర్ ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ వాడితే మంచిది. ఘాటయిన వాసన ఇచ్చే వెల్లుల్లి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కాలేయాన్ని శుభ్రం చేసే గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంది. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపివేయబడుతుంది. కాలేయానికి ముఖ్యంగా కాకరకాయ, ఆకుకూరలు, క్యాబేజి వంటి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ ను కాపాడుటలో బాగా పనిచేస్తుంది. కాలేయ పనితీరును మెరుగు పరచుతుంది.
పసుపులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల కాలేయానికి ఇది చాలా ఆరోగ్యకరం. దీన్ని ప్రతి రోజూ మనం ఉపయోగించే వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించాలి. వాల్ నట్స్ లో ఉండే ఆర్జినైన్ ఆమ్లం అమ్మోనియా కణాలను విచ్చిన్న చేసి, కాలేయాన్ని శుభ్రం ఉంచుతుంది. బ్రకోలిలో పోషక తత్వాలు విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. ఉడికించిన లేదా పచ్చి బ్రకోలిను తీసుకుంటే కాలేయాన్ని కాపాడుతుంది.
కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్ తోడ్పడుతుంది.ఈ ఆరోగ్యకరమైన దుంపలను ఆహారంలో తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.అవోకాడోలో మోనో శాచ్యురేటెడ్ కొవ్వుపదార్థాలున్నాయి. ఇది కాలేయాన్ని శుభ్ర పచడమే కాకుండా కణజాలాలు మరియు కణాల పునరుద్దించడానికి బాగా సహాయ పడుతుంది. డైట్ లో వీటిని తీసుకోవడం వల్ల కాలేయానికి మంచి ప్రయోజం చేకూర్చుతాయి.
ఫ్యాటి లివర్ ఉన్నవారు వేటికి దూరంగా ఉండాలి ?
- కొన్ని రకాల ఆహారాలు లివర్ చెడిపోవడానికి కారణమవుతున్నాయి. ఇప్పటివరకు మద్యపానం, ధూమపానం వల్ల లివర్ చెడిపోతుందని అందరూ చెబుతూ వచ్చారు. కానీ వాటితోపాటు పలు ఆహార పదార్థాల కారణంగా కూడా లివర్ చెడిపోయేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
- శీతల పానీయం సేవించే అలవాటు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వీటివల్ల కాలేయం త్వరగా చెడి పోతుంది. అలాగే, కూల్ డ్రింక్స్‌లో ఉండే పదార్థాలు కాలేయాన్ని పని చేయకుండా చేస్తాయి. చక్కెర లేదా తీపి పదార్థాలను అధికంగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది. చక్కెరను అతిగా తింటే అది శరీరానికి ఉపయోగం కాదు, అది మొత్తం లివర్‌లోనే పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది. దీనివల్ల లివర్ పనితీరు మందగిస్తుంది.
- ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరుగుతుంది. దాంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. చిప్స్ వంటి చిరుతిండ్లలో ఉండే విషపూరితమైన పదార్థాలు లివర్ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు చెపుతున్నారు.