కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు శరీరంలో రకరకాల మార్పులు ఎదురౌతూ ఉంటాయి. ఇలాంటి మార్పుల్లో అధికంగా చెమట పట్టడం కూడా ఒకటి. చాలా మందిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇది ఏదో ఒక అనారోగ్యానికి చిహ్నంగా గుర్తించాలి. చెమట అధికంగా పట్టడానికి కారణాలు ఏమిటి, దీనికి పరిష్కార మార్గాలేమిటి..?
సాధారణంగా మనలో చాలా మందికి కొన్ని నిర్దిష్టమైన పరిస్థితుల్లో చెమట పోస్తుంటుంది. శారీరక శ్రమ, వ్యాయామం ఎక్కువగా చేసినా లేదంటే.. ఎండలో ఉన్నా చెమట పోయడం సర్వ సాధారణం. అయితే ఇదే కాకుండా పలు అనారోగ్య సమస్యలు ఉన్నా చెమట పోస్తుంది. పలు రకాల అనారోగ్య సమస్యల వల్ల లేదంటే శరీర జీవక్రియల వల్ల కూడా చాలా మందికి చెమట పోస్తుంది. మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి జీవక్రియలను నియంత్రిస్తుంది. దీని వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అయితే కొన్ని సార్లు థైరాయిడ్ మరీ బాగా పనిచేస్తుంది. అలాగే థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో, దాని కోసం మెడిసిన్ వేసుకునే వారిలోనూ థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుంది. దీని వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసి శరీరాన్ని చల్లగా మార్చేందుకు మనకు చెమట పోస్తుంది. అలాగే అతిగా చెమటలు రావడం వెనుక ఉన్న మరో కారణం.. నరాల వ్యవస్థ దెబ్బ తినడం. ఇందు వల్ల కూడా కొందరిలో చెమటలు విపరీతంగా వస్తుంటాయి. చెమటలు పట్టడానికి ముఖ్యమైన కారణం లింపోమా..చెమట ఎక్కువగా పడుతుంటే లింపోమా సంకేతం కావచ్చు. క్యాన్సర్ కణుతులు లిప్స్ సెల్స్ లో డెవలప్ కావచ్చు. చాలా మంది లింపోమా పేషంట్స్ లో చెమటలు అధికంగా పడుతున్నట్లు గుర్తించారు.
చెమట ఎక్కువగా పట్టడానికి గల కారణాలు ఏంటి ?
అందరిలో ఒక విధంగా చెమటలు పట్టవు. అయితే ఎలాంటి శ్రమ లేకండా చెమటలు పడితే అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. శరీరంలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. ఉదాహరణకు లంగ్ ఇన్ఫెక్షన్ లేదా మలేరియా వంటి ఇన్ఫెక్షన్స్ తో శరీరం పోరాడే సమయంలో శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెమటలు తరచూ పడుతుంటే అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నట్లు గుర్తించాలి. మోనోపాజ్ మహిళల్లో ఈ దశలో వేడి వల్ల చెమటలు అధికంగా పడుతాయి. 70 శాతం కంటె ఎక్కువగా మోనోపాజ్ మహిళల్లో చెమటలు అధికంగా పడుతాయి. మధుమేహం సమస్య దీర్ఘకాలికంగా ఉంటే అలాంటి వారిలో డయాబెటిక్ న్యూరోపతి, వెన్నెముక దెబ్బ తినడం, నరాల మీద దుష్ప్రభావం పడడం వంటి సమస్యలు వస్తాయి. దీంతో వారికి విపరీతంగా చెమట పోస్తుంటుంది. అలాగే శరీరంలో ఇన్ఫెక్షన్లు బాగా ఏర్పడినా చెమట పోస్తుంది. దీంతోపాటు ఇలాంటి వారికి జ్వరం కూడా ఉంటుంది. ఇక కొందరు మధుమేహం కంట్రోల్ అవడం కోసం మెడిసిన్ వాడుతారు. అలాంటి వారిలో ఇన్సులిన్ మోతాదు పెరిగితే అప్పుడు షుగర్ బాగా తగ్గి చెమటలు పోస్తాయి. కనుక ఎవరికైనా విపరీతంగా చెమటలు పోస్తుంటే ఓసారి చెక్ చేయించుకోవాలి.
చెమట ఎక్కువగా పడుతుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
మనం చేసే వ్యాయామాలు కూడా చెమటలు పట్టడానికి కారణాలు కావచ్చు. నార్మల్ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నప్పుడు వర్కౌట్స్ ఎక్కువగా చేయడం వల్ల చెమటలు పడుతాయి. ఇది ఓవర్ ట్రైనింగ్ కు సంకేతంగా చెప్పవచ్చు. హార్మోన్ డిజార్డర్ కారణంగా కూడా చెమటలు అధికంగా పడుతాయి. ట్యూమర్స్ కు కారణమయ్యే హార్మోన్స్ అధికంగా ఉత్పత్తి చేస్తాయి . ఈ హాట్ ఫ్లాషెస్ వల్ల ఈస్ట్రోజెన్ లెవల్స్ పెరుగుతాయి. అలాగే మహిళల్లో హైపోథాలమస్ ఎఫెక్ట్ కూడా అధికంగా ఉంటుంది. హైపోథాలమస్ బ్రెయిన్ కు సంబంధించినది. ఇది ఆకలి, నిద్ర, శరీర ఉష్ణోగ్రతలు హార్మోన్స్ ను ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో నార్మల్ ఈస్ట్రోజెన్ లెవల్స్ నేచురల్ గా తగ్గిస్తుంది. కాబట్టి చెమటలు పడుతుంటే అశ్రద్థ చేయకుండా వెంటే డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకుని మందులు వాడాలి. అంతేకానీ అతిగా చెమటలు పోస్తుంటే అలా ఊరికే వదిలేయకూడదు. లేదంటే అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది.
ఎక్కువగా చెమటలు పట్టడానికి గల కారణాలు ఏమిటో. అలాగే దానికి పరిష్కార మార్గాలు ఏమిటో. ఈ విధంగా మీరుకూడా అధిక స్వెట్ తో భాదపడుతుంటే ఏమాత్రం అశ్రద్ధ చెయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. చెమటలు పట్టడమే కదా… అని ఏమాత్రం అశ్రద్ధ చెయకండి.