Abortions : గర్భస్రావం జరగడానికి కారణలెంటి?

By manavaradhi.com

Published on:

Follow Us
abortion reasons

కొత్తగా పెళ్ళైన ప్రతి స్త్రీ తల్లి కావాలని ఆరాటపడుతుంది. అమ్మగా పిల్లలకు తను ఒడిలో లాలించాలని ఎన్నో కలలు కంటుంది. అయితే ఈమధ్య కాలంలో స్త్రీలలో గర్భం దాల్చిన తొలి నెలలలోనే అబార్షన్స్ అయిపోవడం చూస్తున్నాం. దీనికి పాలిసిస్టిక్ ఓవరీస్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ఇమ్మ్యునోలాజికల్ ప్రాబ్లమ్స్, డయాబెటిస్ , గర్భసంచి జారడం లాంటి కారణాల వల్ల అబార్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి.

ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. తల్లిగా పిల్లలను తన ఒడిలో లాలించాలని కలలు కంటుంది. కానీ ఈమధ్య కాలంలో చాలామంది స్త్రీలలో గర్భం దాల్చిన తొలి నెలలలోనే అబార్షన్స్ జరిగిపోవడం మనం చూస్తున్నాం. దీనికి అనేక కారణాలున్నాయి. అండం ఫలదీకరణం చెందిన తరువాత జరాయువు కూడా పూర్తిగా ఏర్పడక ముందే కొందరిలో పిండము బయటకు వచ్చేస్తుంది. నెలలు నిండక ముందే గర్భకోశం సంకోచం చెందడమే దీనికి కారణం. గర్భస్రావం 28 వారాల ముందు ఎప్పుడైనా జరగవచ్చు. సాధారణంగా 12 వారాలలోపు ఎక్కువగా జరుగుతుంది. గర్భస్రావం తరచుగా ఒకే సమయంలో జరుగుతున్నట్లయితే దానిని హాబిచ్యువల్ ఆబార్షన్ అంటారు.

గర్భస్రావం జరిగినపుడు సాధారణంగా కనిపించే లక్షణం నొప్పి, రక్తస్రావం. అండం గర్భాశయం నుంచి విడిపోయినపుడు రక్తస్రావం జరుగుతుంది. ఈ రక్తమే గర్భాశయానికి ఫారెన్‌బాడీగా పనిచేస్తుంది. దాంతో గర్భాశయం సంకోచం చెందుతుంది. దీనివల్ల తీవ్రమైన నొప్పి వచ్చి అండం బయటకు పంపించబడి ఉదరం రక్తస్రావంతో నిండి ఉంటుంది. చర్మం రంగు ఎరుపుగా మారుతుంది. గర్భస్రావం జరగడానికి 50 శాతం మహిళలకు అవకాశం ఉండవచ్చు. పిండం తయారీలో లోపం అన్నింటికన్నా ముఖ్యం. ఈ లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగి గర్భస్రావమవుతుంది. జన్యుపరమైన కారణాలు కూడా గర్భస్రావానికి కారణమవుతాయి. కాబట్టి ఒకసారి గర్భస్రావం అయితే దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. పిండం 6వ నెలకు ముందు లేదా 500 గ్రాముల బరువులోపు ఉండి పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెబుతారు.

వరుసగా 2 నుంచి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలు చూద్దాం.

  • స్త్రీలు గర్భం దాల్చక ముందే వైద్యులను సంప్రదించాలి.
  • పెళ్లైన కొత్తలోనే గర్భసంచి స్కానింగ్స్ తీసుకోవాలి.
  • గర్భం దాల్చే ముందు ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ను వైద్యుల సలహా మేరకు వాడాలి.
  • తరచుగా అబార్షన్స్ అయ్యేవారు క్రోమోజోమ్స్ టెస్ట్ లను చేయించుకోవాలి.
  • గర్భిణి తొలి 3 నెలల్లో జాగ్రత్తలు పాటించాలి.
  • దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.

గర్బంలోని పిండం 3 నెలలు దాటితే అబార్షన్ చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు. కొంతమంది 4-5 నెలల మధ్యలో కూడా అబార్షన్ చేయించుకుంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో గర్భాశయ ఇన్‌ఫెక్షన్ తో పాటు మళ్లీ గర్బం వచ్చే అవకాశాన్ని కొల్పోయే అవకాశాలుంటాయంటున్నారు గైనకాలజిస్టులు.

చాలామంది మహిళలు ఒక్కసారి అబార్షన్ అయిందంటే రెండోసారి కూడా అబార్షన్ అవుతుందని నమ్ముతారు. కానీ ఇది అవాస్తవం. ఒకవేళ ఫస్ట్ ట్రైమిస్టర్ సమయంలో అబార్షన్ అయితే రెండోసారి ప్రెగ్నన్సీ కూడా అబార్షన్ అవుతుందనడానికి ఆధారాలు లేవు. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించాలి. బ్లీడింగ్ అయినంత మాత్రాన అబార్షన్ అని అపోహ పడరాదు. చాలామంది మహిళలు ఒకసారి అబార్షన్ అయిన తర్వాత కనీసం 3 నుంచి 6 నెలలు గ్యాప్ తీసుకుని తర్వాత కన్సీవ్ అవడానికి ప్రయత్నించాలని భావిస్తారు. కానీ అబార్ణన్ అయిన నెల తర్వాత కన్సీవ్ అవడానికి ప్రయత్నించడం వల్ల ఎలాంటి హాని జరగదు.

ప్రపంచవ్యాప్తంగా ఏటా మిలియన్ల కొద్ది స్త్రీలు అబార్షన్ లు చేయించుకుంటున్నారాని సర్వేలు చెబుతున్నాయి. స్త్రీలు గర్భస్రావానికి దారితీయకముందే దీనికి దారితీసే పరిస్థితుల పై అవగాహన పెంచుకుంటే ఇలాంటి గర్భస్రావాలు జరక్కుండా చూసుకోవచ్చు. అరక్షిత గర్భస్రావాలు కూడా కొన్నిసార్లు మరణానికి దారితీస్తున్నాయి. అంతేకాదు ఈ గర్భస్రావానికి ఉపయోగించే మందులు కొన్నిసార్లు గర్భం ముడుచుకొని, గర్భాన్ని బయటికి నెట్టివేసేలా చేస్తాయి. కాబట్టి ఈ విషయంలో రొగులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే వారి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.

Leave a Comment