Allergic rhinitis – అలర్జిక్ రైనైటిస్ ను ఎదుర్కొనే మార్గాలేమిటి?

By manavaradhi.com

Published on:

Follow Us
Allergic rhinitis

పుప్పొడి లాంటి వాసనలు, పెంపుడు జంతువుల వల్ల ఎదురయ్యే సమస్యే అలర్జి రినిటిస్. కలుషితమైన వాతావరణమే ఈ సమస్యలకు ప్రధాన కారణం. అయితే అందరిలో ఈ తరహా పరిస్థితి ఏర్పడదు. ఎలాంటి సందర్భాల్లో అలర్జి రినిటిస్ ఏర్పడుతుంది… ఈ సమస్య ఏర్పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలేవి.

అలెర్జీ… ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తున్న పదం. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించి ఈ సమస్యలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. దాదాపు 60 శాతం మంది ప్రజలు ఏదో ఒక అలర్జీతో బాధపడుతున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇందులో ముక్కుకు, ఊపిరితిత్తులకు సంబంధించిన అలర్జీలతో బాధపడుతున్న వారి సంఖ్య కాస్తంత ఎక్కువే. ఇలాంటి అలర్జీల్లో ఒకటి అలర్జి రినిటిస్. దీన్నే గవత జ్వరం అని కూడా పిలుస్తుంటారు. దీని వల్ల కంటిపొర మీద చిన్న ఇబ్బందులు, దురద పెట్టడం, ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది పాక్షికమైన అలర్జీ అయినప్పటికీ… భవిష్యత్ లో ఎదుర కాబోయే ఉబ్బసం లాంటి అనారోగ్యాలకు ఇది ప్రమాదఘంటిగా చెప్పుకోవచ్చు. గడ్డి జాతి మొక్కల పుప్పొడి, దుమ్ము పడకపోవడం వల్ల ఈ సమస్య ఎదురౌతూ ఉంటుంది.

దుమ్ము, పుప్పొడి వంటి అనేక అలెర్జీ కారకాలు గాలిలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో… కళ్ళు, ముక్కు, మరియు ఊపిరితిత్తులు వంటి గాలి తగిలే ప్రదేశాల్లో లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. అలర్జీ రినిటిస్ కూడా అలాంటిదే. దీని వల్ల ముక్కులో ఇబ్బంది, ముక్కు నుంచి నీరు కారడం, కళ్ళు ఎరుపెక్కడం లాంటి ఇబ్బందులు ఎదురౌతాయి. లోపలకు పీల్చుకున్న అలర్జీ కారకాలు గాలి మార్గాలు సంకోచానికి కారణమవ్వడం ద్వారా ఉబ్బసానికి కూడా ఇది దారియతీయవచ్చు. ఊపిరితిత్తుల్లో శ్లేష్మం రేటు పెరగడానికి, శ్వాస రేటు తగ్గపోవడానికి, దగ్గు మరియు గురక లాంటి లక్షణాలకు కూడా ఇది కారణం అవుతుంది. చాలా దేశాల్లో కాలాన్ని బట్టి కూడా ఈ సమస్య బాధిస్తుంది. ఈ సమయంలో గడ్డి మొక్కల్లో ఫలదీకరణం మొదలు కావడం వల్ల ఎక్కువగా పుప్పొడి గాలిలో కలిసి ఉంటుంది. ఫలితంగా ఈ తరహా సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

కుటుంబాలు, వయసును బట్టి కూడా ఈ సమస్య మారుతూ ఉంటుంది. ముఖ్యంగా 10 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ సమస్య బాగా బాధిస్తుంది. 10 నుంచి 30 ఏళ్ళ మధ్య వయసు మధ్య వీటి స్థాయి వేగంగా పడిపోతుంది. బాలికలతో పోలిస్తే… మగ పిల్లల్లోనే ఈ సమస్య ఏక్కువగా ఉంటుంది. జన్యుపరమైన కారణాలు సైతం దీని మీద ప్రభావం చూపుతాయి. సాధారణంగా పెద్ద కుటంబాల నుంచి వచ్చే పిల్లల్లో సాధారణంగా ఇవి కనిపించవు. ఒకే బిడ్డ ఉన్న కుటుంబాలతో పోలిస్తే… ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాల్లో సోదరుల ద్వారా ఇది సంక్రమిస్తుంది. పట్టణ పారిశ్రామికీకరణ సైతం ఈ వ్యాధిపై ప్రభావం చూపుతుంది. ఓ రకంగా పారిశ్రామికీకరణ జరిగిన ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ సమస్య ఎదురయ్యే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. 10 నుంచి 25 శాతం వరకూ ఈ సమస్య ఎదురౌతూ ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం లాంటి జీవావరణ ప్రాంతాల్లో ఇది మరీ ఎక్కువ.

ఒకసారి అలర్జీ రినిటిస్ వచ్చిందంటే చాలా విషయాల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఘాటైన వాసనలు, రసాయన పదార్థాలు, పొగాకు వాసన లాంటివి తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆ సమయంలో చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇళ్ళు, లైబ్రరీల్లో ఉండే దుమ్ము నుంచి జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా దుమ్ము, ధూళిలో కొన్ని రకాల సన్నని పురుగులు నివశిస్తూ ఉంటాయి. వాటిని నివారించే చర్యలు చేపట్టాలి. బయటకు వెళ్ళినప్పుడు పుప్పొడి, దుమ్ము లాంటి వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు సైతం ఈ సమస్యలను పెంచిపోషిస్తుంటాయి. శరీర తత్వాన్ని బట్టి వైద్యులు సూచించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ సమస్యల నుంచి బయట పడేందుకు పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమే. ఎప్పటికప్పుడు కళ్ళు, ముక్కును శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇంట్లో వాడుకునే దిండ్లు, దుప్పట్లు, కార్పెట్ల లాంటివి వీలైనంత మేర శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ కాలం వాడకుండా పక్కన పడేసిన వస్తువుల మీద పేరుకు పోయిన దుమ్మును చాలా జాగ్రత్తగా శుభ్రం చేసి వాడుతూ ఉండాలి. పెంపుడు జంతువుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

అలర్జీ రినిటిస్ ఒక్క సారి వ్యాపించాక, అలాంటి వ్యక్తుల నుంచి ఇంట్లో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం లేకపోయినా… ఈ సమస్య ఎలాంటి పరిస్థితుల్లో వ్యాపించిందో, అది మిగిలిన వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో జాగ్రత్త పడాలి. ఈ సమస్య మరింత ప్రమాదకారి కాకపోయినా, భవిష్యత్ లో ఆస్తమా లాంటి సమస్యలను కొనితెచ్చే ప్రమాదం అధికంగా ఉంది.

Leave a Comment