ప్రతి ఒక్కరికి తాము అందంగా కనబడాలనే కోరిక కలిగి ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు తమ అందాన్నిరెట్టింపు చేసుకొనేందుకు .. మరింత అందాన్ని ఇనుమడింపజేసుకొనేందుకు చాలా కష్టపడుతుంటారు. అయితే ఎండాకాలంలో అందాన్నికాపాడుకోవడం తలకు మించిన భారగా తయారవుతుంది. వేసుకొన్న మేకప్‌తో కొత్త చిక్కులు వచ్చిపడతాయి.
వేసవి వచ్చేసింది. ఎండలు మండుతున్నాయి. బయట వెళ్ళాలంటేనే భయం..భయం.. వేసవిలో వేడితాపానికి చర్మం కమలిపోవడం, చర్మం పగుళ్ళు, వడదెబ్బ, చెమరకాయలు, స్కిన్ అలర్జీ రకరకాలుగా ఇబ్బంది పడుతుంటారు. వేసవి వస్తే చాలు చాలా మందికి చెమట ఎక్కువ పట్టేస్తుంది. కొందరికి ముఖంపై చెమట కారుతూ వేసుకున్న మేకప్ కూడా పోతుంది. ఇది చిన్న సమస్యే అయినా చాలా చికాకును కలిగిస్తుంది. అలాంటి వారు వేసవిలో చిన్న చిట్కాలు పాటించడం ద్వారా చెమట ఎక్కువ పట్టకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. వేసవిలో మేకప్ కాస్త అసౌకర్యంగా అనిపిస్తుంది. అయితే ఈ కాలంలో వేడుకలు ఎక్కువగానే ఉంటాయి. అందుకని సహజ అందానికి మేకప్ వేసుకోవడం తప్పనిసరి. అయితే చెమట, ఉక్కబోత వంటి సమస్యల కారణంగా వేసుకున్న మేకప్ తొందరగా చెదిరిపోతుంది.
వేసవిలో సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చర్మంలోని కొజిలాన్ కు తీరని హని కలిగిస్తాయి. ఎండలో మరీ ఎక్కువగా తిరిగే వారికి మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. తేమ సబ్బులకు బదులు సాధారణ సబ్బులు వినియోగించడం మంచిది. నేచురల్ స్కిన్ ప్రోడక్ట్స్‌ను ఎంపిక చేసుకోవాలి. పండ్లతో తయారయ్యే నాన్ టాక్సిక్ క్లీనింగ్ ప్రోడక్ట్స్‌ను ఉపయోగించాలి. రెగ్యులర్ డైట్ లో విటమిన్ సి తగినంత తీసుకోవడం వల్ల చర్మం ముడతలు మాయం అవుతాయి. జిడ్డు చర్మం ఉన్నవారు ముందుగా ఆయిల్ ఫ్రీ ప్రైమర్‌ని ముఖానికి రాసుకోవాలి. లిప్‌స్టిక్ చేసుకోవడానికి ముందు పెదవులను స్క్రబ్ చేసి లిప్‌బామ్ రాయడం చాలా మంచిది. మేకప్ వేసుకోవడానికి అరగంట ముందు ముఖానికి సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. వెంట్రుకలు మెడపై పడకుండా చూసుకొనేలా ముడుచుకోవాలి.
రోజులో మూడు నుంచి అయిదు సార్లు చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవడం ద్వారా చర్మరంద్రాలు మూసుకుపోకుండా చూసుకోవచ్చు. ఫేషియల్ స్వెట్టింగ్ తగ్గించుకోవడానికి బయటకు వెళ్లే ముందు ఐస్ ముక్కలను వస్త్రంలో చుట్టి ముఖంపై మర్దన చేసుకోవాలి. ఎప్పుడూ అందంగా ఉండాలంటే కొద్దిపాటి డీహైడ్రేషన్ ఉన్నా నీరు తీసుకోవాలి. ద్రాక్షలు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుపచ్చని కూరగాయలు, ఎరుపు రంగు పండ్లు తీసుకోవాలి. చెర్రీ, బ్రోకోలి వంటి ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏజింగ్ టాక్సిన్స్‌ను నివారిస్తుంది. రోజూ రాత్రి నిద్రపోవడానికి ముందు కీర దోసకాయల రసాన్ని ముఖానికి రాసుకోవాలి. ఎండలో తిరగడం తగ్గించాలి. మంచినీరు, కొబ్బరినీరు ఎక్కువగా తీసుకోవాలని సెలవిస్తున్నారు సౌందర్యపోషక నిపుణులు.
నిత్యం వ్యాయామం చేస్తూ బ్యాలెన్స్డ్ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. మనసును అదుపులో ఉంచుకునేందుకు యోగా, ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతత మాత్రమే కాదు చర్మానికి కొత్తకాంతి కూడా వస్తుంది. సో వేసవిని ఎంజాయ్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి.







