ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరిని భయపెట్టిస్తున్న వ్యాధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్యాన్సర్ల గురించి. బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లు వంటి చాలా ఇబ్బందిపెట్టేస్తున్నాయి. ఈ క్యాన్సర్ల/ ఎలా వ్యాప్తి చెందుతాయో తెలుసుకొంటే… వాటిని నివారించుకొనే మార్గాలు మన చేతుల్లో ఉంటాయి.
క్యాన్సర్ అనేది శరీరంలో ఎక్కడైనా వచ్చే అసాధారణమైన కణాల అనియంత్రిత పెరుగుదల. కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలనే క్యాన్సర్లుగా పిలుస్తారు. ట్యూమర్లు.. మాలిగ్నెంట్ ట్యూమర్, బినైన్ ట్యూమర్లుగా ఉంటాయి. మాలిగ్నెంట్ రకం ట్యూమర్ల నుంచి కొన్ని కాన్సర్ కణాలు విడిపోయి దేహంలో ఏర్పడిన ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంలోకి చేరి ద్వితీయ ట్యూమర్లను ఏర్పరుస్తాయి. ఇవి తొందరగా పెరుగుతాయి. ప్రమాదకరమైనవి. ఇక బినైన్ ట్యూమర్లు నెమ్మదిగా పెరిగి, చిన్నవిగా ఏర్పడతాయి. ఇవి హానికరమైనవి కావు. చిన్న శస్త్రచికిత్స ద్వారా తొలగించే వీలుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతున్నకొద్దీ బ్రెస్ట్ లో లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. బ్రెస్ట్ లో లక్షణాలు లేకుండా బ్రెయిన్ ట్యూమర్ లాగా, బోన్ ట్యూమర్ లాగా కనిపించవు. ఇలాంటి లక్షణాలు వచ్చేముందు చాలాసార్లు గడ్డ, నొప్పి, చర్మంలో మార్పులు, నెపుల్ డిశ్చార్జ్ లేదా చంకలో గడ్డలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ లక్షణాల ఆధారంగా వారు తమకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని గమనించాలి. 90% ఇది వంశపారంపర్యగా సంక్రమించదు. కేవలం 5 నుంచి 10% వరకు మాత్రమే కుటుంబ సభ్యులకు రావచ్చు. తల్లి, చెల్లి, కూతురుకి ఉంటే వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. వేరే కుటుంబ సభ్యులకు బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. 45 ఏళ్ళు దాటిన వారికి మమోగ్రామ్ చేస్తారు. కాబట్టి 20 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ ప్రతి నెల తమ బ్రెస్ట్ ను చెక్ చేసుకోవాలి.
మహిళలను ఎక్కువగా వేధిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్లు.. ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలు, కాలేయం వంటి అవయవాలకు కూడా వ్యాప్తిచెందుతాయి. చంకలు, మొడ కింది భాగంలో, బ్రెస్ట్‌లో ఉండే లింఫ్ నోడ్స్ రొమ్ము క్యాన్సర్ వ్యాప్తిచెందడంలో ముఖ్యపాత్రపోషిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఎముకల్లో ఉన్నట్లయితే తొలుత వెన్నెముక, కాళ్లు, చేతుల ఎముకల్లో నొప్పి కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్ కాలేయానికి వ్యాపిస్తే నడుం ప్రాంతంలో నొప్పిగా ఉంటుంది. ఆకలిని కోల్పోయి బరువు కూడా తగ్గుతారు. చేతులు, కళ్లు పసుపు రంగులోకి మారడాన్ని చూడొచ్చు. ఊపిరితిత్తుల విషయానికి వస్తే ఇవి ఊపిరితిత్తులు, చెస్ట్ వాల్‌కు మధ్యలో వ్యాప్తిచెందుతాయి.ఇలాంటి సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎడతెరిపి లేని దగ్గు, చాతిలో నొప్పి కనిపిస్తుంది. ఇక మెదడుకు వ్యాప్తిచెందితే.. తలనొప్పి కలుగడంతో పాటు శరీరం బ్యాలెన్స్ తప్పిపోయి కిందపడేలా చేస్తుంది. తల మొద్దుబారినట్టుగా అనిపించడం, తిమ్మిర్లు కూడా వస్తుంటాయి.
రొమ్ము క్యాన్సర్ పేరెత్తగానే మహిళలు భయపడిపోతుంటారు. రొమ్ము క్యాన్సర్లు చాలా తక్కువగా వస్తుంటాయి. అపోహ కారణంగానే మహిళలు భయానికి గురువుతుంటారు. క్రమం తప్పకుండా బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల ముందస్తుగానే గుర్తించొచ్చు. రొమ్ము క్యాన్సర్లు వారసత్వంగా వస్తుంది అనేది మరో అపోహ మహిళల్లో ఎక్కువగా ఉన్నది. ఇది నూరు శాతం తప్పు. ఈ వ్యాధి కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపదు. అయితే రొమ్ములో ఎలాంటి గడ్డలు కనిపించగానే భయపడిపోవద్దు. బ్రెస్ట్‌లో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్లు కావు. ఒకవేళ రొమ్ముక్యాన్సర్ గా నిర్దారణ జరిగినా.. అప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వైద్య చికిత్స బాగా అందుబాటులోకి వచ్చింది. వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి. క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం, పోషకాహారం తీసుకోవడం అత్యంత కీలకాంశమని గుర్తుంచుకోవాలి.
కేవలం బయటకు కనిపించే లక్షణాలతోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడం కష్టం. అందుకని 45 ఏండ్ల వయసు దాటి ప్రతి మహిళ ముందస్తుగా బ్రెస్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు








