Constipation in Children : పిల్లల్లో మలబద్ధకమా?

By manavaradhi.com

Published on:

Follow Us
Constipation in Children

నేటి ఆధునిక సమాజంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఇది శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియ. ఈ మలవిసర్జన కొందరిలో రోజుకు ఒకసారి, రెండుసార్లు జరగవచ్చు. ఇలా మలవిసర్జన జరగాల్సిన సమయంలో జరగకపోతే దాన్ని మలబద్దకంగా భావించాలి. సాధారణంగా మూడు రోజులకు మించి మలవిసర్జన కాకుండ ఉంటే దానికి కారణం తెలుసుకోవడం మంచిది. పసిపిల్లలలో కొన్నిసార్లు మలవిసర్జన ఆందోళన కలిగిస్తాయి. ఇది జనాభాలో 2 % నుండి 20 % సంభవిస్తుంది. ఇది మహిళల్లో ఎక్కువగా… పెద్దలు మరియు పిల్లల్లో సాధారణంగా కనిపిస్తుంది. సాధరణంగా జీర్ణాశయంలో ఆహారం జీర్ణమైన తర్వాత అది చిన్న పేగులోకి వెళుతుంది. చిన్న పేగులు ఆహారములోని ఆవశ్యక తత్వాలను పీల్చుకొన్న తర్వాత మిగిలినది పెద్ద పేగులోకి చేరుతుంది. ఇంకా మిగిలి ఉన్న శక్తితత్వాలను గ్రహించి వ్యర్ధ పదార్థాన్ని మలరూపంలో నెట్టివేస్తుంది. సహజంగా జరగాల్సిన ఈ ప్రక్రియలో ఇబ్బంది ఏర్పడటాన్నే మలబద్ధకంగా చెబుతారు.

ఆధునిక జీవన విధానంలో వస్తున్న మార్పుల వల్ల ఈ మలబద్దకం పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ఈ సమస్యను అశ్ర్ద్ధ చేయడం వల్ల మరెన్నో ఇతర అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. వీటిలో జీర్ణాశయ వ్యాధులు, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి ముఖ్యమైనవి. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవటం, కొన్ని రకాల మందులు, ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడం, వేళకు మలవిసర్జనకు వెళ్ళే అలవాటు నేర్పకపోవడం, రోజుకు సరిపడినంత నీరు తీసుకోకపోవడంవలన ఈ మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. ఇది తీవ్రమెన వ్యాధి కాదు. కానీ అశ్రద్ధ చేస్తే అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది.

పిల్లలు బాత్రూమ్‌కి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిశీలింఛాలి. వీరిలో పేగు కదలికలు క్రమం తప్పకుండా ఉండాలి. పిల్లలలో సగటున కనీసం ప్రతి రోజు ఒకసారి ప్రేగు కదలికలు కలిగి ఉన్నాయా లేదా పరిశీలించాలి. కొన్నిసార్లు పసిపిల్లల్లో పేగు కదలికలు వారంలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే ఉండే సందర్భాలు కూడా ఉంటాయి. అప్పుడు మల విసర్జిన కష్టంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి.

  1. త్రేన్పులు ఎక్కువగా ఉండటం
  2. మల విసర్జనకు వెళ్లాలంటేనే భయపడిపోవడం.
  3. రాత్రి నిద్ర పట్టకపోవడం
  4. గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండటం,.
  5. పుల్లటి తేన్పులు రావడం
  6. మల విసర్జన సరిగా పూర్తిగా కాదు.
  7. నీరసంగా ఉండటం.
  8. తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం
  9. కడుపునొప్పి
  10. వాంతులు కావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
    ఈ లక్షణాలతోపాటు అనేక రోగాలు తలెత్తడానికి అవకాశం కలుగుతుంది. మలబద్ధకం వలన అది బయటకు పోనట్లయిన మలము అక్కడే వుండి కుళ్ళడం మొదలు పెడుతుంది. పురుగులు పుడతాయి. దుర్వాసనతో కూడిన గ్యాస్ ఉత్పన్నమవుతుంది. పిల్లల ఆహారంలో నీటిలో కరిగే పీచు పదార్ధాలు చేరిస్తే మలబద్ధకం పోతుంది. అందుకుగాను, పప్పులు, ధాన్యాలు, తాజా కూరలు, పండ్లు, నీరు తగినంతగా ఆహారంలో చేర్చాలి. ఆపిల్‌, పపయా వంటి పండ్లు తినిపిస్తే, ఇవి పిల్లలలో వచ్చే మలబధ్ధకాన్ని నివారిస్తాయి. మలం విసర్జన సక్రమంగా జరగాలంటే పండ్ల రసాలు, నీరు ఎక్కువగా ఇవ్వాలి. పిల్లలు ఆటలాడటాన్ని ప్రోత్సహింఛాలి. ఆటల తర్వాత ద్రవ ఆహారాలను అధికంగా ఇవ్వాలి. పిల్లాడు ప్రతిరోజూ ఒకే సమయానికి టాయ్‌ లెట్‌ కు వెళ్ళేలా అలవాటు చేయాలి. టాయ్‌ లెట్‌ లో 5 – 10 ని.లు గడిపేలా చేయండి. కొవ్వులు అధికంగా వుండే ఫాస్ట్ ఫుడ్స్ , ప్రోసెస్ చేసిన కేండీలు, కుక్కీలు, కూల్ డ్రింక్ లు కూడా మలబద్దకానికి దారితీస్తాయి. కొన్నిమార్లు పిల్లలలో ఐరన్ లోపం కొరకు వేసే మందులు కూడా మలబద్ధకం కలిగిస్తాయి. కాబట్టి ఈ సమస్య నివారణకు ద్రవ పదార్థాలు మరియు నీరు ఎక్కువగా తీసుకోవాలి. పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటి పండ్లు, పైనాపిల్, బత్తాయి, సపోట పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు నిత్యం తీసుకోవడం వలన మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.
  1. పీచు పదార్థాలు అధికంగా ఉన్న పండ్లను ఎక్కువగా తినిపించాలి.
  2. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకు కూరలు పెట్టాలి.
  3. ఫాస్ట్ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు తినే అలవాటును మానిపించాలి.
  4. నిలువ ఉంచిన పచ్చళ్లు, కాఫీ, టీలు ఇవ్వకూడదు.
  5. వేళకు ఆహారం తీసుకుంటూ, నీరు సరిపడినంతగా తాగే అలవాటు చేయాలి.
  6. ఒత్తిడిని నివారించే యోగా, వ్యాయామము, ప్రాణాయామము, మెడిటేషన్ నేర్పించాలి.

మలవిసర్జన చేసేటప్పుడు బలవంతంగా ముక్కకూడదు. ఇందువలన పైల్స్ తయారై తిరిగి మలబద్దకాన్ని కలుగజేస్తాయి. ప్రతి రోజూ ఓ చిన్నగ్లాసు క్యారట్ జ్యూస్ లేదా క్యాబేజీ రసం, ద్రాక్షరసం లాంటివి , బీట్ రూట్ రసం, అరటి పండ్లు తీసుకోవాలి. టొమాటో రసంలో కాసింత ఉప్పు, మిరియాల పొడి కలిపి ప్రతిరోజూ ఉదయం సేవిస్తే… మలబద్ధకం, అజీర్తితో పాటు గ్యాస్ వల్ల కలిగే మంట కూడా తగ్గుతుంది.

Leave a Comment