మలబద్దకం.. నలుగురిలో ఉన్నప్పుడు ఇతర అన్ని సమస్యల కన్నా మలబద్దకం సమస్య మనల్నితీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తుంది. మరి మలబద్దకం వేధిస్తుంటే ఎలాంటి ఆహారాలను దూరంగా ఉంచాలి..?
మామూలుగా ప్రతి మనిషికీ ఒక పద్ధతిలో మల విసర్జన జరుగుతుంది. కొందరిలో రోజుకు రెండు సార్లు జరిగితే.. మరికొందరిలో రెండు, మూడు రోజులకొకసారి అవుతుంది. ఎవరిలోనైనా సహజమైన పద్ధతిలో మార్పు సంభవించి, జరగాల్సిన సమయంలో మలవిసర్జన జరుగనట్లయితే దానిని మలబద్ధకంగా భావించాలి. సాధారణంగా మూడు రోజులకు మించి మలవిసర్జన జరుగకుండా ఉంటే దానికి కారణం తెలుసుకోవడం మంచిది. ఆధునిక సమాజంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకాకి ప్రధాన కారణం.. మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకపోవడం, ఫైబర్ ఫుడ్స్ తీసుకోకపోవడం, ఫాస్ట్ ఫుడ్స్,బేకిరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం ప్రధాన సమస్యగా తీవ్రరూపం దాలుస్తోంది. కొన్నిరకాల మందులను వాడటం వల్లగానీ, థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించడం వల్లగానీ మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
మలబద్ధకమే కదా అని తేలికగా తీసుకుంటే.. మనకు వచ్చే చాలా రకాల వ్యాధులకు ‘మలబద్ధకమే’ మూల కారణంగా ఉంటుంది. మలబద్ధకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, హైపర్‌టెన్షన్, పైల్స్, ఫిషర్స్, గ్యాస్, వికారం, తలనొప్పి వల్ల మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉంది. మలబద్దకం వేధిస్తుంటే కొన్ని రకాల ఆహారాలను దూరంగా పెట్టడం వల్ల ఉపశమనం పొందవచ్చు. వేయించిన ఆహారాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మలబద్దకం కలుగుతుంది. రిచ్‌సాస్‌లు, మాంసం, క్రీం డిజర్ట్ లు సమస్యను తీవ్రతరం చేస్తాయి. పండ్లు, కూరగాయలు, గ్రీన్ లీఫీ వెజిటెబుల్స్ లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్దకాన్ని తొలగిస్తాయి.

నిత్యం తీసుకొనే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేవాలా చూసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే మలబద్దకం రాకుండా ఉంటుంది. ఆకుకూరలతో పాటు పండ్లు తినడం వల్ల పీచు బాగా అందుతుంది. ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉండే నానబెట్టిన పప్పు దినుసులు తినడం చాలా మంచిది. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, గింజ ధాన్యాలు, చిరు ధాన్యాలు, పప్పు దినుసులు ఎక్కువగా తీసుకోవాలి. బ్రెడ్, టోస్ట్, బేకిరీ బిస్కట్స్, పఫ్స్, పిజ్జా, బర్గర్, జెల్లీస్, ఫ్రూట్ జ్యూస్ లు, షుగర్ డ్రింక్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ను మానేస్తే మంచిది.
మలబద్దకం ఇతర ఆరోగ్య సమస్యలకు మూలకారణంగా మారకముందే నివారించుకొనేలా చూడాలి. మలబద్దకం సమస్య మరీ ఎక్కువైన సందర్భాల్లో ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడ్ని సంప్రదించి తగు చికిత్స పొందాలి.








