కొంతమందిలో చేతివేళ్లు తిమ్మిర్లు వస్తాయి..మరికొంతమంది ఏ వస్తువును గట్టిగా పట్టుకోరు… మరికొందరికీ స్పర్శజ్ఞానం తెలియదు.. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన సమస్య.. ఎప్పుడూ వచ్చే తిమ్మిర్లే కదా అనుకుంటే అది నరాలు చచ్చుబడిపోయేలా చేస్తుంది. ఇలా జరుగుతున్నాప్పుడు ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
మనలో చాలా మందికి చేతులు మొద్దు బారినట్టునట్టు చాలా సందర్బాల్లో అనిపించి ఉండవచ్చు. చేతులు మొద్దుబారిపోవడం స్పర్శ కోల్పోవడం వెనుక నరాల సమస్యలు ప్రధానమైనవి. ఒక్కో సారి అరుదుగా మెదడు, వెన్ను సమస్యల వల్ల కూడా చేతులు మొద్దుబారిపోయే సమస్యకి కారణాలు కావచ్చు. సమస్య తీవ్రత ని బట్టి చికిత్స తో పాటుగా జీవన శైలి మార్పులు అవసరం పడతాయి. చేతులు ముఖ్యంగా అరిచేతుల నరాలు తిమ్మిరెక్కినట్టు, చేతుల్లో స్పర్శ తెలియక మొద్దు బారినట్టు అనిపించే సమస్య తీవ్రంగా ఉంటే దాని వెనుక పలు కారణాలు ఉండొచ్చు. వాటిల్లో అత్యంత సాధారమైది నరాల సమస్య కావచ్చు. చేతుల్లో మణికట్టులో, ఒకటి లేదా పలు నరాలు దెబ్బతినడం వల్ల లేదా నొక్కుకొని పోవడం కారణం కావచ్చు. ఇక నరాలను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా డయబెటిస్ వల్ల కూడా చేతులు మొద్దు బారే అవకాశం ఉంది. కాకపోతే డయబెటిస్ వల్ల పాదాల్లో ముందుగా ఈ సమస్య తెలుస్తుంది.
మెదడు వెన్నుపాము సంబంధ కొన్ని అరుదైన ఆరోగ్య సమస్యలు కూడా చేతులు మొద్దుబారడానికి కారణం కావచ్చు. ఒకటి లేదా రెండు చేతుల్లో ఉండే తిమ్మిర్ల కి ఇతర కారణాలు ఉన్నాయి.. ఎక్కువగా మద్యం సేవిచడం, కార్పెల్ టన్నల్ సిండ్రోమ్, సర్వైకల్ స్పాండిలోసీస్, లైమ్ డిసీజ్, మల్టీపుల్ స్క్లిరోసిస్, వ్యాస్కులైటీస్, విటమిన్ B లోపం . ఇక కిమో థెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా కూడా చేతుల మెుద్దు బారినట్లు అవుతుంటాయి. చికిత్స ఆయా కారణాల ఆధారంగా ఉంటుంది. కారణం ఏంటి అని తెలుసుకొనేందుకు కొన్ని వైద్య పరీక్షలు అవసరం పడవచ్చు. చేత్తుల్లో తిమ్మిర్లు అకస్మాత్తుగా మొదలై, బలహీనత తో పాటుగా పెరాలసిస్ లక్షణాలను పోలి ఉన్నా.. దీని తో పాటుగా మాట్లాడడంలో ఇబ్బంది, తల తిరిగినట్టుగా, విపరీతమైన తలనొప్పి ఉన్నా ఎమెర్జెన్సీ గా పరిగణించి వైద్య సహాయం తీసుకోవాలి . వీటితో పాటుగా చేతులు మెుద్దు బారినట్లు రెండు వారాలపైగా బాధిస్తూ ఉంటుంది. కొందరిలో నెమ్మదిగా మొదలై రోజు గడుస్తున్న కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది. కొన్ని పనులు చేస్తుంటే ఎక్కువ అవుతున్నా…ఒక చేతిలో ఒక వేలు మాత్రమే తిమ్మిరి ఎక్కుతున్నా వెంటనే వైద్య సహాయం తీసుకోవడం మంచిది.
సరి అయిన మోతాదుల్లో విటమిన్ బి తీసుకొని కారణంగా చేతుల్లో కాళ్లలో తిమ్మిర్లు రావచ్చు. ఇక ప్రెగ్నెన్సి లో కూడా ఒక్కో సారి వాటర్ రిటెన్షన్ వల్ల చేతులు మెుద్దుబారడం, తిమ్మిర్లు ఎక్కిన ఫీలింగ్ చూస్తూ ఉంటాం. B విటమిన్ లోపం వల్ల నరాల పని తీరు దెబ్బతింటుంది కాబట్టి బి కాంప్లెక్స్ విటమిన్ తీసుకోవడం ద్వారా లేదంటే ఆహారం లో బి విటమిన్ ఉండే ఫూడ్స్ ని పుష్కలంగా తీసుకోవడం ద్వారా ఉపసమనం పొందవచ్చు. ఇక కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ లో భాగంగా ఒకే పోసిషన్ లో కూర్చొని చేతులను ఒకే పద్దతిలో తో పని చేసే వారిలో కూడా కొన్ని అనుకూలత్మక మార్పులను చేసుకోవడం ద్వారా సమస్యని అధికమించవచ్చు. తిమ్మిర్లు వారాల తరబడి వేధిస్తూ క్రమంగా తీవ్రమవుతూ ఉంటే.. అలాంటి తిమ్మిర్లను శరీరంలోని తీవ్రమైన వ్యాధులకు సంకేతాలుగా భావించాలి. లక్షణం మూలాల్లోకి వెళ్లకుండా తిమ్మిర్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే తిరిగి కోలుకోలేనంతగా నరాలు దెబ్బతింటాయి . అందుకే తిమ్మిర్లు వస్తుంటే వ్యాధి నిర్ధారణ చేసుకొని తగిన చికిత్స తీసుకోవాలి.
ఇవి అందరినీ ఏదో ఓ సందర్భంలో ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కానీ అవే ఎక్కువగా వేదిస్తుంటే లక్షణం మూలాల్లోకి వెళ్లకుండా తిమ్మిర్లే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి ఎక్కుగా భాదిస్తుంటే వైద్యుని సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలి.