ప్రతి మనిషికి గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. సాధారణంగా గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంది. గుండె చప్పుడును తీక్షణంగా వింటే తప్ప.. మనం గమనించే అవకాశం లేదు. కానీ ఒక్కోసారి హృదయ స్పందనలో తేడా రావచ్చు. అంటే వేగంగా కొట్టుకోవడం అన్నమాట. దీన్నే సాధారణ పరిభాషలో గుండె దడ అంటారు. గుండె వేగంగా కొట్టుకుంటోందంటే శరీరంలో ఏదో సమస్య ఉందని అర్థం. అసలు ఏఏ కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది.. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె. సాధారణంగా ప్రతి మనిషిలో గుండె నిముషానికి.. . 60 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. ఇంతకంటే వేగం పెరిగినా, తగ్గినా ..ఏదో సమస్య వచ్చిందని గుర్తించవచ్చు. హృదయ స్పందన వేగం పెరిగితే దాన్ని గుండె దడ అంటారు. గుండె దడ ఎక్కువైనప్పుడు ఛాతీ, గొంతు, మెడ భాగంలో .. ఆ విషయాన్ని గమనించవచ్చు. ఐతే గుండె దడ.. ఒక్కోసారి తీవ్రమైన సమస్య కాకపోవచ్చు. శరీరంపై ఒత్తిడి పెరిగిన కారణంగా రావచ్చు. మద్యం సేవించినప్పుడు, పొగ తాగినప్పుడు గుండె దడ పెరిగే అవకాశం ఉంది. గర్భవతుల్లోనూ ఈ సమస్య ఉంటుంది. ఈ గుండె దడ ఒక్కోసారి తీవ్రమైన గుండె సమస్యలకు సంబంధించిన సంకేతాలను తెలియజేస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం, నిస్సత్తువగా అనిపించడమ్, ఛాతీలో నొప్పి, కళ్లు తిరగడం లాంటివి కనిపించినప్పుడు గుండె వేగంగా గుండెలో ఏదో సమస్య ఉందని గ్రహించాలి. సమస్య తీవ్రతను మందుగానే పసిగట్టి వైద్యున్ని సంప్రదించాలి.
ఒక్కోసారి గుండె దడ సమస్య శరీరంలో ఒత్తిడి, ఆందోళన పెరిగినప్పుడు, గొడవ పడినప్పుడు, చెడు వార్తలు విన్నప్పుడు, శారీరక వ్యాయామం ఎక్కువగా చేసినప్పుడు, మద్యం లేదా మాదకద్రవ్యాలు తీసుకున్నప్పుడు, లోబీపీ ఉన్న వారికి ఎక్కువగా వస్తుంటుంది. అలాగే మహిళల్లో బహిష్టు సమయంలో హర్మోన్ల మార్పు కారణంగా, గర్భం దాల్చిన సమయంలో, మెనోపాజ్ కు ముందు కూడా గుండె దడ సమస్య వస్తుంది. ఈ సమస్య ఉన్న వారు కాస్త బలహీనంగా ఉన్నారని అర్ధం చేసుకోవచ్చు.. ఇలాంటి సమస్య ఉన్న వారు ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సొంతంగా మెనూ తయారు చేసుకుంటే మంచిది. గుండెదడ సమస్య తీవ్రంగా ఉంటే.. వైద్యులు సంప్రదించి చికిత్స తీసుకోవాలి. వీలైనంత మేరకు గుండెదడ రాకుండా చూసుకోవడమే మంచిది.. ఇందుకోసం ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవాలి.. యోగా లాంటివి చేయాలి.. .
హృదయం పదిలంగా ఉండాలంటే . . ఒత్తిడిని వీలైనంత మేరకు తగ్గించుకోవాలి. రోజూ కాసేపు వ్యాయామం చేయాలి. ఉదయం పూట కనీసం 45 నిముషాలపాటైనా నడిస్తే మంచిది. సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యం. సిగరెట్, మద్యం, మాదక ద్రవ్యాల వంటి దురలవాట్లు మానేయాలి. సో.. గుండె ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు పాటించండి. మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకుని ఆరోగ్యంగా ఉండండి..







