నేటి తరుణంలో మారుతున్న జీవనశైలి.. అలవాట్ల వల్ల ప్రతి 100 మందిలో 40 శాతం మంది తుంటి నొప్పితో బాధపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో, శరీరంలోని ఇతర భాగాలలో, వెనుక వీపు వంటి పరిస్థితుల వల్ల తుంటి నొప్పి వస్తుంది. అయితే అలాంటి వారు వైద్యులు అందించే చికిత్సతోపాటు కొన్ని సూచనలు పాటిస్తే నొప్పి నుంచి కొంత ఉపశమనం పొందేందుకు వీలు కలుగుతుంది.
తుంటి నొప్పి అనేక రకాల కారణాల వల్ల సంభవించవచ్చు ముఖ్యంగా హిప్ జాయింట్ నుంచి లేదా జాయింట్ పరిసర నిర్మాణాల నుంచి మొదలవుతుంది. ఇవి మొదలయ్యే స్థలాన్ని బట్టి నాలుగు రకాలుగా ఉంటాయి. హిప్ ముందు బాగంలో నొప్పి, లాబ్రల్ టియర్ , స్ట్రెస్ వల్ల జరిగే చీలిక వలన కలిగే నొప్పి, కాపు తిత్తుల వాపు వలన కలిగే తొంటి నొప్పిగా ఉంటాయి. హిప్ ముందు బాగంలో నొప్పి సాదారణంగా ఇది తుంటిలో ఆర్థరైటిస్ వలన వస్తుంది. తేలికపాటి నొప్పి జాయింట్ లో మొదలై క్రమేనా పెరిగి పెద్దదవుతుంది. ఇక లాబ్రల్ టియర్ విషయానికొస్తే తోడ కండరాబాగాన్ని రక్షించే రింగ్ లాంటి వలయంలో ఒక తెంపు కనుక జరిగితే దాని వాళ్ళ వచ్చే తుంటి నొప్పిని లాబ్రల్ టియర్ అంటారు.
తుంటి నొప్పి కి కారణాలు ఏంటి..?
- తుంటినొప్పి రావడానికి ముఖ్యంగా ఆర్థరైటిస్, హిప్ ప్రమాదానికి గురవడం, కాపుతిత్తుల వాపు (బర్సిటీస్), టెండినైటీస్ వల్ల వస్తుంది. తుంటినొప్పి శరీరానికి కేవలం ఒకే వైపునే.. అది కూడా తుంటి దగ్గర, పిరుదుల దగ్గర ఉంటుంది. ఆ ప్రదేశంలో ఉండే సయాటిక్ నరం పనితీరులో మార్పు వల్లే ఈ నొప్పి వస్తుంది. కూర్చున్నా, నిలబడ్డా, కదిలినా తుంటి దగ్గర విపరీతమైన నొప్పి. భరించలేనంత బాధ. ఆ ప్రదేశంలో సూదులతో గుచ్చినట్టుగా ఉండడం, స్పర్శ జ్ఞానం సరిగ్గా ఉండదు.
- తుంటినొప్పిగా ఉన్న సమయాల్లో తొడ, గ్రోయిన్, పిరుదుల్లో అసౌకర్యాంగా ఉంటుంది. తుంటి భాగాన్ని కానీ కాలును కదపలేకపోవడం, బరువును మోసే శక్తి లేకపోవడం, తీవ్రమైన నొప్పి, ఒక్కసారిగా వాపు, ఎరుపెక్కడం, జ్వరం రావడం, చలిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్ ట్యూమర్లు ఎముకలకు వ్యాపించిన సందర్భాల్లో కూడా హిప్ ఆర్థరైటీస్ లక్షణాలు కనిపిస్తాయి. ఎముకకు రక్తం సరఫరాలో వేగం తగ్గిన సందర్భాల్లో ఎముక కణజాలం చనిపోయి తుంటి నొప్పి వస్తుంది.
తుంటి నొప్పికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?
తుంటి నొప్పులతో బాధపడేవారు శరీరం బరువు పెరుగకుండా చూసుకోవాలి. నడిచేప్పుడు రెండు మోకాళ్ల మీద సరిగా ఒత్తిడి పడేలా శిక్షణ పొందాలి. తుంటి చుట్టూ ఉండే కండరాలను చిన్నచిన్న వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయడం ద్వారా బలోపేతం చేసుకొని తుంటి నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.ధూమపానం, మద్యపానం మానుకోవాలి. స్విమ్మింగ్, సైక్లింగ్ వంటివి తుంటిని దృఢంగా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. తుంటి నొప్పులను ఇంటి వద్దనే కొన్ని రకాల స్వీయరక్షణ టిప్ప్ పాటించి తగ్గించుకోవచ్చు. ముందుగా తగినంత విశ్రాంతి తీసుకోవాలి. మంచుగడ్డలతో గానీ, వేడి నీటితోగానీ కాపడం పెట్టాలి. ఎక్కువగా కూర్చొని పనిచేసేవారు మధ్యమధ్య లేచి నిలబడి విశ్రాంతి ఇవ్వడం వల్ల తుంటి నొప్పులు రాకుండా చూసుకోవచ్చు.
తుంటి నొప్పి అనేక రకాల కారణాల వల్ల సంభవించవచ్చు. కాబట్టి దాని పట్ల అలసత్వం వహించకుండా.. వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాడం ద్వారా తుంటి నొప్పి నుంచి బయటపడవచ్చు.