Health Tips : కళ్ల కింద రెండు వైపులా సీతాకోక చిలుక రెక్కల ఆకారంలో తెల్లటి మచ్చలు

By manavaradhi.com

Published on:

Follow Us

మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ అనేది చాలా ముఖ్యం. బయట నుంచి బ్యాక్టీరియా, వైరస్ లేదా మరే ఇతర సూక్ష్మిక్రిములు మన శరీరానికి హాని తలపెట్టాలని చూసినా .. ఈ రోగ నిరోధక వ్యవస్థ అడ్డుకుంటుంది. కానీ ఒక్కోసారి ఈ రోగనిరోధక వ్యవస్థ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. మంచి కణజాలపై దాడి చేయడం కారణంగా జబ్బులపాలు కావాల్సి వస్తుంది. దాన్నే ల్యూపస్ అంటారు.

మనకు తెలియకుండానే రోగాలకు కారణమయ్యేరకరకాల సూక్ష్మ జీవులు మన శరీరంలోకి చేరుతుంటాయి. అలా చేరే ప్రతి క్రిమి మన శరీరానికి హాని కలిగిస్తే అనారోగ్యం పాలు కావల్సి ఉంటుంది. అలా జరగకుండా ఉండేందుకు మన శరీరంలో ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. దీన్ని రోగ నిరోధక వ్యవస్థ అంటారు. ఇది ఒక్కోసారి వింతగా ప్రవర్తిస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో అది వ్యాధి కారకాలకు, శరీర కణజాలాలకు మధ్య తేడాను గుర్తించలేదు. దీంతో ఆరోగ్యవంతమైన శరీర కణజాలాల మీద శరీరంలోని నిరోధక వ్యవస్థ దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది. దీన్నే ల్యూపస్ అంటారు. ఈ స్థితిలో కలిగే వ్యాధులను ఆటో ఇమ్యూన్ వ్యాధులని వ్యవహరిస్తారు. ప్రత్యేకంగా ఏదో ఒక అవయవానికి మాత్రమే ఇవి పరిమితం కాదు. చర్మం, కీళ్లు, కిడ్నీ, గుండె.. ఇలా అన్ని అవయవాలకు ఇది హాని కలిగిస్తుంది. ల్యూపస్ .. చర్మంతోపాటు గుండె, మూత్రపిండాలు ఇతర ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. నివారణ లేనప్పటికీ, నష్టాన్ని తగ్గించగల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి…

కీళ్లు లేదా కండరాల నొప్పి తరచుగా రావడం ల్యూపస్ మొదటి సంకేతంగా చెప్పవచ్చు. ఈ నొప్పి శరీరానికి రెండు వైపులా ఒకే సమయంలో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మణికట్టు, చేతులు, వేళ్లు, మోకాళ్ల కీళ్ళలో… కీళ్ళు ఎర్రబారినట్లు కనిపిస్తాయి. స్పర్శకు వెచ్చగా అనిపించవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లా ల్యూపస్ శాశ్వత నష్టాన్ని కలిగించదు… ల్యూపస్ చర్మంపైనా విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. ముఖం, మెడ, చేతులతో సహా శరీరంలోని వివిధ భాగాలపై ఎర్రటి మచ్చలు లేదా పొలుసులు,లేదా దద్దుర్లు ఏర్పడతాయి. కొంతమందికి నోటిలో పుండ్లు కూడా వస్తాయి. ముఖ్యంగా మహిళల్లో సీతాకోకచిలుకలా రాష్ లు ఏర్పడతాయి…

ల్యూపస్ ఉన్నవారు విపరీతంగా అలసిపోతారు. ఈ అలసట కారణంగా తరచుగా జ్వరం వస్తూ ఉంటుంది. దీంతో రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించేంత తీవ్రంగా ల్యూపస్ ప్రభావం ఉంటుంది. మరోవైపు ల్యూపస్ ప్రభావంతో చేతి గోళ్లలో మార్పులు వస్తాయి. గోళ్లు నీలం లేదా ఎర్ర రంగులోకి మారతాయి. గోరు బేస్ చుట్టూ వాపు ఉంటుంది. ల్యూపస్ ప్రభావంతో కొంత మంది రేనాడ్స్ సిండ్రోమ్ బారినపడతారు. ఈ వ్యాధిలో చేతులు, కాళ్లు ముందుగా తెల్లగా మారతాయి. ఆ తర్వాత ముదురు ఎరుపు రంగులోకి మారతాయి. చిన్న రక్తనాళాల్లో రక్త ప్రసరణ జరగని కారణంగా తిమ్మిర్లు వస్తాయి…

ల్యూపస్ ఎవరికైనా రావచ్చు. ముఖ్యంగా ఇది పురుషుల కంటే 10 రెట్లు ఎక్కువగా మహిళలపై ప్రభావితం చేస్తుంది. ల్యూపస్ వ్యాధిని నిర్ధారించడం వేర్వేరు వ్యక్తులలో వేరే విధంగా ఉంటుంది. ల్యూపస్ నిర్ధారణ కోసం ఒక పరీక్ష లేనప్పటికీ, కొన్ని ప్రోటీన్లు సాధారణంగా రోగి రక్తంలో కనిపిస్తాయి. యాంటిన్యూక్లియర్ యాంటీబాడీస్ టెస్ట్ ద్వారా ల్యూపస్ ను నిర్ధారించవచ్చు. ల్యూపస్ వ్యాధికి పూర్తి చికిత్స అందుబాటులో లేదు. ఐతే ల్యూపస్ లక్షణాలను నియంత్రించడానికి మార్గాలు ఉన్నాయి. దద్దుర్లు కోసం కార్టికోస్టెరాయిడ్ క్రీములు, కీళ్ల నొప్పి, జ్వరం కోసం నాన్స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు ఉపయోగించుకోవచ్చు. టీమలేరియల్ మందులు కీళ్ల నొప్పులు, పూతల మరియు దద్దుర్లుతో పోరాడటానికి సహాయపడతాయి…

మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ సరిగా పని చేస్తుందో తరచుగా చెక్ చేసుకోవడం చాలా మంచిది. ల్యూపస్ లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి .. తగిన మందులు వాడుకోవాలి.

Leave a Comment