Mental Health – మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం

By manavaradhi.com

Published on:

Follow Us
Mental health: Definition, common disorders, early signs

ఆధునిక జీవన విధానం మనుషులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. శారీరక అనారోగ్యాలతోపాటు మానసిక వ్యాధులను కలిగిస్తోంది. చెప్పుకోలేని మనో వేదనతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది కుంగిపోతున్నారు. ఐతే దీనిపై అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నిస్తోంది. మానసిక సమస్యలున్న వారికి జీవితంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తోంది. మానసికంగా దృఢంగా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పిస్తోంది.

శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం ఉంటేనే పూర్తి ఫిట్ గా ఉన్నట్లు లెక్క. పని ఒత్తిడి, ఇతర సమస్యల కారణంగా చాలామందిలో మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఒత్తిడి తట్టుకోలేక అర్థంతరంగా జీవితాన్ని ముగించేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఆత్మహత్య పరిష్కారం కాదు. ఐతే మానసికంగా ధృఢంగా తయారవడం వల్ల సమస్యను సులభంగా అధిగమించవచ్చు మానసిక విశ్లేషకులు చెబుతున్నారు

ఆధునిక జీవన విధానంలో జీవితం మరీ ఫాస్ట్ గా తయారైంది. ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్లీ రాత్రి పడుకునే వరకు కాలంతోపాటు పరుగుతీయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మానసికంగా చాలా మంది తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అలాగే కొంత మందిలో తీవ్రమైన శారీరక అనారోగ్య సమస్యలు కూడా మానసిక ఒత్తిడికి దారితీస్తున్నాయి. వీటితోపాటు జీవితంలో కుటుంబ సభ్యుల వల్లనో .. ఇరుగుపొరుగు వల్లనో, కలహాల కారణంగా మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. దీంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 లక్షల మంది మనస్థాపంతో కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

భారత దేశంలోనూ ఈ సూసైడల్ టెండెన్సీ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ మానసిక సమస్యలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. డిప్రెషన్‌, యాంగ్జయిటీ, యాంగ్జయిటీ న్యూరోసిస్‌, బైపోలార్‌ డిజార్డర్‌, స్కిజోఫ్రీ నియా, ఇన్‌సోమ్నియా, సుపీరియారిటీ కాంప్లెక్స్‌, ఇల్యూషన్‌, అడిక్షన్‌ లాంటి మానసిక వ్యాధులు తీవ్రంగా వేదిస్తున్నాయి. మనసే మనిషిని నిర్దేశిస్తుంది. మనసు అనేది కన్పించకపోయినా దాని మూల కేంద్రం మెదడే. ఇలాంటి కీలకమైన మెదడును ప్రశాంతగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇతర శారీరక అవయవాలతోబాటు మానసిక ఆరోగ్యం సంతృప్తికరంగా ఉండేలా చూసుకోవాలి.

మనో వేదనకు కారణాలు అనేకం ఉంటాయి. ఒక్కో వ్యక్తిలో ఒక్కో కారణం ఉండవచ్చు. ఐతే జీవితంలో ఎదుర్కున్న సమస్యను పరిష్కరించుకోగలిగితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దీంతో శారీరకంగానూ దృఢంగా తయారవుతారు. శారీరక ఆరోగ్య సమస్యల మాదిరిగానే మానసిక వ్యాధులు కూడా ముందస్తుగానే గుర్తిస్తే చికిత్స చేయడం సులభమే. చాలా మానసిక రోగాలను ప్రస్తుతం చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మానసిక రోగాలకు సరైన మందులు కూడా లభిస్తున్నాయి. వైద్యుల సలహాలు , సూచనల మేరకు వీటిని వాడుకోవాలి.

మానసిక రోగులకు మందులతోబాటు మనోవేదన తగ్గించే చేయూత, ఆత్మీయత అవసరం. అందువల్ల ఆయా వ్యాధి లక్షణాలను, స్థాయిలను అనుసరించి ముందుగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. మానసిక అనారోగ్యాన్ని అశ్రద్ధ చేసినా, చికిత్స మధ్యలో ఆపేసినా పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పూర్తిగా చికిత్స చేయించుకోవాలి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. జీవితంలో గెలవాలన్న తపనను అలవాటు చేసుకోవాలి. చిన్నచిన్న సమస్యలను మనసులో పెట్టుకోకుండా జాగ్రత్తపడాలి. ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోని వారే జీవితంలో గెలవగలరు. దీన్నిగుర్తు పెట్టుకుంటే ఎలాంటి మానసిక రోగాలు దగ్గరికి రావు .

నిత్యం పనులతో బిజిబిజీగా జీవితం గడుపుతున్నా .. రోజులో కనీసం 50 నిమిషాలు . . శారీరక వ్యాయామం కోసం కేటాయించాలి. రోజూ ఉదయం లేదా సాయంత్రం నడవడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. తేలికపాటి వ్యాయామాలు, యోగా , ధ్యానం అలవాటు చేసుకుంటే .. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీటితోపాటు మానసికోల్లాసం కోసం .. తగు విధంగా వినోదం పొందేందుకు ప్రయత్నించాలి. అలాగే కొత్త ప్రదేశాలు తిరిగినా . . మానసికోల్లాసం లభిస్తుంది.

Leave a Comment