Numbness in hands, లేదా చేతులు మొద్దుబారిపోవడం స్పర్శ కోల్పోవడం వెనుక నరాల సమస్యలు ప్రధానమైనవి. ఒక్కో సారి అరుదుగా మెదడు, వెన్ను సమస్యల వల్ల కూడా చేతులు మొద్దుబారిపోయే సమస్యకి కారణాలు కావచ్చు. సమస్య తీవ్రత ని బట్టి చికిత్స తో పాటుగా జీవన శైలి మార్పులు అవసరం పడతాయి.
చేతులు ముఖ్యంగా అరిచేతుల నరాలు తిమ్మిరెక్కినట్టు, చేతుల్లో స్పర్శ తెలియక మొద్దు బారినట్టు అనిపించే సమస్య తీవ్రంగా ఉంటే దాని వెనుక పలు కారణాలు ఉండొచ్చు. వాటిల్లో అత్యంత సాధారమైది నరాల సమస్య కావచ్చు. చేతుల్లో మణికట్టులో, ఒకటి లేదా పలు నరాలు damage కావడం, లేదా నొక్కుకొని పోవడం అంటే కంప్రెస్ కావడం కారణం కావచ్చు. ఇక నరాలను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా డయబెటిస్ వల్ల కూడా చేతులు మొద్దు బారే అవకాశం ఉంది. కాకపోతే డయబెటిస్ వల్ల పాదాల్లో ముందుగా numbness తెలుస్తుంది.
మెదడు వెన్నుపాము సంబంధ కొన్ని అరుదైన ఆరోగ్య సమస్యలు కూడా చేతుల్లో numbness కి కారణం కావచ్చు. కాకపోతే numbness తో పాటుగా బలహీనత కూడా ఈ సమస్య కారణంగా ఉండొచ్చు. ఒకటి లేదా రెండు చేతుల్లో ఉండే numbness కి ఇతర కారణాలు.. ఆల్కహాల్ use disorder, కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్, సర్వైకల్ స్పాండిలోసీస్, లైమ్ డీసీస్, మల్టీపుల్ స్క్లిరోసిస్, గల్లీయన్ ( gulliyan) బ్యారి సిండ్రోమ్, గ్యాంగ్లియన్( ganglian) సిండ్రోమ్ ,రేనాడ్స్ డీసీస్, stroke, సిఫిలస్, వ్యాస్కులైటీస్ ,విటమిన్ బి లోపం . ఇక కిమో థెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా కూడా numbness in హండ్స్ చూడచ్చు. చికిత్స ఆయా కారణాల ఆధారంగా ఉంటుంది. కారణం ఏంటి అని తెలుసుకొనేందుకు కొన్ని వైద్య పరీక్షలు అవసరం పదవచ్చు.
ఎలాంటి ప్రమాదకర ఆరోగ్య సమస్య లేకుండా కేవలం కొన్ని ఆహార మార్పుల ద్వారా చేతుల్లో తిమ్మిర్ల సమస్య ని నయం చేసుకొనే తరహా బి 12 విటమిన్ డెఫిషిఎన్సీ. ఇది సాధరణంగా పెరిగే పిల్లల్లో యుక్త వయస్కుల్లో చూడచ్చు. సరి అయిన మోతాదుల్లో విటమిన్ బి తీసుకొని కారణంగా చేతుల్లో కాళ్లలో తిమ్మిర్లు రావచ్చు. ఇక ప్రెగ్నెన్సి లో కూడా ఒక్కో సారి వాటర్ రిటెన్షన్ వల్ల చేతుల్లో numbness, టింగ్లింగ్ సెన్సేషన్ అంటే తిమ్మిర్లు ఎక్కిన ఫీలింగ్ చూస్తూ ఉంటాం. బి విటమిన్ లోపం వల్ల నరాల పని తీరు దెబ్బతింటుంది కాబట్టి బి కాంప్లెక్స్ విటమిన్ తీసుకోవడం ద్వారా లేదంటే ఆహారం లో బి విటమిన్ ఉండే ఫూడ్స్ ని పుష్కలంగా తీసుకోవడం ద్వారా ఉపసమనం పొందవచ్చు. ఇక కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ లో భాగంగా ఒకే పోసిషన్ లో కూర్చొని చేతులను ఒకే movements తో పని చేసే వారిలో కూడా కొన్ని అనుకూలత్మక మార్పులను చేసుకోవడం ద్వారా సమస్యని అధికమించవచ్చు.
- ఒకటి లేదా రెండు చేతుల్లో స్పర్శ కోల్పోయి మొద్దు బారిపోవడం సమస్య తీవ్రత ఎలా తెలుసుకోవాలి ? ఎపుడు ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసు కోవాలి అని చూస్తే
- అకస్మాత్తుగా మొదలై, బలహీనత తో పాటుగా పెరాలసిస్ లక్షణాలను పోలి ఉంటే,
•దీని తో పాటుగా మాట్లాడడంలో ఇబ్బంది, తల తిరిగినట్టుగా, విపరీతమైన తలనొప్పి ఉన్నా ఎమెర్జెన్సీ గా పరిగణించి వైద్య సహాయం తీసుకోవాలి
•వీటితో పాటుగా ఒక వేళ numbness కనుక రెండు వారాలపైగా బాధిస్తూ
•నెమ్మదిగా మొదలై రోజు గడుస్తున్న కొద్దీ ఎక్కువ అవుతుంటే
•మిగతా శరీర భాగాలకి కూడా వ్యాపిస్తున్నా - వస్తూ పోతు ఉన్నా
•కొన్ని పనులు చేస్తుంటే ఎక్కువ అవుతున్నా
•ఒక చేతిలో ఒక వేలు మాత్రమే తిమ్మిరి ఎక్కుతున్నా వెంటనే వైద్య సహాయం తీసుకోవడం మంచిది.