Osteoporosis : వయసుతోపాటు వచ్చే కీళ్లు, మోకాళ్ల అరుగుదలకి చెక్ పెట్టొచ్చు..!

By manavaradhi.com

Published on:

Follow Us
Osteoporosis

ఆస్టియోపొరోసిస్ అనేది చాప‌క్రింద నీరులా విస్త‌రిస్తుంది. ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ వారి డేటా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆస్టియోపోరోసిస్ తో దాదాపు 200 మిలియన్ జనాభా ఇబ్బందిపడుతున్నారని తెలిపింది. శారీర‌కంగా అనేక స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది. దీనివల్ల ఎముక‌లు బ‌ల‌హీన‌ప‌డ‌తాయి. చాలామందికి ఆస్టియోపొరోసిస్ వ్యాధి వ‌చ్చిన విష‌యం అంత త్వ‌ర‌గా తెలియ‌దు. నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసిన త‌ర్వాతే బ‌య‌ట‌ప‌డుతుంది. అల‌స‌ట‌, నొప్పి అనేవి ఆస్టియోపొరోసిస్ సాధార‌ణ ల‌క్ష‌ణాలు. భుజాలు, ఛాతి ఎముక‌లు, మోకాళ్లు త‌దితర భాగాల్లో తీవ్ర నొప్పి ఉంటుంది. అందువల్ల వీరు బ‌రువులు ఎత్త‌కూడ‌దు. చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణంలో బ‌య‌ట‌కు వెళ్ల‌రాదు. చాలామంది గంట‌ల త‌ర‌బ‌డి కూర్చోవ‌డం లేదా నిల‌బ‌డ‌టం చేస్తుంటారు. అలా చేయ‌డం మంచి ప‌ద్ద‌తికాదు. దీనివ‌ల్ల నొప్పి అంత‌కంత‌కూ పెరుగుతుందే కానీ త‌గ్గ‌దు.

ఆస్టియోపోరోసిస్ ఒక మెటబాలిక్ వ్యాధి. ఎముకలు బలహీనపడి పెలుసుబారడం ఈ వ్యాధి లక్షణం. సాధారణంగా చిన్నపాటి ప్రమాదాలకు గురైనపుడు ఎముకలు విరగడం జరుగుతుంది, ఆస్టియోపోరోసిస్ శరీరంలోని ఏ ఎముకపై అయినా ప్రభావం చూపించవచ్చు, కానీ సాధారణంగా తుంటి ఎముక, వెన్నెముక, మణికట్టు ఎముకలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఆస్టియోపొరోసిస్ ఉన్న వ్యక్తి విషయంలో ఎముక నష్టం యొక్క నికర రేటు తన వయసులో ఉండవలసిన సాధారణ మోతాదుకన్నా ఎక్కువగా ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ లో ఫిజియోథెరపీ పద్దతులను ఉపయోగిస్తారు. అన్ని కీళ్ళకు యాక్టివ్ వ్యాయామాలు చేయించడం, పగుళ్లు నివారించేందుకు ముందు జాగ్రత్తగా బ్రేసింగ్ పద్దతి ద్వారా వెన్నెముకను బలపరచడం, కండరాలను బలపరిచేటటువంటి అన్ని సాధారణ వ్యాయామాలు చేయించడం, వాకింగ్ లేదా జంపింగ్ వంటి వ్యాయామాలు ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి. అందువల్ల బోలు ఎముకల సమస్యను నివారించేందుకు చేసే వ్యాయామాలు నిపుణుల పర్యవేక్షణతోనే చేయాలి.

బోలు ఎముకల సమస్యను నివారించాలంటే కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాలి. ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఆహారంలో క్యాల్షియం ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్ గా వ్యాయామాలు చేయాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. విటమిన్ D అందేలా చూసుకోవాలి. తగినన్ని ఖనిజాలు, ప్రోటీన్లు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. యుక్త వయసు నుంచే ఎముకల ఆరోగ్యం మీద శ్రద్ద కనబరిస్తే ఆస్టియోపొరోసిస్ వ్యాధి ప్రభావం వయసుపైబడుతున్న దశలో మరికొంత కాలం వాయిదా వేయవచ్చు.

Leave a Comment