శరీరంలోని అన్ని అవయవాలకు సమాచారమిచ్చి వాటి విధులు అవి నిర్వర్తించుకోవడంలో కీలకభూమిక పోషించే మెదడు పలు రకాల వ్యాధులకు గురవుతున్నది. ఎంతో ప్రధానమైన విధులు చేపట్టే మెదడుకు మెనంజైటిస్ వ్యాధి వచ్చే ఏమవుతుంది..? ఈ వాపును తగ్గించుకోవడం ఎలా..?
మనిషి తలలో మూడు ఫౌండ్ల బరువుండే మాంసపు ముద్దనే మెదడు. దీని కిందిభాగంలో వెన్నుపాము ఉంటుంది. దీని నుంచి దేహం అంతటికి నాడులు విస్తరించి శరీరంలోని అవయవాలకు అవి చేయాల్సిన పనులకు సంబంధించిన సంకేతాలను పంపుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న మెదడు.. ముఖ్యంగా మెదడు వాపు, క్షయ, పక్షవాతం వంటి వ్యాధులు పీడిస్తున్నాయి. మెదడువాపు వ్యాధి అనేది వెన్నెముక, మెదడు చుట్టూ ఉండే ద్రవాలకు బ్యాక్టీరియా వల్లగానీ వైరస్ వల్లగానీ ఇన్ఫెక్షన్ సోకడంవల్ల వస్తుంది. మెదడు, వెన్నుపాములో మంటకు దారితీస్తుంది. హాస్లళ్లు, తరగతి గదుల ద్వారా త్వరగా వ్యాపిస్తుంది. టీనేజ్ వారు అద్దాలు, పాత్రలు వంటి వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం ద్వారా, ముద్దు పెట్టుకోవడం ద్వారా ఈ సూక్ష్మక్రిములు ఒకరి నుంచి మరొకరికి చేరుతాయి.
శరీరంలో ఏ భాగంలోనైనా ముఖ్యంగా తలలో వుండే అవయవాలనుంచి రక్తంద్వారా క్రిములు మెదడుకి చేరడంతో ఇక్కడి పొరలు ఇన్‌ఫెక్ట్ అవుతాయి. పుర్రెకి గట్టి దెబ్బ తగలడంవల్లా రావచ్చు. ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు జ్వరం, తలనొప్పి, తల తిరగడం, వాంతులు లాంటి లక్షణాలే కాకుండా మెదడు బిగుసుకుపోవడం, ఎక్కువ వెలుతురుని చూడలేకపోవడం లాంటి లక్షణాలూ కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. ట్యుబర్‌క్యులోసిస్ మెనంజైటీస్ వ్యాధి కారణంగా కూడా మెదడు పొరల్లో వాపు కనిపిస్తుంది. చిన్నారుల్లో మెనంజైటిస్ వ్యాధి కనిపించకుండా ఉండేందుకు ముఖ్యంగా వారికి 10 ఏళ్ల వయసులోనే వ్యాక్సిన్లు ఇప్పించాలి. అలాగే కాలేజీలో చేరిన సమయంలో మరో డోస్ ఇప్పించాలి.
వయల క్తిగత పరిశుభ్రతతో మెదడుపొరల్లో వాపు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. ఈ వ్యాధి సూక్ష్మక్రిముల కారణంగాగానీ, వ్యాధి వచ్చినవారిని తాకడం వల్ల గానీ సోకుతున్నందున బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇంట్లోగానీ, బయటగానీ వ్యక్తిగత వస్తువులు గానీ, ఆహారాలను గానీ షేర్ చేసుకోవద్దు. ఇంట్లోగానీ, బయటగానీ అతిసన్నిహితంగా మెలగడం చేయకూడు. ముద్దులు పెట్టుకోవడం మానుకోవాలి. కంట్లోగాని, ముక్కులోగాని, నోట్లోగానీ వేళ్లుపెట్టుకొనే అలవాటును పక్కనపెట్టాలి. నివసించే ప్రాంతం, నిద్రించే బెడ్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తుమ్మే సమయంలో నోటికి చేతులు అడ్డుపెట్టుకోవాలి. ఇదివరకే తీసుకొంటున్న యాంటీ బయోటిక్స్‌పై కన్నేసి ఉంచాలి. పాలకూర, బ్రకోలి వంటి ఆకుకూరలు, స్ట్రాబెర్రీలు, ఆరంజ్, క్యాంటలోప్ వంటి పండ్లను తినాలి. నట్స్, పెరుగు, పాల ఉత్పత్తులు తీసుకొంటూ ఉండాలి. మంచి నిద్రను కలిగి ఉండటం వల్ల కూడా మెదడులో పొరల్లో వాపు రాకుండా చూసుకోవచ్చు.
రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారేందుకు దోహదపడే సిగరెట్ తాగడం, గుట్కా తినడం, ఖైనీ నమలడంవంటి చెడు అలవాట్లను మానుకొనేలా చేయడం చాలా ముఖ్యం. మెదడు పొరల్లో వాపు లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యుడిని కలిసి చికిత్స ఇప్పించడం మరువద్దు.